S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/19/2016 - 02:56

న్యూఢిల్లీ, నవంబర్ 18: పెద్ద నోట్ల రద్దు మూలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కావేరీ జలాల నిర్వహణ బోర్డు ఏర్పాటు తదితర అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య జరిగిన వివాదాస్పద గొడవల మూలంగా లోక్‌సభ, రాజ్యసభలు శుక్రవారం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండానే సోమవారానికి వాయిదా పడ్డాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల గొడవ మూలంగా లోక్‌సభ మూడుసార్లు వాయిదా పడగా రాజ్యసభ నాలుగుసార్లు వాయిదా పడ్డాయి.

11/19/2016 - 02:50

న్యూఢిల్లీ, నవంబర్ 18: తన జీవితం అంతా రైల్వే ప్లాట్‌ఫామ్‌లపైనే గడిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం భారత రైల్వేలు నిర్వహించిన ‘రైల్ వికాస్ శిబిర్’ ప్రారంభం సందర్భంగా మాట్లాడిన మోదీ రైల్వేలను అవసరాను గుణంగా తీర్చిదిద్దాలన్నదే తన ఆశయమని చెప్పారు.

11/19/2016 - 02:49

కోల్‌కతా, నవంబర్ 18: పెద్ద నోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పశ్చిమ బెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లో నగదు సమస్యను ఎదుర్కొంటున్న పలువురు వ్యాపారుల మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపుతోంది.

11/19/2016 - 02:48

కోల్‌కతా, నవంబర్ 18: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘చర్యలు లేని ప్రకటనలు’ చేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెద్ద నోట్ల రద్దుతో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలకు ఊరట కలిగించేందుకు కొత్త నోట్లతో పాటు పాత 500 రూపాయల నోట్ల చెలామణిని కొనసాగించేందుకు అనుమతించాలని ఆమె కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

11/19/2016 - 02:47

తిరువనంతపురం, నవంబర్ 18: పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి శుక్రవారం మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశ ప్రజలు ఏవిధంగా జీవించాలో మోదీ నిర్ణయించలేరని ఆయన స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలే సర్వోన్నతులని ఏచూరి పేర్కొంటూ, ఏమాత్రం ఆమోదయోగ్యం కానీ మోదీ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు ఉద్ధృతమవడం ఖాయమని హెచ్చరించారు.

11/19/2016 - 02:45

ముంబయి, నవంబర్ 18: ఉస్మానాబాద్ జిల్లాలో గురువారం తనిఖీలో పట్టుబడిన పాత 500, వెయ్యి రూపాయల నోట్లలో ఉన్న రూ. 91 లక్షల రూపాయల నగదు తనదేనని మహారాష్ట్ర సహకార శాఖ మంత్రి సుభాష్ దేశ్‌ముఖ్ అంగీకరించారు. తన రోజువారీ వ్యాపార అవసరాలకు పని కొస్తుందనే ఉద్దేశంతో ఆ నగదును తన దగ్గరే ఉంచుకున్నానని, అయితే ఎనిమిదో తేదీ ఈ నోట్లను హటాత్తుగా రద్దు చేయడం జరిగిందని దేశ్‌ముఖ్ ఓ ప్రైవేట్ న్యూస్ చానల్‌కు చెప్పారు.

11/19/2016 - 02:44

న్యూఢిల్లీ, నవంబర్ 18: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల్లో పాత నోట్లు మార్చుకోవడానికి వచ్చేవారికి ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చే వారికి వేసే సిరా గుర్తును వాడడం పట్ల ఎన్నికల కమిషన్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది.

11/19/2016 - 02:43

న్యూఢిల్లీ, నవంబర్ 18: మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్న కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు కిడ్నీ ఇవ్వడానికి టిడిపి ఎంపీ రాయపాటి సాంబశివరావు ముందుకొచ్చారు. ఈమేరకు శుక్రవారం ఆయన సుష్మాస్వరాజ్‌కు లేఖ రాశారు. కిడ్నీల సమస్యతో సుష్మా స్వరాజ్ గత కొన్ని రోజులుగా ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్సపొందుతున్నారు. తనకు డయాలసిస్ చేస్తున్నట్టు మంత్రి స్వయంగా ట్వీట్ చేశారు.

11/19/2016 - 02:43

న్యూఢిల్లీ, నవంబర్ 18: ఏపీకి ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించాలని టిడిపి ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు కేంద్రాన్ని కోరారు. శుక్రవారం లోక్‌సభ జీరోఅవర్‌లో ఆయన ఈ విషయాన్ని లేవనెత్తారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన చేసి రెండున్నర నెలలు కావస్తోందని ఆయన అన్నారు. గతంలో రాష్ట్రంలో జరిగిన సంఘటనలు తమను బాధించాయని, అలాంటివి మళ్లీ పునరావృతం కాకూడదని ఆయన చెప్పారు.

11/19/2016 - 02:42

అహ్మదాబాద్, నవంబర్ 18: పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం విప్లవాత్మకమైందని అవినీతి వ్యతిరేక ఉద్యమనేత అన్నాహజారే స్పష్టం చేశారు. నల్లధనాన్ని అరికట్టడానికి గత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ చేపట్టలేదని శుక్రవారం ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం వల్ల ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆయన చెప్పారు.

Pages