S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/08/2017 - 08:24

న్యూఢిల్లీ, జనవరి 7: ఇరవై ఐదవ ప్రపంచ పుస్తక ప్రదర్శన శనివారం ఇక్కడ ప్రారంభమైంది. కేంద్ర మానవ వనరులు శాఖ సహాయ మంత్రి మహేంద్రనాథ్ పాండే పుస్తక ఉత్సవాన్ని ప్రారంభించారు. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ ఎగ్జిబిషన్‌లో దేశ, విదేశాలకు చెందిన 800కు పైగా పబ్లిషర్స్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఢిల్లీలో ప్రారంభమైన ఈ బుక్ ఎగ్జిబిషన్ ఆసియాలోనే అతిపెద్దది.

01/08/2017 - 08:22

శ్రీనగర్/సిమ్లా/నైనిటాల్, జనవరి 7: ఉత్తరాది రాష్ట్రాల్లో శనివారం భారీగా మంచు కురిసింది. దీంతో కాశ్మీరులో జనజీవనం స్తంభించిపోగా, హిమాచల్‌ప్రదేశ్ తీవ్రమైన చలితో వణికిపోయింది. అలాగే ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన నైనిటాల్ పట్టణం రెండేళ్ల తర్వాత మళ్లీ మంచు దుప్పటి కప్పుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా, కిన్నౌర్ ప్రాంతంలో భారీగా మంచు కురవడం ప్రస్తుత సీజన్‌లో ఇదే తొలిసారి.

01/08/2017 - 08:22

పాట్నా, జనవరి 7: బిహార్‌లో మద్యనిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి అతిపెద్ద మానవహారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మొదట ఈ నెల 21న ఈ మానవహారాన్ని 5 వేల కిలోమీటర్ల పొడవునా నిర్వహించాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ భావించారు.

01/08/2017 - 08:20

మీరట్, జనవరి 7: భారతీయ జనతా పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు సాక్షి మహరాజ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో జనాభా పెరుగుదలకు ముస్లింలే కారణమని ఆయన శనివారం పరోక్ష వ్యఖ్యలు చేశారు. ‘దేశంలో జనాభా పెరుగుదలకు నలుగురు భార్యలు, 40 మంది పిల్లలు ఉన్నవారే బాధ్యులు. జనాభా పెరుగుదలకు హిందువులు కారణం కాదు’ అని ఆయన శుక్రవారం ఇక్కడ జరిగిన ‘సంత్ సమ్మేళన్’లో మాట్లాడుతూ అన్నారు.

01/08/2017 - 08:19

చెన్నై, జనవరి 7: చెన్నై నగర మంచినీటి అవసరాలకోసం వెంటనే కృష్ణా జలాలను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాల వల్ల కురవవలసినంత వర్షాలు కురవకపోవడంతో చెన్నై నగరానికి మంచినీటిని సరఫరా చేసే జలాశయాలు నిండలేదు.

01/08/2017 - 08:18

న్యూఢిల్లీ, జనవరి 7: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని అధ్యక్షుడుగా ఎంపిక చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 11న టల్కటోరాలో ఏర్పాటు చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడుగా నియమించాలనే తీర్మానాన్ని ఆమోదించే అవకాశాలున్నట్లు తెలిసింది.

01/08/2017 - 06:46

న్యూఢిల్లీ, జనవరి 7: పేదల అభ్యున్నతే తన ప్రభుత్వ లక్ష్యమని, పేదలకు సేవ చేయడం దేవుడికి సేవ చేయడంతో సమానమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేయటం పేదల జీవితాలను మెరుగుపరిచే దిశలో ప్రయోగించిన దీర్ఘకాలిక అస్తమ్రని అన్నారు. ఇక్కడ జరుగుతున్న బిజెపి జాతీయ కార్యకవర్గ సమావేశాల్లో ఆయన శనివారం ముగింపు ఉపన్యాసం చేశారు.

01/07/2017 - 05:22

చిత్రం..బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల వేదికపై అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీలకు
సూచనలిస్తున్న సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ

01/07/2017 - 02:24

భద్రాచలం, జనవరి 6: దండకారణ్యం, ఏఓబి మావోయిస్టుల విప్లవ కారిడార్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఆదివాసీల బతుకు ఛిద్రవౌతోంది. వారు అటు నక్సల్స్, ఇటు పోలీసుల బుల్లెట్ల పోరులో నలిగిపోతున్నారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నారు. దట్టమైన అడవులు, కీకారణ్యంలో కాలిబాటలు, వాగులు, కొండలే వారి నేస్తాలు. రోగం వచ్చినా, రొప్పు వచ్చినా దేవుడే దిక్కు.

01/07/2017 - 02:15

కౌటాల, జనవరి 6: తెలంగాణ, మహారాష్ట్ర సరిహాద్దుల్లో గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో హైదరాబాద్-కాజీపేట మార్గాల్లో పలు రైళ్లు రద్దు చేశారు. మరికొన్నింటిన దారి మళ్లించి నడిపారు. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ సంఘటన జరిగింది.

Pages