S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/03/2016 - 16:33

ముంబయి: బుధవారం దేశీయ మార్కెట్లపై జీఎస్‌టీ బిల్లు ప్రభావం పడింది. సెన్సెక్స్‌ 284 పాయింట్లు కోల్పోయి 27,697 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 78 పాయింట్లు నష్టపోయి 8,544 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.95 వద్ద కొనసాగుతోంది. ఆరంభం నుంచే నష్టాల బాట పట్టిన స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి.

08/03/2016 - 16:11

గౌహతి: అస్సాంలోని గౌహతి విమానాశ్రయంలో బుధవారం రెండు విమానాలకు తృటిలో ప్రమాదం తప్పింది. గౌహతి నుంచి చెన్నై వెళ్తున్న విమానం, ముంబయి నుంచి గౌహతి వస్తున్న విమానం స్వల్పంగా ఒకదాన్నొకటి ఢీ కొన్నాయి. ఇండిగో సంస్థకు చెందిన ఈ రెండు విమానాల్లో సుమారు 300 మంది ప్రయాణీకులున్నారు. ఘటనలో ఆరుగురు ప్రయాణీకులు స్వల్పంగా గాయపడ్డారు. రెండు విమానాలను రన్‌వేపై దింపి ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

08/03/2016 - 16:11

దిల్లీ: వారణాసిలో రోడ్ షో నిర్వహిస్తూ అనారోగ్యానికి గురైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రస్తుతం దిల్లీలోని ఆర్మీ రీసర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆమె చార్టర్డ్ విమానంలో దిల్లీకి చేరుకున్నారు. జ్వరంతో బాధపడుతున్నప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని కాంగ్రెస్ మీడియా ప్రతినిధి తెలిపారు.

08/03/2016 - 15:36

దిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లును తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదని, మరో 3 సవరణలు చేయాల్సి ఉందని ఆర్థికశాఖ మాజీ మంత్రి పి.చిదంబరం బుధవారం రాజ్యసభలో అన్నారు. సవరణలు అవసరమని తాము మొదటి నుంచి చెబుతున్నామని అన్నారు. సభ్యుల సంఖ్య ఆధారంగా కాకుండా చర్చల ద్వారా బిల్లును ఆమోదిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ బిల్లును భాజపా వ్యతిరేకించిందని చిదంబరం పేర్కొన్నారు.

08/03/2016 - 15:31

దిల్లీ: జీఎస్‌టీ బిల్లు వల్లే పన్నుల సంస్కరణలు సాధ్యమని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. బుధవారం రాజ్యసభలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) సవరణ బిల్లును జైట్లీ ప్రవేశపెట్టారు. చర్చను ప్రారంభించిన జైట్లీ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద పన్ను సంస్కరణ బిల్లు జీఎస్‌టీ అని వివరించారు. ఒకే దేశం, ఒకే పన్ను విధానం ఉండాలనే లక్ష్యంతో జీఎస్‌టీ బిల్లు రూపొందించినట్లు చెప్పారు.

08/03/2016 - 14:45

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ వైకాపా ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. వీరికి టిడిపి ఎంపీ జెసి దివాకర రెడ్డి మద్దతు తెలిపారు.

08/03/2016 - 14:44

దిల్లీ: యుపిలో మహిళల పట్ల హింస, అత్యాచారాలు పెరిగిపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని రాజ్యసభలో బిఎస్పీ అధినేత్రి మాయావతి బుధవారం తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. యుపిలో సమాజ్‌వాదీ సర్కారుతో కేంద్రం కుమ్మక్కయిందా? అని ఆమె ప్రశ్నించారు. సామూహిక అత్యాచారాలు, హింసతో యుపిలో మహిళలకు భద్రత లేకుండా పోయిందన్నారు.

08/03/2016 - 12:30

బిహార్‌ : బిహార్‌ టాపర్ల కుంభకోణంలో సైన్స్‌ విభాగంలో మూడో ర్యాంకు సాధించిన రాహుల్‌ కుమార్‌ను బుధవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల విడుదలైన బిహార్‌ 12వ తరగతి ఫలితాల్లో అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. ఈ స్కాంలో ఇప్పటికే టాపర్‌ రూబీరాయ్‌ను అరెస్టు చేయగా ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు.

08/03/2016 - 11:45

దిల్లీ: లోక్‌సభ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభం కాగానే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలు మళ్లీ ఆందోళన ప్రారంభించారు. ఎపికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు ప్రారంభించారు. సభా కార్యక్రమాలకు అడ్డుతగలరాదని స్పీకర్ సుమిత్రా మహాజన్ చేసిన విజ్ఞప్తిని వారు పట్టించుకోలేదు.

08/03/2016 - 11:44

ముంబయి: భారీ వర్షాల కారణంగా మహారాష్టల్రో ముంబయి-గోవా రహదారిలో సావిత్రి నదిపై వంతనె కూలిపోగా రెండు బస్సులు, 8 వాహనాలు కొట్టుకుపోయాయి. ఆ బస్సుల్లో 22 మంది ప్రయాణీకులున్నట్టు సమాచారం. గల్లంతైన వాహనాల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. 50 మంది ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు హెలికాప్టర్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Pages