S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/27/2016 - 06:57

న్యూఢిల్లీ, ఆగస్టు 26: ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని పాకిస్తాన్‌కు భారత్ గట్టిగా విజ్ఞప్తి చేసింది. ఇలాంటి సంఘటనలను తాము వెలుగులోకి తెచ్చినప్పుడల్లా వాటిని నిరాకరించడమే పనిగా పెట్టుకోవద్దని పాక్‌కు హితవుపలికింది. ఉగ్రవాదం విషయంలో ఇరుదేశాల మధ్య వాదోపవాదాలు మరింత తీవ్రమయ్యాయి.

08/27/2016 - 06:56

న్యూఢిల్లీ, ఆగస్టు 26: భారతదేశం పరిపూర్ణ పరివర్తనం సాధించాలంటే చట్టాలను మార్చాలి. అనవసర విధానాలు రద్దు చేయాలి. ప్రగతిగతిని గణనీయంగా పెంచా ల్సి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. మార్పునకు కారణమవుతోన్న సవాళ్లను భారత్ ఎదుర్కోవాలంటే మామూలు అభివృద్ధి, ప్రగతి ఎంతమాత్రం సరిపోదన్నారు.

08/27/2016 - 06:45

న్యూఢిల్లీ, ఆగస్టు 26: హెచ్‌సియు రిసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు అసలు కారణాలు ఏమిటన్నదాన్ని తేల్చకుండా, అతను దళితుడా? కాదా? అనే అంశాన్ని ఉద్దేశపూర్వకంగా తెరమీదకు తెచ్చారని సిపిఐ సీనియర్ నేత కె నారాయణ మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రోహిత్ విశ్వవిద్యాలయ వ్యవస్ధగత హింసవల్లే ఆత్మహత్య చేసుకున్నాడనడానికి అనేక ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

08/27/2016 - 06:13

న్యూఢిల్లీ,ఆగస్టు 26: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం తన మంత్రివర్గం సభ్యులతో సమావేశమై వివిధ మంత్రిత్వ శాఖల పనితీరును, ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయన్న అంశాలు సమీక్షించారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి క్యాబినెట్ మంత్రులతోపాటు సహాయ, ఇండిపెండెంట్ మంత్రులు, పిఎంఓ సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు.

08/27/2016 - 05:20

న్యూఢిల్లీ, ఆగస్టు 25: తెలంగాణలో వివిధ యూనివర్శిటీల్లో వైస్ ఛాన్సలర్ల్ నియామకానికి సంబంధించిన కేసు విచారణను సుప్రీం కోర్టు ధర్మాసనం వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. వైస్ ఛాన్సలర్ల నియామకపుఉత్తర్వులను కొట్టివేస్తు ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. గత విచారణ సందర్భంగా విసిల నియామకాలపై యథాతథస్థితిని కొనసాగిస్తూ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది.

08/27/2016 - 05:19

న్యూఢిల్లీ, ఆగస్టు 26: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ పర్యావరణ సంస్థకు కాపిటల్ ఫౌండేషన్ సంస్థ జస్టిస్ కుల్దీప్ సింగ్ అవార్డు ప్రకటించింది. అవార్డును సంస్థ ప్రతినిధులు శనివారం అందుకోనున్నారు.

08/27/2016 - 05:18

న్యూఢిల్లీ, ఆగస్టు 26: భవిష్యత్తులో కాబోయే తండ్రులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే రీతిలో చట్టాన్ని తీసుకురానున్నట్టు కేంద్ర స్ర్తిశిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ తెలిపారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన మెటర్నిటి బిల్లులో కాబోయే తండ్రులకు ఎలాంటి ఉపశమనం కలిగించే అంశాలు లేకపోవడంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో మంత్రి స్పందిస్తూ ఈ విషయం చెప్పారు.

08/27/2016 - 03:25

న్యూఢిల్లీ, ఆగస్టు 26: రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న అత్యధిక స్థాయిలో 118మందికిపైగా పాల్గొన్న భారత క్రీడాకారుల్లో కేవలం ఇద్దరికి మాత్రమే పతకాలు రావడంపై గగ్గోలు రేకెత్తుతున్న నేపథ్యంలో భావి ఒలింపిక్స్‌పై కేంద్రం దృష్టి సారించింది. ప్రపంచంలో ఏ దేశానికి తీసిపోని రీతిలో భారత క్రీడాకారులను తీర్చిదిద్దే చర్యలు చేపడుతోంది.

08/27/2016 - 03:03

న్యూఢిల్లీ, ఆగస్టు 26: భారత్ కోసం ఫ్రాన్స్ నౌకా నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఆరు స్కార్పీన్ జలాంతర్గాములకు సంబంధిం చి ఇప్పటి వరకూ వెల్లడైన వివరాల వల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. ది ఆస్ట్రేలియన్ పత్రిక వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ఈ వివరాల్లో జలాంతర్గాముల ఆయుధ వ్యవస్థకు సంబంధించిన వివరాలు లేవని..ఇది ఉపశమనం కలిగించే అంశమని పేర్కొన్నారు.

08/26/2016 - 18:27

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్రమంత్రి వర్గ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. తిరంగా యాత్ర, క్యాబినెట్‌ నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, వివిధ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. మంత్రులు శాఖల వారీగా ప్రధానికి నివేదికలు సమర్పించనున్నారు.

Pages