S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/23/2016 - 14:32

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో శుక్రవారం ఉదయం మళ్లీ కాల్పులు జరిగాయి. కుప్వారా జిల్లాలోని లైన్ ఆఫ్ కంట్రోల్ ) సమీపంలో ఉగ్రవాదుల కదలికలతో బీఎస్ఎఫ్ జవాన్లు అప్రమత్తమయ్యారు. గురువారం ఇదే ప్రాంతంలో రెండు చొరబాట్లను అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు.

09/23/2016 - 14:22

ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దేశంలోని భద్రతను సమీక్షించారు. రాజ్‌నాథ్‌ నేతృత్వంలో శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. హోంశాఖతో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. యూరీ ఉగ్రదాడి ఘటన, పురాన్‌లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం నేపథ్యంలో ఆయన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

09/23/2016 - 14:19

ఢిల్లీ : సహరా చీఫ్‌ సుబ్రతా రాయ్‌ శుక్రవారం జైలుకు వెళ్లారు. సుబ్రతా రాయ్‌ మరో ఇద్దరు డైరెక్టర్లను అదుపులోకి తీసుకోవాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. సహారా తిరిగిచ్చేసిన ఆస్తులన్నీ ఇంతకుముందే ఆదాయపన్ను శాఖ అధికారులు జప్తు చేశారంటూ సెబీ తరఫు న్యాయవాది ప్రతాప్‌ వేణుగోపాల్‌ సుప్రీం దృష్టికి తీసుకువచ్చారు.

09/23/2016 - 13:51

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు జ్వరం తగ్గింది.. ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారని చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు శుక్రవారం ప్రకటించారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న జయలలిత గురువారం రాత్రి చెన్నైలోని ఆపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

09/23/2016 - 13:11

దిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు, బిహార్‌ మంత్రి తేజ్‌ ప్రతాప్‌కు జర్నలిస్టు రాజ్‌దేవ్‌ రంజన్‌ హత్య కేసులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవల బెయిల్‌పై విడుదలైన ఆర్జేడీ మాజీ ఎంపీ షాబుద్దీన్‌కు కూడా నోటీసులు పంపింది. కేసును దర్యాప్తు చేపట్టి, అక్టోబర్‌ 17లోగా నివేదికను అందించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.

09/23/2016 - 12:36

దిల్లీ: సహారా అధినేత సుబ్రతారాయ్‌ను కస్టడీలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు పోలీసులను శుక్రవారం ఆదేశించింది. ఆయనకు పెరోల్‌ను పొడగించేందుకు కోర్టు నిరాకరించింది. డబ్బు ఇంకా అందలేదని, పెరోల్‌ను పొడగించాలని సుబ్రతారాయ్‌ తరఫు న్యాయవాది కోరగా- న్యాయస్థానం అందుకు నిరాకరించింది. శుక్రవారంతో ఆయన పెరోల్‌ గడువు ముగియడంతో సర్వోన్నత న్యాయస్థానం మరోసారి విచారణ చేపట్టింది.

09/23/2016 - 12:19

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత గురువారం అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జ్వరం, డీహైడ్రేషన్ సమస్యలతో ఆమె బాధపడుతోందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన అక్కర్లేదని వైద్యులు శుక్రవారం వెల్లడించారు.

09/23/2016 - 11:49

విశాఖ: కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు నగరంలో అంతర్జాతీయ సముద్ర ఉత్పత్తుల ప్రదర్శనను శుక్రవారం ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పార్లమెంటు సభ్యులు గోకరాజు, హరిబాబు పాల్గొన్నారు. ఈ ప్రదర్శన మూడు రోజులపాటు జరగనుంది.

09/23/2016 - 11:33

అస్సాం: శుక్రవారం తెల్లవారు జామున కర్బి అంగ్లాంగ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్లో కేపీఎల్‌టీ(కర్బి పీపుల్స్ లిబరేషన్ టైగర్స్) కి చెందిన ఆరుగురు తీవ్రవాదులు హతమయ్యారు. బోకజాన్ పోలీస్ స్టేషన్ పరిథిలోని బనిపథర్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. నిర్దిష్ట సమాచారం మేరకు పోలీసులు, సైన్యం సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి. మృతుల్లో కేపీఎల్‌టీ అగ్ర నేతలిద్దరు ఉన్నారు. ఓ సైనిక జవానుకు గాయాలయ్యాయి.

09/23/2016 - 02:14

న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: గోదావరి, ప్రాణహిత నదుల పరీవాహక అటవీ ప్రాంతాలకు రహదారుల నిర్మాణం కోసం రూ.300 కోట్లు మంజూరు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సహాయం, చేపట్టాల్సిన కార్యక్రమాల విషయంలో చొరవ చూపాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను కోరారు.

Pages