S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/19/2016 - 13:21

శ్రీనగర్‌: ఆదివారం యూరీలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ల సంఖ్య 20కు చేరింది. ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లలో ముగ్గురు సోమవారం ఉదయం మరణించారు.మరికొందరు జవాన్ల పరిస్థితి విషమంగా ఉంది.

09/19/2016 - 12:45

దిల్లీ: పార్టీ ఫిరాయింపుల పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్‌ 19కి వాయిదా వేసింది. పార్టీ ఫిరాయింపుల కేసులో ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేసేందుకు రేవంత్‌రెడ్డి చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు సంపత్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

09/19/2016 - 12:33

దిల్లీ: జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిపై చర్చిచేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సోమవారం ఉదయం సమావేశమైంది. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, మనోహర్‌ పారికర్‌, అరుణ్‌ జైట్లీ, అర్మీ చీఫ్‌ దల్బీర్‌ సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌ హాజరయ్యారు.

09/19/2016 - 06:35

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: పాకిస్తాన్ ఉగ్రవాద దేశమని, దాన్ని ఏకాకిగా మార్చాల్సిందేనంటూ భారతదేశం ఉద్ఘాటించింది. జమ్ము కాశ్మీర్‌లోని యూరి సైనిక స్థావరంపై మిలిటెంట్ దాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. మిలిటెంట్ చర్యను ఖండిస్తూ హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పదునైన పదజాలంతో పాకిస్తాన్‌పై నిప్పులు చెరుగుతూ ఒక ప్రకటన జారీ చేశారు.

09/19/2016 - 06:26

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: యూరిలో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రధాన రాజకీయ పార్టీలు, నేతలు తీవ్రంగా ఖండించారు. దేశంలో శాంతి సామరస్యాలను దెబ్బతీసేందుకే ఉగ్రమూకలు ఇలాంటి పిరికిపంద దాడులకు పాల్పడుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని, వారి వెనుక ఉన్న శక్తులను కఠినంగా శిక్షిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

09/19/2016 - 06:24

శ్రీనగర్, సెప్టెంబర్ 18: జమ్ము కాశ్మీర్‌లో యుద్ధ వాతావరణాన్ని సృష్టించడానికే తాజాగా సైనిక దళాలపై ఉగ్రవాద దాడి జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి అన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన మెహబూబా మళ్లీ హింసాకాండను రగిలించడమే ఈ విఘాతక చర్య ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందని వెల్లడించారు.

09/19/2016 - 06:22

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: జమ్మూ, కాశ్మీర్‌లో ఆత్మాహుతి దాడులకు తెగబడుతున్న ఉగ్రవాదులు మరోసారి రక్షణ స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. తమ బలాన్ని చాటుకోవడానికి ఈ శక్తులు ఆర్మీ స్థావరాలపై దాడులు చేస్తున్నాయేమోననిపిస్తోంది. కాశ్మీర్ అట్టుడికిపోతున్న తరుణంలో రాష్ట్రంలో మరోసారి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని ఈ ఉగ్రవాద శక్తులు భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

,
09/19/2016 - 06:48

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: కాశ్మీర్‌లోని యూరి సెక్టార్‌లో ఆర్మీ బెటాలియన్‌పై జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో సర్వత్రా ఖండనలు వెల్లువెత్తుతున్నాయి. అనేకసార్లు ఈ రకమైన ఘాతుకాలకు ఒడిగడుతున్న పాకిస్తాన్‌కు సంబంధించి ఏ రకమైన చర్యలు తీసుకోవాలన్న దానిపై నిపుణులు కూడా కఠినమైన పదజాలంతోనే తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

09/19/2016 - 06:18

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేయడం, వచ్చే ఏప్రిల్‌నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడానికి ముందే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను జనవరి 21కి నెల రోజులు ముందుకు జరపాలన్న ప్రతిపాదనపై ప్రతిపక్షాలకు ప్రభుత్వంనుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు.

09/19/2016 - 06:17

లక్నో, సెప్టెంబర్ 18: ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సమాజ్‌వాది పార్టీ అధినేత కుటుంబంలో నెలకొన్న వివాదం సమసిపోయినప్పటికీ, పార్టీ విజయంకోసం అఖిలేష్ యాదవ్ చేసిన కృషిని ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ ప్రశ్నించే దాకా ఈ వ్యవహారం వెళ్లినట్లు తెలుస్తోంది.

Pages