S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/10/2019 - 13:03

న్యూఢిల్లీ: ప్రధాని మోదీతో గవర్నర్ నరసింహాన్ బుధవారంనాడు భేటీ అయ్యారు. రెండురోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన ఆయన ప్రధానితో భేటీ అయి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పరిస్థితులను వివరించారు. తన పర్యటనలో భాగంగా ఆయన రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది.

01/10/2019 - 12:56

న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మహిళాకమిషన్ నోటీసులు జారీ చేసింది. రఫెల్ చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వలేక రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ వెనుక దాక్కొని పారిపోయినట్లు టీవీ ఛానెల్స్‌లోనూ, వార్తాపత్రికలలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించింది. ఓ మహిళా గౌరవ సభ్యురాలిని అవమానపరిచే విధంగా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నట్లు ఆ నోటీసులో పేర్కొంది.

01/10/2019 - 12:54

న్యూఢిల్లీ: అయోధ్య కేసు విచారణఈనెల 29వ తేదీకి వాయిదా పడింది. అయోధ్య కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ యూయూ లలత్ కోర్టు తీర్పుకు ముందే ప్రకటించటంతో మళ్లీ ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. జస్టిస్ లలత్ ఇదే కేసులో కల్యాణ్ సింగ్ తరపున వాదించినట్లు అడ్వకేటు ధావన్ పేర్కొనటంతో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. ఆయన స్థానంలో మరొకర్ని నియమించాల్సి ఉంది.

01/10/2019 - 04:04

సోలాపూర్: సామాజిక న్యాయం సాధనలో భాగంగా జనరల్ కేటగిరీలో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపిందని, అందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ప్రతిసంక్షేమాన్ని, అన్ని వర్గాలకు మేలు చేసే ప్రభుత్వ లక్ష్యాలను నీరుకార్చడమే ధ్యేయంగా పనిపెట్టుకుని దుష్ప్రచారం చేయడం కాంగ్రెస్‌కు అలవాటైందన్నారు.

01/10/2019 - 03:25

న్యూఢిల్లీ, జనవరి 9: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలోనే మరిన్ని ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటిస్తారని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు.

01/10/2019 - 03:16

న్యూఢిల్లీ, జనవరి 9: అగ్రవర్ణాల పేదలకు (ఈబీసీలకు) పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం రాజ్యసభలో ప్రతిపాదించిన బిల్లుకు తెలుగుదేశం పార్టీ సంపుర్ణ మద్దతు ఇచ్చింది. ఈబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తు కేంద్రం ప్రతిపాదించిన బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ పాల్గొన్నారు.

01/10/2019 - 02:59

న్యూఢిల్లీ, జనవరి 9: దేశంలోని కోట్లాది మంది వెనుకబడిన కులాల ప్రజలకు ఇప్పుడిస్తున్న 27 శాతం రిజర్వేషన్లను మరింత పెంచేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించాలని బీఎస్పీ పక్షం నాయకుడు సతీష్‌చంద్ర మిశ్రా డిమాండ్ చేశారు. బుధవారం రాజ్యసభలో ఉన్నత వర్గాలకు చెందిన బీదవారికి విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుపై మాట్లాడుతూ ఈ డిమాండ్ చేశారు.

01/10/2019 - 02:47

జైపూర్. జనవరి 9: రైతులకు న్యాయం చేయడంలో విఫలమైన బీజేపీ ప్రభుత్వానికి హిందీబెల్ట్‌లోని రాష్ట్రాలు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి షాక్ ఇచ్చాయని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాలు పునరావృతమవుతాయని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు.

01/10/2019 - 02:43

న్యూఢిల్లీ, జనవరి 9: కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నదని, ఇందుకు నిరసనగా చేపట్టిన రెండు రోజుల సమ్మె విజయవంతమైందని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఎన్నో నగరాలు, పట్టణాల్లో కార్మికులు ర్యాలీలు, నిరసన ప్రదర్శనలను నిర్వహించినట్టు పేర్కొంది. కార్మిక సంక్షేమ పథకాలను అమలు చేయాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారని తెలిపింది.

01/10/2019 - 02:35

కోల్‌కతా, జనవరి 9: పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, బోల్పూర్ పార్లమెంటు సభ్యుడు అనుమప్ హజ్రాపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వేటు వేసింది. అంతకు ముందు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరిన బిష్ణుపూర్ లోక్‌సభ సభ్యుడు సౌమిత్ర ఖాన్‌ను కూడా టీఎంసీ బహిష్కరించింది.

Pages