S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/03/2016 - 11:43

దిల్లీ: గుజరాత్ సిఎం ఆనందీబెన్ రాజీనామాను బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆమోదించారు. ఇక్కడ ప్రధాని మోదీ నివాసంలో బుధవారం ఉదయం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పలు విషయాలు చర్చకు వచ్చాయి. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ, యువ నాయకత్వానికి అవకాశం కల్పించాలని భావిస్తూ ఆనందీబెన్ రాజీనామా చేశారన్నారు. ఆమె ఈరోజు గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేస్తారన్నారు.

08/03/2016 - 08:08

వారణాసి, ఆగస్టు 2: దేశంలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగబోయే ఎన్నికలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ భారీస్థాయిలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండేళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో రోడ్‌షోతో సోనియా ప్రచార సంరంభం ప్రారంభమైంది. అయితే అనూహ్యంగా ఆమెకు తీవ్రంగా జ్వరం రావటంతో ప్రచారాన్ని అర్ధంతరంగా నిలిపివేసి ఆమె వెళ్లిపోయారు.

08/03/2016 - 08:05

ముంబయి, ఆగస్టు 2: ముంబయి ఉగ్రవాద దాడుల (26/11) ఘటనలో కీలక సూత్రధారి, నిషేధిత లష్కర్-ఈ-తోయిబా సభ్యుడు సరుూద్ జాబుద్దీన్ అన్సారీ అలియాస్ అబు జుందాల్ సహా ఏడుగురికి ముంబయి మోకా కోర్టు జీవిత ఖైదు విధించింది.

08/03/2016 - 08:05

ముంబయి, ఆగస్టు 2: ఢిల్లీ-ముంబయి మధ్య ట్రయల్ రన్ జరుపుతున్న టాల్గో హైస్పీడ్ రైలు మంగళవారం ఏకంగా మూడు గంటలు ఆలస్యంగా వచ్చింది. చివరి ట్రయల్ రన్‌లో భాగంగా సోమవారం రాత్రి 7.55కు ఢిల్లీలో బయలుదేరిన ఈ టాల్గో రైలు మంగళవారం ఉదయం 11.40కు ముంబయి చేరుకుంది. ఢిల్లీ - ముంబయి మధ్యనున్న 1,384 కి.మీ దూరాన్ని 12 గం.

08/03/2016 - 08:04

న్యూఢిల్లీ, ఆగస్టు 2: పరిస్థితులు, పరిసరాలపట్ల సున్నితంగా మెలగాలని, ప్రజలతో మమేకం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఏఎస్‌లుగా నియమితులైన కొత్త అధికారులకు హితవు చెప్పారు. 2-14బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు, అసిస్టెంట్ సెక్రటరీల శిక్షణ ప్రారంభ సదస్సునుద్దేశించిన ఆయన మాట్లాడారు. తమ నైపుణ్యాన్ని పెంచుకునేందుకు, అనేక విషయాలను నేర్చుకునేందుకు ఇదొక మంచి అవకాశమని ఆయన వ్యాఖ్యానించారు.

08/03/2016 - 08:04

న్యూఢిల్లీ, ఆగస్టు 2: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌శహర్‌లో తల్లీ కూతుళ్లపై దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిని మూడు నెలల్లోగా శిక్షించని పక్షంలో తామంతా ఆత్మహత్య చేసుకుంటామని వారి కుటుంబ సభ్యులు హెచ్చరించారు. ‘మమ్మల్ని దోచుకున్నారు.. చావకొట్టారు. వాళ్లు నా కూతుర్ని ఏం చేశారో అందరికీ తెలుసు.. వాళ్లను నా భార్య, కూతురే శిక్షించాలనేది నా కోరిక.

08/03/2016 - 08:03

న్యూఢిల్లీ, ఆగస్టు 2: దేశవ్యాప్తంగా 2.16 కోట్ల బోగస్ కార్డులను గుర్తించడం జరిగిందని, ఈ బోగస్ కార్డుల కారణంగా పక్కదారి పట్టనున్న దాదాపు 13వేల కోట్ల రూపాయలు ఇప్పుడు లబ్ధిదారులకు అందుతోందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభకు తెలియజేసింది.

08/03/2016 - 08:02

పనాజి, ఆగస్టు 2: గోవాలో ముఖ్యమంత్రి పర్సేకర్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మంగళవారం శాసనసభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ఈ అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్లు, గోవా వికాస్ పార్టీ శాసన సభ్యుడు ఫ్రాన్సిస్కో మిక్కీ పచెకోలు సంతకం చేశారు.

08/03/2016 - 08:01

న్యూఢిల్లీ, ఆగస్టు 2: వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) పనున్నను తీసుకురావడానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు ముసాయిదా ప్రతులను ప్రభుత్వం ఎంపీలందరికీ పంపడం, బుధవారం రాజ్యసభలో ఈ బిల్లు చర్చకు రానుండడంతో దీనిపై సభలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేసుకోవడానికి కాంగ్రెస్ నేతలు మంగళవారం సమావేశమయ్యారు.

08/03/2016 - 08:01

ఇస్లామాబాద్, ఆగస్టు 2:కాశ్మీర్ అల్లర్లకు సంబంధించి భారత్‌ను మరింతగా కవ్వించే చర్యకు పాకిస్తాన్ పాల్పడింది. కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, దీనిపై దర్యాప్తు చేయడానికి నిజ నిర్థారణ సంఘాన్ని పంపాలని ఐరాస మానవ హక్కుల కమిషన్‌ను డిమాండ్ చేస్తూ మంగళవారం ఏకగ్రీవంగా ఓ తీర్మానాన్ని పాకిస్తాన్ పార్లమెంట్ ఆమోదించింది.

Pages