S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/22/2016 - 00:00

న్యూఢిల్లీ, నవంబర్ 21: పెద్ద నోట్ల రద్దు కారణంగా బ్యాంకులు, ఎటిఎంల వద్ద ఓ వైపు భారీ క్యూలు ఉంటుండగా, మరో వైపు కేంద్ర ప్రభుత్వంలోని గ్రూపు-సి ఉద్యోగులు సోమవారంనుంచి తమ నవంబర్ నెల జీతంలో పది వేల రూపాయల నగదును అడ్వాన్స్‌గా తీసుకోవడం ప్రారంభించారు. హోం మంత్రిత్వ శాఖలో పని చేస్తున్న దాదాపు వెయ్యి మంది గ్రూప్-సి ఉద్యోగులకు కూడా పది వేల రూపాయల నగదును వేతన అడ్వాన్స్‌గా చెల్లించారు.

11/22/2016 - 00:00

ఢెంకనాల్, నవంబర్ 21: ఒడిశాలోని ఢెంకనాల్‌లో ఉన్న రాష్ట్ర గ్రామీణ బ్యాంక్ శాఖనుంచి 1.15 కోట్ల రూపాయల విలువైన రద్దయిన వెయ్యి, 500 రూపాయల నోట్లను దోచుకుపోయారని పోలీసులు సోమవారం తెలిపారు. శని, ఆదివారాలు సెలవుల అనంతరం సోమవారం బ్యాంక్‌ను తెరిచినప్పుడు ఈ దోపిడీ వెలుగులోకి వచ్చిందని టౌన్ పోలీసు స్టేషన్ ఇన్‌చార్జి అభినవ్ దౌలా చెప్పారు.

11/21/2016 - 04:01

పనాజీ, నవంబర్ 20: ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యానికి 2016 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక శతాబ్దపు అవార్డు లభించింది. 47వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) ప్రారంభం సందర్భంగా ఆదివారం ఈ సమున్నత పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు. తనకు లభించిన ఈ అవార్డును తన తల్లికి, దేశ ప్రజల భద్రత కోసం ప్రాణాలర్పించిన సైనికులకు అంకితం చేస్తున్నానని ఈ సందర్భంగా ఎస్పీ ప్రకటించారు.

11/21/2016 - 03:39

పనాజీ, నవంబర్ 20:ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యానికి 2016 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక శతాబ్దపు అవార్డు లభించింది. 47వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) ప్రారంభం సందర్భంగా ఆదివారం ఈ సమున్నత పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు.
తనకు లభించిన ఈ అవార్డును తన తల్లికి, దేశ ప్రజల భద్రత కోసం ప్రాణాలర్పించిన సైనికులకు అంకితం చేస్తున్నానని ఈ సందర్భంగా ఎస్పీ ప్రకటించారు.

11/21/2016 - 03:51

మాల్దా, నవంబర్ 20: పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పటి వరకు అనేక మంది ప్రాణాలను బలిగొన్న నేపథ్యంలో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎన్ని సార్లు తిరిగినా బ్యాంకు నుంచి నగదు రాకపోవటం, కుటుంబాన్ని పోషించలేక గోవింద్ సర్కార్ అనే ఈ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెప్తున్నారు.

11/21/2016 - 03:36

ముంబయి, నవంబర్ 20: బాబ్రీ మసీదుకు ముప్పు పొంచి ఉన్న విషయాన్ని అనేక సాక్ష్యాలు వెల్లడించినప్పటికీ ఆ మసీదును కేంద్రం నియంత్రణలోకి తీసుకు రాకపోవడం అప్పటి పివి నరసింహారావు ప్రభుత్వం చేసిన ‘వినాశకరమైన రాజకీయ తప్పిదం’ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం అన్నారు.

11/21/2016 - 02:12

న్యూఢిల్లీ, నవంబర్ 20: పెద్ద నోట్ల రద్దు మరింత సమర్థంగా అమలు కావటంతోపాటు సగటు మనిషి ఇబ్బందులను పూర్తిగా తొలగించేందుకు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సూచించినట్లు తెలిసింది.

11/21/2016 - 02:01

పుఖ్రాయన్ (యూపీ), నవంబర్ 20:ఉత్తర ప్రదేశ్‌లో ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 120మంది దుర్మరణం చెందారు. మరో 200మంది గాయపడ్డారు. వీరిలో చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పాట్నా వెళుతున్న ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 14బోగీలు పట్టాలు కాన్పూర్ గ్రామీణ ప్రాంతమైన పుక్రాయన్ వద్ద పట్టాలు తప్పడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది.

11/21/2016 - 01:53

న్యూఢిల్లీ, నవంబర్ 20: ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం జరిగిన ఘోర రైలు ప్రమాదం పట్ల యావద్భారతం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ సహా వివిధ పార్టీలకు చెందిన నేతలు మృతుల కుటుంబాలకు తీవ్ర సంతా పం తెలియజేశారు.

11/21/2016 - 01:53

న్యూఢిల్లీ, నవంబర్ 20: ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రైలు ప్రమాదానికి రైలు పట్టాల్లో పగుళ్లే కారణమని రైల్వే వర్గాలు భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. కాన్పూర్ వద్ద సంభవించిన రైలు ప్రమాదానికి అసలు కారణం దర్యాప్తు అనంతరమే నిర్ధారణ కానున్నప్పటికీ ప్రాథమికంగా అందిన సమాచారాన్నిబట్టి రైలు పట్టాల్లో పగుళ్లే కారణమయి ఉండవచ్చని రైల్వే శాఖ భావిస్తోంది.

Pages