S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/06/2017 - 02:03

న్యూఢిల్లీ, జనవరి 5: త్వరలో అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తీవ్రమైన నేరాల కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న వ్యక్తులను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించ వచ్చా, విచారణ ఏ దశలో ఓ ప్రజాప్రతినిధి అనర్హతకు గురవుతాడనే అంశాలపై నిర్ణయించడానికి త్వరలోనే అయిదుగురు న్యాయమూర్తులతో విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు గురువారం తెలియజేసింది.

01/06/2017 - 02:01

న్యూఢిల్లీ, జనవరి 5: ఐదు రాష్ట్రాల శాసన సభల పోలింగ్ ముగిసిన అనంతరం కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రతిపాదించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. కాంగ్రెస్, జెడియు, తృణమూల్ కాంగ్రెస్ తదితర ఎనిమిది పార్టీల నాయకులు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నసీం జైదీని కలిసి ఒక వినతిపత్రం అందజేశారు.

01/06/2017 - 01:59

డెహ్రాడూన్, జనవరి 5: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వస్తానన్న ధీమాను బిజెపి వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ను ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మున్నా సింగ్ చౌహాన్ స్వాగతించారు. ఒకే దశలో ఫిబ్రవరి 15న పోలింగ్ జరుగనుంది. ‘ఎన్నికలను ఎదుర్కోవడానికి మేము పూర్తిగా సిద్ధమయ్యాం.

01/06/2017 - 01:59

న్యూఢిల్లీ, జనవరి 5: ఆధార్ పథకం రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్ల సత్వర విచారణకు సుప్రీంకోర్టు గురువారం నిరాకరిస్తూ, అయితే ప్రైవేట్ ఏజన్సీలు దీనికి సంబంధించిన డేటా సేకరించడం మంచి ఆలోచన కాదని వ్యాఖ్యానించింది.

01/06/2017 - 01:58

బెంగళూరు, జనవరి 5: నగర నడిబొడ్డున మహిళపై లైంగికదాడి కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి. విధులు ముగించుని ఇంటికి వస్తున్న మహిళపై తెగబడ్డ నిందితుల్లో ఒకడు ఐఐటి గ్రాడ్యుయేట్. బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ప్రవీణ్ సూద్ గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. ఐఐటి గ్రాడ్యుయేట్ అయ్యప్ప సూత్రధారి.

01/06/2017 - 01:53

న్యూఢిల్లీ, జనవరి 5: పెద్ద నోట్ల రద్దు తర్వాత రద్దయిన నోట్లలో దాదాపు 97 శాతం నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చేశాయంటూ మీడియాలో వచ్చిన కథనాలపై రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) స్పందించింది. వార్తాసంస్థలు, సంబంధిత ఏజన్సీలు వెలువరించిన రిపోర్టులు సరైనవి కావని గురువారం తేల్చేసింది.

01/06/2017 - 01:50

భోపాల్, జనవరి 5: కొత్త కరెన్సీ నోట్ల ముద్రణలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవల్సిన అధికారులు గాలికొదిలేస్తున్నారు. పని వత్తిడి వల్లే 500 రూపాయల నోట్ల ముద్రణలో తప్పిదాలు జరిగాయని ఇటీవల చెప్పుకొచ్చిన ఆర్‌బిఐ భోపాల్‌లో మహాత్మాగాంధీ బొమ్మ లేకుండా 2000 ఓ వ్యక్తి చేతికి వచ్చిన రూపాయల నోటుకు ఏ సమాధానం చెబుతారో చూడాలి.

01/06/2017 - 01:56

పాట్నా, జనవరి 5: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రంలో మద్యంపై యుద్ధం ప్రకటించినందుకు నితీశ్‌ను అభినందించిన ప్రధాని మద్య నిషేధం విజయవంతం కావడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘మద్యపానంపై ఉద్యమాన్ని ప్రారంభించినందుకు నితీశ్ కుమార్‌ను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను’ అని ప్రధాని మోదీ అన్నారు.

01/06/2017 - 01:23

లక్నో, జనవరి 5: ఉత్తరప్రదేశ్‌లోని అధికార సమాజ్‌వాది పార్టీ నాయకత్వం అయోమయంలో పడిపోయింది. తండ్రీ కొడుకుల మధ్య నిట్టనిలువునా చీలిపోయిన ఈ పార్టీ భవితవ్యం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ములాయంసింగ్ సారథ్యంలోని ఒక వర్గం, ముఖ్యమంత్రి అఖిలేష్ సారథ్యంలోని మరో వర్గం పార్టీ గుర్తయిన సైకిల్ కోసం నువ్వా నేనా అన్న రీతిలో పోటీపడటంతో ఇక రాజీ కథ కంచికేనన్న వాదన బలంగా వినిపిస్తోంది.

01/06/2017 - 00:47

న్యూఢిల్లీ, జనవరి 5: పెద్ద నోట్ల రద్దు కారణంగా తలెత్తిన సమస్యల నుంచి పేదలకు తక్షణమే, ఇప్పటికిప్పుడే ఉపశమనం కలిగించాల్సిన అవసరం ఎంతో ఉందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఉద్ఘాటించారు. తమ సమస్యల పరిష్కారం కోసం నిరీక్షించే ఒపిక వీరికెంత మాత్రం ఉండదని తేల్చిచెప్పారు. పెద్దనోట్ల రద్దు వల్ల తాత్కాలికంగా దేశ ఆర్థిక వ్యవస్థ మందగించే అవకాశం ఉందని కూడా స్పష్టం చేశారు.

Pages