S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/24/2016 - 08:21

న్యూఢిల్లీ, ఆగస్టు 23: తెలంగాణ రాష్ట్ర రహదారులను 650 కి.మీ మేర జాతీయ రహదారులగా విస్తరించేందుకు కేంద్రం ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను అంగీకరించారు.

08/24/2016 - 08:07

న్యూఢిల్లీ,ఆగస్టు 23: తెలంగాణ విమోచన దినం వేడుకల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు బిజెపి ఆధ్యక్షుడు అమిత్ షా హైదరాబాదుకు వస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, శాసన సభ్యుడు లక్ష్మణ్ వెల్లడించారు. అమిత్ షా నాయకత్వంలో మంగళవారం జరిగిన రాష్ట్ర బిజెపి శాఖల కోర్ కమిటీ సభ్యుల సమావేశానంతరం లక్ష్మణ్ విలేఖరులతో మాట్లాడారు.

08/24/2016 - 07:53

న్యూఢిల్లీ, ఆగస్టు 23: ప్రాథమిక వౌలిక రంగ అభివృద్ధి జరగకుండా భారత్ అభివృద్ధి సాధ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కీలకమైన ఇన్‌ఫ్రా రంగాలలో అభివృద్ధిని వేగంగా సాధించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. సంప్రదాయేతర ఇంధన వనరులు, రైల్వేలు వంటి కీలకరంగాల్లో పురోగతికి సంబంధించిన అంశాలపై ప్రధానమంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు.

08/24/2016 - 07:16

న్యూఢిల్లీ, ఆగస్టు 23: అరుణాచల్‌ప్రదేశ్‌లో బ్రహ్మోస్ క్షిపణిని మోహరించటంపై చైనా చేసిన హెచ్చరికలను భారత సైన్యం బేఖాతరు చేసింది. తాము తీసుకునే నిర్ణయాలు బీజింగ్ వల్ల ప్రభావితం కావని స్పష్టం చేసింది. ‘మనకు పొంచి ఉన్న ప్రమాదాలు, రక్షణకు సంబంధించిన అంశాలను ఎలా ఎదుర్కోవాలన్నది మన సమస్య. మన భూభాగంలో మనం ఏం చేసుకుంటాము? ఏది ఎక్కడ మోహరిస్తామన్నది పూర్తిగా మనకు సంబంధించిన అంశం.

08/24/2016 - 07:16

న్యూఢిల్లీ, ఆగస్టు 23: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బహిరంగ సభ నిర్వహించినందుకు ప్రతీకారంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ లోక్‌సభ నియోజకవర్గంలో బిజెపి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. వచ్చే నెలలో జరిగే ఈ బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.

08/24/2016 - 07:15

న్యూఢిల్లీ, ఆగస్టు 23: ఉగ్రవాదాన్ని అణచివేయడంతలో కీలకపాత్ర భూమిక పోషిస్తున్న జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జి) పటిష్టం చేయనున్నట్టు కేంద్ర హోమ్‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఎన్‌ఎస్‌జికి వౌలిక సదుపాయల కల్పన, ఆయుధాలు సమకూర్చనున్నట్టు మంగళవారం ఆయన తెలిపారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కౌంటర్ హైజాక్ స్క్వాడ్ భవనాన్ని ఆయన ప్రారంభించారు.

08/24/2016 - 07:15

న్యూఢిల్లీ, ఆగస్టు 23: సౌదీ అరేబియాలో ఉపాధి కోల్పోయి వీధినపడ్డ భారతీయ కార్మికులందరూ సెప్టెంబర్ 25లోగా స్వదేశానికి తిరిగి రావాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం నాడిక్కడ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోలేని పరక్షంలో వారందరూ కూడా సొంత ఏర్పాట్లతోనే స్వదేశానికి రావాల్సి వుంటుందని తెలిపారు.

08/24/2016 - 07:14

న్యూఢిల్లీ, ఆగస్టు 23: కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ చరిత్ర విషయంలో నోరుజారి నాలిక్కర్చుకున్నారు. భగత్‌సింగ్, రాజ్‌గురులతో పాటుగా జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్‌లను కూడా బ్రిటిష్‌వాళ్లు ఉరితీశారని ఆయన చెప్పుకొచ్చారు.

08/24/2016 - 07:14

అమృత్‌సర్, ఆగస్టు 23: కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన ఓ కానిస్టేబుల్‌కు వైద్యులు శస్తచ్రికిత్స చేయగా 40 కత్తులు బయటపడ్డారు. పంజాబ్‌లోని తరన్ తరన్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పేషంట్ కడుపులో ఇన్ని కత్తులు బయటపడడంతో వైద్యులు అవాక్కయ్యారు. సుర్జిత్ సింగ్ (40) తరన్ తరన్ జిల్లాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్న అతడు ఓ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లాడు.

08/24/2016 - 07:13

న్యూఢిల్లీ, ఆగస్టు 23: రాజధాని ఢిల్లీలో సభ్య సమాజం సిగ్గుపడే సంఘటన చోటుచేసుకుంది. ఇంటి ఆరుబయట నిద్రిస్తున్న ఎనిమిదేళ్ల బాలికను ముగ్గురు కాముకులు కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తూర్పు ఢిల్లీలోని మండావలీలో ఆదివారం రాత్రి ఈ దారుణ సంఘటన జరిగింది. అఘాయిత్యానికి పాల్పడిన ముగ్గురు దుర్మార్గులు బాలిక పొరుగున ఉండేవారేనని పోలీసులు వెల్లడించారు.

Pages