S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/20/2016 - 02:46

జమ్ము, నవంబర్ 19: పాకిస్తాన్ బలగాలు శనివారం నియంత్రణ రేఖ అవతలివైపు నుంచి ఏకపక్షంగా జరిపిన కాల్పుల్లో ఒక జవాను, ఒక మహిళ గాయపడ్డారు. జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరి జిల్లా నౌషెర, సుందర్‌బని సెక్టార్లలో గల భారత ఆర్మీ పోస్టులను, పౌర నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పాక్ బలగాలు మోర్టార్టు, చిన్న ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డాయి. దీంతో భారత భద్రతా బలగాలు స్పందించి గట్టిగా బదులిచ్చాయి.

11/20/2016 - 02:44

న్యూఢిల్లీ, నవంబర్ 19: పెద్దనోట్లను రద్దుచేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా జనానికి రకరకాల కష్టాలు ఎదురవుతున్నట్లు మీడియా కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో ఇంతియాజ్ ఆలమ్ అనే ఉద్యోగికి కూడా అలాంటి కష్టమే ఎదురయింది. అత్యవసరంగా డబ్బు అవసరమై బ్యాంక్ క్యూలో నిలబడిన తర్వాత బైటికి వచ్చిన ఆయనకు మోయలేని భారం కొత్తగా వచ్చిపడింది.

11/20/2016 - 02:43

న్యూఢిల్లీ, నవంబర్ 19: కొత్త 2 వేల రూపాయలు, 500 రూపాయల డిజైన్‌లో దేవనాగరి లిపిని ఉపయోగించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు బినయ్ విశ్వమ్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ నోట్ల డిజైన్‌లో దేవనాగరి లిపిని ఉపయోగించడం అధికార భాషలకు సంబంధించిన రాజ్యాంగంలోని 343(ఎ) అధికరణానికి విరుద్ధమని పేర్కొంటూ ఆయన శుక్రవారం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు.

11/20/2016 - 02:42

న్యూఢిల్లీ, నవంబర్ 19: పెద్దనోట్ల రద్దు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని కేంద్రానికి తెలిపినట్టు మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ వెల్లడించారు. బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగిన సమావేశానికి శివాజీ హాజరయ్యారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నోట్ల రద్దుతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

11/20/2016 - 02:42

ముంబయి, నవంబర్ 19: మహారాష్టల్రో అరవై ఏళ్ల పూజారి చితిపై పడుకుని తనకు తానే నిప్పంటించుకుని మృతి చెందారు. హింగోలీ జిల్లా సుయేగావ్ గ్రామంలో శనివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని హనుమాన్ ఆలయంలో విఠల్ పోలే పూజారిగా ఉన్నారు.

11/20/2016 - 02:41

న్యూఢిల్లీ, నవంబర్ 19: సాంఘిక సంక్షేమ రంగంలో విశిష్ట సేవలు అందించిన వ్యుక్తులు, సంస్థలకు రాష్టప్రతి ప్రణబ్ శనివారం ఇందిరాగాంధీ జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) అవార్డులను ప్రదానం చేశారు. మొక్కల పెంపకం, రక్తదానం, సామాజిక చైతన్య శిబిరాల నిర్వహణ లాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న వ్యక్తులు, సంస్థలకు ఏటా ఈ అవార్డులను ప్రదానం చేయడం జరుగుతుంది.

11/20/2016 - 02:34

న్యూఢిల్లీ, నవంబర్ 19: ప్రతి ఓటమిని కూడా విజయానికి సోపానంగా మలుచుకోవచ్చనేది దివంగత ఇందిరాగాంధీ జీవితంనుంచి మనం నేర్చుకోవలసిన పాఠమని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. అసాధ్యాన్ని సైతం సుసాధ్యంగా మలచుకోవచ్చన్నది ఆమె జీవితం, వారసత్వం మనకు నేర్పిన పాఠమని ఇందిరాగాంధీ శతజయంతి సందర్భంగా శనివారం ఇక్కడ ఇందిరాగాంధీ స్మారకోపన్యాసం చేస్తూ రాష్టప్రతి అన్నారు.

11/20/2016 - 02:33

న్యూఢిల్లీ, నవంబర్ 19: నాలుగు లోక్‌సభ స్థానాలతో పాటుగా వివిధ రాష్ట్రాల్లోని 10 అసెంబ్లీ స్థానాలకు శనివారం జరిగిన ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

11/20/2016 - 02:29

న్యూఢిల్లీ, నవంబర్ 19: పెద్ద నోట్లను రద్దు చేసి పది రోజులు గడిచి పోయిన తర్వాత బ్యాంకుల వద్ద కాస్త రద్దీ తగ్గినప్పటికీ ఎటిఎంల వద్ద మాత్రం రద్దీ పెరిగింది. రద్దయిన నోట్లను మార్చుకోవడంపై కొన్ని పరిమితులు విధించిన తర్వాత బ్యాంకుల వద్ద క్యూలు తగ్గిపోయాయి కానీ వారాంతం కావడంతో ఎటిఎంల వద్ద మాత్రం రద్దీ ఏమాత్రం తగ్గలేదు.

11/20/2016 - 02:27

న్యూఢిల్లీ, నవంబర్ 19: ముంబయిలోని నిషిద్ధ స్వచ్ఛంద సంస్థ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్‌ఎఫ్)కు సంబంధించిన పది కార్యాలయాలపై శనివారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) సోదాలు నిర్వహించింది. ఐఆర్‌ఎఫ్ వ్యవస్థాపకుడు జాకీర్ నాయక్ తదితరులపై శుక్రవారం రాత్రి ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదయిన నేపథ్యంలో స్థానిక పోలీసుల సహకారంతో ఎన్‌ఐఎ ఈ సోదాలు నిర్వహించింది.

Pages