S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/28/2016 - 03:13

సిమ్లా/అహ్మదాబాద్, ఆగస్టు 27: హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో శనివారం ఒక మోస్తరు తీవ్రతతో వరుసగా భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.

08/28/2016 - 03:12

న్యూఢిల్లీ, ఆగస్టు 27: నేషనల్ హెరాల్డ్ కేసులో బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి తాజాగా దాఖలు చేసిన పిటిషన్‌కు సమాధానం ఇవ్వవలసిందిగా ఆదేశిస్తూ ఢిల్లీ కోర్టు శనివారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. పార్టీకి, అసోసియెటెడ్ జర్నల్ లిమిటెడ్ (ఎజెఎల్)కు చెందిన కొన్ని పత్రాలను అందజేయవలసిందిగా సుబ్రహ్మణ్య స్వామి తన తాజా పిటిషన్‌లో కోరారు.

08/28/2016 - 03:12

బెంగళూరు, ఆగస్టు 27: తమ రాష్టమ్రే తీవ్రమైన నీటి కరవును ఎదుర్కొంటోందని, అందువల్ల తమిళనాడుకు కావేరి జలాలను విడుదల చేయలేమని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. కాగా, వాస్తవ పరిస్థితులను సుప్రీంకోర్టుకు వివరించాలని శనివారం జరిగిన అఖిల పక్ష సమావేశం నిర్ణయించింది. ‘తమిళనాడు 50 టిఎంసిలు విడుదల చేయాలని కోరింది. ఎక్కడినుంచి తెచ్చి ఇవ్వాలి?

08/27/2016 - 16:08

దిల్లీ: దిల్లీ ప్రభుత్వ వ్యవహారాల్లో పదే పదే జోక్యం చేసుకుంటున్న ప్రధాని మోదీ మరిన్ని అరెస్టులకు ఆదేశాలిస్తారేమోనని సిఎం కేజ్రీవాల్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ల ఆదేశాలపై ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలపై కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.

08/27/2016 - 16:07

కోల్‌కత: పశ్చిమబెంగాల్‌లోని బంకురా జిల్లా బిషన్‌పూర్ సమీపంలో శుక్రవారం రాత్రి రైల్వే ట్రాక్ దాటుతుండగా ఖరగ్‌పూర్-అద్రా పాసింజర్ రైలు ఢీకొనడంతో రెండు పిల్ల ఏనుగులు, తల్లి ఏనుగు మృత్యువాత పడ్డాయి. దీంతో ఈ మార్గంలో సుమారు రెండు గంటల సేపు రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు కూలీలను రప్పించి ఏనుగుల కళేబరాలను ట్రాక్‌పై నుంచి తొలగించారు.

08/27/2016 - 15:47

ఢిల్లీ: ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మరో ఐదుగురికి నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ కోర్టు నోటీసులు జారీచేసింది. రెండు వారాలలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు 4వ తేదీకి వాయిదా వేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక నిధులను సోనియా, రాహుల్ దుర్వినియోగం చేశారని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కేసు పెట్టిన సంగతి తెలిసిందే.

08/27/2016 - 15:30

ముర్షీదాబాద్ : పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం మంటలు చెలరేగడంతో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయప్డడారు. మూడో అంతస్తులోని పిల్లల వార్డుకు పక్కనున్న గదిలో మంటలు చెలరేగినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సమాచారం తెలిసిన వెంటనే రెండు అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చాయి.

08/27/2016 - 15:25

గాంధీనగర్: గుజరాత్‌లో కచ్, పోర్‌బందర్, జునాగఢ్ ప్రాంతాలు భూ ప్రకంపనలతో వణికిపోయాయి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.8గా నమోదైంది. హిమాచల్ ప్రదేశ్‌లో కూడా నేడు 20 నిమిషాల వ్యవధిలో మూడు సార్లు భూమి కంపించింది. కులూ ప్రాంతంలో ఈ ప్రకంపనలు వచ్చాయి. భూ ప్రకంపనలతో జనం బెంబేలెత్తిపోయారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.

08/27/2016 - 12:32

ఢిల్లీ: అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప, ఆమె కుటుంబ సభ్యులకు లైంగిక వేధింపుల కేసులో అరెస్టు నుంచి మరో ఆరు వారాలు మినహాయింపునిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. పుష్ప ఇంట్లో పనిచేసే ఇద్దరు.. తమపై ఆమె లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు దాఖలుచేశారు. ఈ కేసులో ఎంపీతో పాటు ఆమె భర్త, కొడుకును ఆగస్టు 22 వరకు అరెస్టు చేయొద్దని ఢిల్లీ పోలీసులకు గతంలో ఢిల్లీ హైకోర్టు సూచించింది.

08/27/2016 - 12:09

కుల్లు: హిమాచల్‌ప్రదేశ్‌లో శనివారం ఉదయం రెండు గంటల వ్యవధిలో మూడు సార్లు భూమి స్వల్పంగా కంపించింది. ఉదయం 6.44 గంటలకు 4.6 తీవ్రతతో మొదటిసారి, రెండోసారి 7:05 గంటలకు 4.3 తీవ్రతతో, మూడోసారి 4.2 తీవ్రతతో భూమి కంపించినట్లు, కుల్లు ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.

Pages