S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/22/2016 - 00:59

న్యూఢిల్లీ, నవంబర్ 21: సుప్రీంకోర్టులో జరూసలెం మత్తయ్య కేసు విచారణ రెండు వారాలు వాయిదా పడింది. ఓటుకు నోటు కేసులో మత్తయ్య పేరును చార్జ్‌షీట్ నుండి తొలగిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) అధికారులు సుప్రీంకోర్టులో సవాలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

11/22/2016 - 00:17

భారత నావికా దళంలోకి మరో కొత్త నౌక చేరింది. ముంబయలోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన ‘ఐఎన్‌ఎస్ చెన్నై’ యుద్ధ నౌకను రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ సోమవారం నౌకా దళానికి అప్పగించారు. ఈ నౌక 60 శాతం భారత్‌లోనే తయారు కాగా, సెన్సార్లు, ఆయుధాల వంటి వాటిని రష్యా, ఇజ్రాయెల్ దేశాలు సమకూర్చాయ.

11/22/2016 - 00:14

పుఖ్రాయన్, నవంబర్ 21: ఉత్తరప్రదేశ్‌లో ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ప్రమాదంలో మృతుల సంఖ్య 143కు పెరిగింది. కాన్పూర్ రూరల్ ఏరియాలోని పుఖ్రాయన్‌లో పట్టాలు తప్పి నుజ్జునుజ్జయిన రైలు బోగీల నుంచి క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చే కార్యక్రమాన్ని సహాయ సిబ్బంది ఆదివారం రాత్రంతా కొనసాగించారు. పట్టాలు తప్పి ధ్వంసమైన మొత్తం 14 బోగీలను ట్రాక్‌ల పైనుంచి తొలగించారు.

11/22/2016 - 00:12

న్యూఢిల్లీ, నవంబర్ 21: నోట్ల రద్దుకు సంబంధించిన కేసులన్నిటినీ ఒక హైకోర్టుకు కానీ, సుప్రీంకోర్టుకు కానీ బదిలీ చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఈ నెల 23న (బుధవారం) విచారించనుంది.

11/22/2016 - 00:11

న్యూఢిల్లీ, నవంబర్ 21: పార్లమెంటు ఉభయ సభలు నాలుగోరోజు సోమవారం కూడా ఎలాంటి కార్యక్రమాలను చేపట్టకుండానే గొడవలు, గందరగోళం మధ్య మంగళవారానికి వాయిదాపడ్డాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వివాదం మూలంగా లోక్‌సభ రెండుసార్లు వాయిదా పడితే, రాజ్యసభ నాలుగుసార్లు వాయిదా పడిన అనంతరం మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడక తప్పలేదు.

11/22/2016 - 00:09

బంగర్‌వౌ (ఉత్తరప్రదేశ్), నవంబర్ 21: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కలల ప్రాజెక్టు ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ హైవే సోమవారం ప్రారంభమయింది. భారత వాయుసేన (ఐఎఎఫ్) యుద్ధ విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ అయ్యేందుకు అవసరమైన సౌకర్యాలతో కూడిన ఈ హైవేను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) అధినేత ములాయం సింగ్ యాదవ్ జన్మదినమైన నవంబర్ 21న ప్రారంభించడం విశేషం.

11/22/2016 - 00:03

న్యూఢిల్లీ, నవంబర్ 21: దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్)లో ప్రాంతీయ సహకారానికి తీసుకునే ప్రతి చర్యను అడ్డుకుంటున్న పాక్ వైఖరిని భారత్ తీవ్రంగా దుయ్యబడ్తూ, దీనివల్ల ఈ ప్రాంతంలోని దేశాలు ‘బిమ్‌స్టెక్’లాంటి ఇతర ప్రత్యామ్నాయాలను వెతుక్కునేలా చేస్తుందని హెచ్చరించింది.

11/22/2016 - 00:02

లక్నో, నవంబర్ 21: సంకీర్ణానికి సమాజ్‌వాది నేత ములాయం నో చెప్పటంతో ఉత్తరప్రదేశ్‌లో జనతా పరివార్ కొత్త కూటమికి తెరలేపింది. రాష్ట్రీయ లోక్‌దళ్, యునైటెడ్ జనతాదళ్‌లతోపాటు మరో స్థానిక పార్టీ కూటమిగా ఏర్పడుతున్నట్లు ఆరెల్డీ అధినేత అజిత్‌సింగ్ సోమవారం ప్రకటించారు. తమ కూటమి రాష్ట్రంలోని మొత్తం 403 స్థానాలకు పోటీ చేస్తుందని ఆయన తెలిపారు.

11/22/2016 - 00:01

న్యూఢిల్లీ, నవంబర్ 21: గర్భాన్ని అద్దెకిచ్చే విధానం (సరోగసీ) వ్యాపారమయం కావడాన్ని నిరోధించే బిల్లును కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను ఆకస్మికంగా రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తుండడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్న సమయంలోనే సరోగసీ (నియంత్రణ) బిల్లు-2016ను మంత్రి సభలో ప్రవేశపెట్టారు.

11/22/2016 - 00:01

కోచి, నవంబర్ 21: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం పేరు మారింది. శబరిమల శ్రీ ధర్మ శాస్త్ర ఆలయం పేరును శబరిమల శ్రీ అయ్యప్పస్వామి ఆలయంగా మార్చినట్టు ఆలయ పరిపాలన విభాగం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డునుంచి ఆదేశాలు వెలువడ్డాయి. కేరళలోని పతనంతిట్ట జిల్లాలో దట్టమైన అడవుల్లో అయ్యప్ప స్వామి వేంచేశారు. ఆలయం పేరు మారుస్తూ గత నెల 5న జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

Pages