S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/29/2016 - 05:08

న్యూఢిల్లీ, జూలై 28: దేశంలో నిత్యావసర సరుకుల సరఫరాలను మెరుగుపర్చి ధరల పెరుగుదలకు కళ్లెం వేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం విదేశాల నుంచి పప్పు్ధన్యాలాను దిగుమతి చేసుకునేందుకు మయన్మార్‌తో పాటు ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ గురువారం వెల్లడించారు.

07/29/2016 - 04:11

న్యూఢిల్లీ, జూలై 28: భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై డ్రోన్‌లతో దాడి చేయడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారా? తాజాగా వెలుగుచూస్తున్న నిఘా వర్గాల సమాచారాన్ని బట్టి లష్కరె తొయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడానికి కుట్ర పన్నుతున్నట్టుగా తెలుస్తోంది.

07/29/2016 - 03:56

కోల్‌కతా, జూలై 28: పీడిత జనులకోసం ఆమె అహరహం పరితపించారు. వారి హక్కులకోసం వారి గొంతై నినదించారు. మహాశే్వతాదేవి ప్రఖ్యాత రచయిత్రి 90 ఏళ్ల వయసులో గురువారం కన్నుమూసేదాకా ఆమె అణగారిన వర్గాల కోసమే పరితపించారు. సాహిత్య ప్రపంచంలో ఆమె సృజన అంతా వారికోసమే సాగింది. పద్మవిభూషణ్, రామన్ మెగసెసే, జ్ఞానపీఠ, సాహిత్య అకాడమీ అవార్డులు ఎన్నో ఆమెను అలంకరించాయి.

07/29/2016 - 04:03

న్యూఢిల్లీ, జూలై 28: దేశంలో పప్పుల ధరలు విపరీతంగా పెరగడంపై ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. లోక్‌సభలో గురువారం ధరల పెరుగుదలపై జరిగిన చర్చలో రాహుల్ గాంధీ పాల్గొంటూ ‘మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని శుష్క వాగ్దానాలు చేయవచ్చు. కాని, పప్పుల ధరలు ఎప్పటివరకు తగ్గుతాయో ఖచ్చితమైన తేదీని చెప్పండి’ అని ప్రధాని మోదీని నిలదీశారు.

07/29/2016 - 03:52

న్యూఢిల్లీ, జూలై 28: పరువు నష్టం కేసులను ప్రభుత్వాలను విమర్శించే వారిపై రాజకీయ ఆయుధాలుగా ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలిలత దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో డిఎండికె అధ్యక్షుడు, తమిళనటుడు విజయకాంత్, ఆయన భార్యపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను నిలుపుదల చేసింది.

07/29/2016 - 03:51

న్యూఢిల్లీ, జూలై 28: నరేంద్ర మోదీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తున్న జిఎస్‌టి బిల్లుపై అధికార, విపక్షాల మధ్య సదవగాహన ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయి. ఈ బిల్లుపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని చెప్పడానికి గురువారం రాజ్యసభ సాగిన తీరే నిదర్శనం.

07/29/2016 - 03:49

న్యూఢిల్లీ, జూలై 28: చెన్నై నుంచి పోర్టుబ్లెయిర్ వెళ్తూ అదృశ్యమైన వైమానిక దళ విమానం ఎఎన్-32 ఆచూకీ ఇంకా లభించలేదు. విమానాలు, నౌకలు, జలాంతర్గాములు అహోరాత్రులు గాలిస్తున్నా ఆచూకీ దొరకలేదని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గురువారం లోక్‌సభలో వెల్లడించారు. ఈ నెల 22న ఎఎన్-32 విమానం గల్లంతయింది. రక్షణ మంత్రి పారికర్ లోక్‌సభలో విమానం అదృశ్యంపై తనంతట తానుగా ఓ ప్రకటన చేశారు.

07/29/2016 - 03:09

మంత్రాలయం, జూలై 28: మంత్రాలయం పీఠాధిపతి శ్రీసుబు ధేంద్ర తీర్థులు గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. ప్రధాని నివాసానికి వెళ్లిన పీఠాధిపతి ఆగస్టులో జరిగే శ్రీ రాఘవేంద్రస్వామి 345వ సప్తఆరాధనోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరారు. ఈ మేరకు ఉత్సవాల ఆహ్వానపత్రికను ప్రధానికి అందజేశారు.

,
07/29/2016 - 02:54

న్యూఢిల్లీ, జూలై 28: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ రాజ్యసభలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభలో ప్రతిపక్షాలన్నీ గట్టిగా డిమాండ్ చేశాయి. అయితే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాత్రం ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చనందుకే అమలు చేయటం సాధ్యం కావటం లేదని చెప్పారు.

07/29/2016 - 04:06

కోల్‌కతా, జూలై 28: గిరిజనులు, ఇతర అణగారిన వర్గాల హక్కుల కోసం అహరహం పోరాడి తన రచనల ద్వారా వారి జీవితాల్లో వెలుగు నింపిన ప్రఖ్యాత రచయిత్రి, సామాజిక కార్యకర్త మహాశే్వతాదేవి (91) గురువారం తుదిశ్వాస విడిచారు.

Pages