S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/02/2016 - 02:22

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రింట్ మీడియా అడ్వర్టైజ్‌మెంట్ల కోసం చేసిన ఖర్చు 35 కోట్ల రూపాయాలు. ఆర్టీఐ చట్టం కింద అనిల్ గల్గానీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను కేంద్రం అందజేసింది.

08/01/2016 - 18:12

గాంధీనగర్: వయసుపైబడినందున ఇక పదవి నుంచి తప్పుకుంటానని గుజరాత్ సిఎం ఆనందీ బెన్ (75) పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవీ బాధ్యతల నుంచి తనకు విముక్తి కలిగించాలని పార్టీ బిజెపి అధిష్ఠానవర్గానికి విజ్ఞప్తి చేశానని ఆమె ‘ఫేస్‌బుక్’లో తన మనోభావాలను పోస్ట్ చేశారు. యువతకు అవకాశం ఇచ్చేందుకు పార్టీ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

08/01/2016 - 18:11

దిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో ఎపికి చెందిన కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి సోమవారం సమావేశమయ్యారు. ఎపికి ప్రత్యేక హోదా కోసం టిడిపి ఎంపీలు పార్లమెంటు వద్ద ధర్నా చేసిన నేపథ్యంలో జైట్లీని వీరు కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రత్యేక హోదాపై ప్రజల మనోభావాలు, ఎపిలో తాజా రాజకీయ పరిస్థితులు తదితర అంశాలపై వెంకయ్య, సుజనా జైట్లీతో చర్చించినట్లు సమాచారం.

08/01/2016 - 18:10

దిల్లీ: తనకు ప్రాణహాని ఉన్నందున ప్రభుత్వం తక్షణం తనకు తగిన రక్షణ కల్పించాలని అన్నాడిఎంకె పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప సోమవారం రాజ్యసభలో విలపించారు. ప్రాణహాని ఉందంటూ ఆమె మాట్లాడడంతో సభ్యులంతా ఒక్కసారి కలవరం చెందారు. సభ్యురాలి ఆవేదనను వినాలంటూ కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ మాట్లాడారు.

08/01/2016 - 18:09

లక్నో: యుపిలో శాంతిభద్రతలను పరిరక్షించడం చేతకాకపోతే రాజీనామా చేయాలంటూ సిఎం అఖిలేష్ యాదవ్‌కు బిఎస్‌పి అధినేత్రి, మాజీ సిఎం మాయావతి సలహా ఇచ్చారు. బులంద్‌షహార్ వద్ద తల్లి, కూతురిపై సాయుధ దుండగులు సామూహిక అత్యాచారం చేయడంతో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదన్న విషయం అర్థమవుతోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని పరిపాలించే సత్తా లేకపోతే సిఎం పీఠాన్ని అఖిలేష్ వదులుకోవడం మంచిదన్నారు.

08/01/2016 - 17:16

దిల్లీ: జీఎస్‌టీ బిల్లును ఈ నెల 3న రాజ్యసభ ముందుకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. భాజపా ఇప్పటికే తన పార్టీ రాజ్యసభ సభ్యులకు విప్‌ జారీచేసింది. జీఎస్‌టీ బిల్లుకు అడ్డంకులు తొలగిపోయాయని సభముందుకు తెచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.

08/01/2016 - 16:35

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 66.75వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 49 పాయింట్లు నష్టపోయి 28,003 వద్ద ముగిసింది. నిఫ్టీ 2 పాయింట్ల నష్టంతో 8,636 వద్ద స్థిరపడింది.

08/01/2016 - 16:33

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు మార్చి 2016 వరకు రూ.6,403 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి ఇంద్రజిత్‌ సింగ్‌ సోమవారం రాజ్యసభలోతెలిపారు. రెవెన్యూ లోటు కింద రూ.2,803 కోట్లు, ఏడు వెనుకబడిన జిల్లాలకు రూ.700 కోట్లు, నూతన రాజధానికి రూ.2050 కోట్లు, పోలవరానికి రూ.850 కోట్లు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. తెదేపా ఎంపీ టీజీ వెంకటేశ్‌ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

08/01/2016 - 16:21

దిల్లీ: రాయితీ వంట గ్యాస్‌ సిలిండర్‌పై రూ.1.93 పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. నెల వ్యవధిలో రాయితీ సిలిండర్‌ ధర పెరగడం ఇది రెండోసారి. దిల్లీలో 14.2 కేజీల రాయితీ సిలిండర్‌ ధర రూ.423.09గా ఉంది. వంటగ్యాస్‌, కిరోసిన్‌ రాయితీలను తగ్గించేందుకు ప్రభుత్వం నెలవారీగా ధరలను పెంచే పద్ధతిని చేపట్టింది. ఇప్పటికే ప్రతినెలా లీటర్‌ కిరోసిన్‌పై రూ.25 పెంచాలని నిర్ణయించగా..

08/01/2016 - 15:47

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం ఎంపీలు దిల్లీలో ధర్నా ప్రారంభించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఎపికి ప్రత్యేక ప్యాకేజీ కోసం కసరత్తు చేయాల్సిందిగా వెంకయ్యకు మోదీ చెప్పినట్లు సమాచారం. సిఎం చంద్రబాబుతో మాట్లాడాల్సిందిగా కేంద్రమంత్రులు వెంకయ్య, అరుణ్ జైట్లీలకు ప్రధాని ఆదేశించారని తెలిసింది.

Pages