S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/29/2016 - 02:04

సూళ్లూరుపేట, ఆగస్టు 28: వినూత్న ప్రయోగాల్లో భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచ దేశాలకు మరోసారి మన శాస్తవ్రేత్తలు చాటి చూపించారు. రోదసి ప్రయోగాల పరీక్షల్లో మరోసారి ఇస్రో శాస్తవ్రేత్తలు తమ శక్తిసంపద ఏమిటో మరోసారి విశ్వానికి చూపించారు. వినీలాకాశంలో భారత త్రివర్ణ పతాకం మరోసారి రెపరెపలాడింది.

08/28/2016 - 15:27

న్యూఢిల్లి:కాశ్మీర్‌లో యువతను రెచ్చగొట్టి అక్కడ విధ్వంసానికి, అల్లర్లకు కారణమవుతున్నవారిని వదిలిపెట్టేది లేదని, ప్రజలకు వారంతట వారే సమాధానం చెప్పుకోలవలసి వస్తుందని ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరించారు. కాశ్మీర్‌పై దేశం అంతా ఒకే గొంతుకతో నినదిస్తోందని, భారత్‌లో కాశ్మీర్ అంతర్భాగమని, ఈ విషయంలో తప్పు చేస్తున్నవారికి గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు.

08/28/2016 - 15:26

బెంగళూరు:ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక వేత్త పండిట్ రవిశంకర్‌తో కాశ్మీర్‌లో ఆ మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన బుర్హాన్ వని తండ్రి ముజఫర్ వనీ భేటీ అయ్యారు. రెండురోజుల క్రితం వారిద్దరూ కలుసుకున్నారు. ఈ విషయాన్న రవిశంకర్ ట్విట్టర్‌ద్వారా తెలిపారు. వారిద్దరూ కలసి ఉన్న ఫొటోనూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

08/28/2016 - 05:46

న్యూఢిల్లీ, ఆగస్టు 27: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు దేశంలో దారిద్య్ర నిర్మూలనకు దోహదం చేయాలి. ప్రజలకు సామాజిక భద్రతను కల్పించాలి. కనీసం బిజెపి పాలిత రాష్ట్రాల్లోనైనా ఈ పథకాలు ఒక ఆదర్శ మార్గంలో అమలు కావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకాంక్షించారు. బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల అధ్యక్షుల రెండు రోజుల సదస్సు ముగింపు సభలో శనివారం సాయంత్రం ఆయన మాట్లాడారు.

08/28/2016 - 05:35

పనాజీ, ఆగస్టు 27: కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నిప్పులు చెరిగారు. పాకిస్తాన్ నరకం అంటూ పారికర్ చేసి వ్యాఖ్యలను శనివారం ఇక్కడ ఎద్దేవా చేశారు.

08/28/2016 - 05:34

బెర్హంపూర్ (పశ్చిమబెంగాల్), ఆగస్టు 27: పశ్చిమబెంగాల్‌లోని ముర్షీదాబాద్ వైద్య కళాశాల ఆసుపత్రిలో శనివారం జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు ఆయాలు మృతి చెందారు. ఆసుపత్రిలో ఉదయం 11.50 గంటలకు మంటలంటుకోవడంతో భయభ్రాంతులకు గురయిన రోగులు, సిబ్బంది ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.

08/28/2016 - 03:45

న్యూఢిల్లీ, ఆగస్టు 27: పాకిస్తాన్ రెచ్చగొట్టటం వల్లనే జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితులు దిగజారాయని రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. ఆమె శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిస్థితుల గురించి చర్చించారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో మరణించినప్పటి నుండి కాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటం తెలిసిందే.

08/28/2016 - 03:41

ఛతర్‌పూర్, ఆగస్టు 27: మొన్న అంబులెన్స్ సదుపాయం లేకపోవడంతో భార్య మృత దేహాన్ని పది కిలోమీటర్లు మోసుకెళ్లాడు ఒక భర్త. నిన్న ఓ వృద్ధురాలి మృత దేహాన్ని విడగొట్టి .. సంచిలో వేలాడదీసి కర్రకు వేళ్లాడదీసుకని తీసుకెళ్లారు. తాజాగా కాన్పు కోసం ఓ నిండు గర్భిణి ఆరు కిలోమీటర్లు ఆస్పత్రికి నడుచుకొని వెళ్లాల్సి వచ్చింది.

08/28/2016 - 05:44

న్యూఢిల్లీ, ఆగస్టు 27: ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం పేదవర్గాల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలు చేయాలని బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వ సుపరిపాలన అజెండాను విజయవంతం చేస్తూ పేదలకు మరింత దగ్గరయ్యేందుకు కృషి చేయాలని శనివారం ఆయన స్పష్టం చేశారు.

08/28/2016 - 03:14

శ్రీనగర్, ఆగస్టు 27: నలభై తొమ్మిది రోజుల తర్వాత శనివారం జమ్మూ, కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ పట్టణంలో కర్ఫ్యూను ఎత్తివేశారు. అయితే వేర్పాటువాదులు శ్రీనగర్‌లోని బాదామీబాగ్‌లో ఉన్న ఆర్మీ ప్రధాన కార్యాలయానికి ప్రదర్శన నిర్వహించనున్న దృష్ట్యా శాంతిభద్రతలను కాపాడడానికి ముందు జాగ్రత్త చర్యగా శ్రీనగర్‌సహా కాశ్మీర్ లోయలోని మిగతా పట్టణాల్లో కర్ఫ్యూ యథాతథంగా కొనసాగుతోంది.

Pages