S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/27/2016 - 12:07

ఢిల్లీ: బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం శనివారం ఉదయం ఢిల్లీలో ప్రారంభమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుల సమక్షంలో ఈ భేటీ జరుగుతోంది. కేంద్ర పథకాలకు అనుగుణంగా విధివిధానాల రూపకల్పనపై ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. మంత్రివర్గ నిర్ణయాల అమలు తీరుపై సమీక్ష జరుపనున్నారు. సాయంత్రం 6కిగంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.

08/27/2016 - 11:58

దిల్లీ: జమ్ము- కాశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కాశ్మీర్‌ లోయలో పరిస్థితులపై చర్చించారు. కాశ్మీర్‌ అంశంపై ప్రధాని స్పందించడం సంతోషంగా ఉందని మెహబూబా మీడియాతో అన్నారు. ఆందోళనకర పరిస్థితులకు త్వరలోనే తెరపడుతుందన్నారు. ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌వనీని భద్రతాసిబ్బంది మట్టుబెట్టిన అనంతరం ముఫ్తీ ప్రధానితో భేటీకావడం ఇదే తొలిసారి.

08/27/2016 - 11:53

శ్రీనగర్‌: కాశ్మీర్‌లో ఉగ్రదాడికి శనివారం ఉదయం ఓ కానిస్టేబుల్‌ బలయ్యాడు. పుల్వామాలో ఖుర్షీద్‌ అహ్మద్‌ గనాయ్‌ అనే కానిస్టేబుల్‌ పాల ప్యాకెట్‌ కోసం బయటకు వెళ్లగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఖుర్షీద్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

08/27/2016 - 07:05

కోల్‌కతా, ఆగస్టు 26: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరీసా 106వ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుపుకొన్నారు. మిషనరీస్ ఆఫ్ చా రిటీ ఆధ్వర్యాన కృతజ్ఞనా కూడికలు జరిగాయి. రోమన్ కథోలిక్ సన్యాసిని, మనవతావాది దివంగ త థెరీసాకు వచ్చేనెల 4న వాటికన్ సిటీలో సెయింట్‌హుడ్ ప్రకటిస్తారు. దీన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.

08/27/2016 - 07:03

న్యూఢిల్లీ, ఆగస్టు 26: ముస్లిం సంప్రదాయంలో మూడు సార్లు ‘తలాక్’ చెప్పి విడాకులు తీసుకోవడంపై వివరణ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

08/27/2016 - 07:02

న్యూఢిల్లీ, ఆగస్టు 26: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సిందేనని ఆర్‌ఎస్‌ఎస్ డిమాండ్ చేసింది. గాంధీ హత్యకు ఆర్‌ఎస్‌ఎస్ కారణమన్న రాహుల్ గాంధీ ఆనక కోర్టు చిక్కుల్లో పడడంతో యూ టర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ తమ నాయకుడు ఎక్కడా అలాంటి వాఖ్యలు చేయలేదని సుప్రీం కోర్టులో అఫిడవిట్ ఇచ్చారు.

08/27/2016 - 07:02

న్యూఢిల్లీ, ఆగస్టు 26: దేశాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్యలలో మత ఘర్షణలు ఒకటని భారత్‌లోని యువత భావిస్తోంది. అవినీతి, పేదరికం తరువాత ప్రధానమైన సమస్య మత ఘర్షణలేనని యువత భావిస్తున్నట్లు తాజా సర్వే ఒకటి తెలిపింది.

08/27/2016 - 07:01

వాషింగ్టన్, ఆగస్టు 26: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో డెమో క్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ దూసుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో హిల్లరీకి ఓటు వేయాలని భావిస్తున్నట్లు తా జాగా నిర్వహించిన సర్వేలో సగం మందికి పైగా ప్రజలు స్పష్టం చేశారు. అమెరికాలో 50 శాతం మందికి పైగా ప్రజలు హిల్లరీకి మద్దతు పలుకుతున్నట్లు తేలడం ఇదే తొలిసారి. క్విన్నిపియాక్ యూనివర్శిటీ శుక్రవారం ఈ సర్వే ఫలితాలను విడుదల చేసింది.

08/27/2016 - 06:58

న్యూఢిల్లీ, ఆగస్టు 26: దేశంలో ‘రామ రాజ్య’ స్థాపనకు ఆదేశాలను జారీ చేయలేమని, అలాగే తాము అనుకున్న వాటిలో చాలా పనులను చేయలేమని, తమ శక్తి పరిమితంగా ఉండటమే ఇందుకు కారణమని సుప్రీం కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది.

08/27/2016 - 06:57

శ్రీనగర్, ఆగస్టు 26: ‘్భగో యహా సే’ (ఇక్కడినుంచి వెళ్లిపోండి).. 48 రో జులుగా కర్ఫ్యూ అమలులో ఉన్న శ్రీనగర్‌లోని ప్రతి గల్లీలో చీకటి పడగానే వినిపించే పారా మిలిటరీ జవాను కేక అది.

Pages