S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/24/2016 - 00:40

న్యూఢిల్లీ, జూలై 23: కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితి పట్ల కాంగ్రెస్ పార్టీ శనివారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రజలపై పెల్లెట్ తుపాకులను ప్రయోగించవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాశ్మీర్ అంశంపై చర్చించినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటు లోక్‌సభలో కాని, అటు రాజ్యసభలో కాని లేరని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ శనివారం ఇక్కడ విమర్శించారు.

07/24/2016 - 00:38

శ్రీనగర్, జూలై 23: కొన్ని రోజులుగా కాశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొంత మెరుగుపడటంతో శనివారం నాలుగు జిల్లాలతోపాటు శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాలలో కర్ఫ్యూను ఎత్తివేశారు. కాశ్మీర్ లోయలోని మిగతా ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా కర్ఫ్యూను కొనసాగిస్తున్నారు.

07/24/2016 - 00:36

శ్రీనగర్, జూలై 23: ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఉగ్రవాదుల చొరబాటును శనివారం ఆర్మీ భగ్నం చేసింది. ఈ సందర్భంగా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక సైనికుడు వీరమరణం పొందాడు. శుక్రవారం అర్ధరాత్రి పిఓకే నుంచి కొంతమంది భారత్‌లోకి చొరబడేందుకు యత్నించారు. పహరా కాస్తున్న భద్రతా బలగాలు అడ్డుకున్నాయి.

07/24/2016 - 00:34

న్యూఢిల్లీ, జూలై 23: సుప్రసిద్ధ చిత్రకారుడు ఎస్‌హెచ్ రజా (94) శనివారం కన్నుమూశారు. ఆధునిక చిత్రకళకు చిరునామాగా నిలిచిన ఆయన దీర్ఘకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. భారతీయ చిత్రకళా వైభవాన్ని ప్రపంచానికి అందించిన గొప్ప కళాకారుడాయన. బిందు, పురుష్-ప్రకృతి, నారీల ఇతివృత్తంతో రజా గీసిన చిత్రాలు ఎన్నో ప్రశంసలు అందుకున్నాయి.

07/24/2016 - 00:32

న్యూఢిల్లీ, జూలై 23: అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో గత నెల కిడ్నాప్‌కు గురయిన భారతీయ మహిళ జుడిత్ డిసౌజా క్షేమంగా విడుదలైంది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ శనివారం ఈ విషయం తెలియజేశారు. ఆగాఖాన్ ఫౌండేషన్ తరఫున సీనియర్ టెక్నికల్ అడ్వైజర్‌గా పని చేస్తున్న జుడిత్‌ను గత నెల 9న కాబూల్‌లో ఆమె కార్యాలయం ముందు మిలిటెంట్లుగా అనుమానిస్తున్న కొందరు కిడ్నాప్ చేశారు.

07/24/2016 - 00:29

ముంబయి, జూలై 23: దాదాపు మూడు దశాబ్దాలపాటు భారత్ దేశ రక్షణలో గురుతరమైన పాత్రను పోషించిన ‘గ్రాండ్ ఓల్డ్ లేడీ’ ఐఎన్‌ఎస్ విరాట్ తుది ప్రయాణాన్ని ముంబయి నుంచి కోచీకి శనివారం మొదలుపెట్టింది. ఈ ఏడాది చివర్లో నౌకాదళం నుంచి పూర్తిగా వైదొలుగుతున్న 750 అడుగుల ఈ మహానౌకకు ఇదే చివరి ప్రయాణం అవుతుంది. బుధవారం నాటికి ఈ నౌక కోచీ చేరుకోగలదని భావిస్తున్నారు.

07/24/2016 - 00:52

చండీగఢ్, జూలై 23: శ్రీనగర్‌లో జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వేర్పాటువాదులకు పంజాబ్ టీనేజర్ సవాల్ విసిరింది. జమ్మూకాశ్మీర్‌లో చీటికి మాటికి పాకిస్తాన్ జాతీయ పతాకాలు ఎగరవేయడాన్ని 15 ఏళ్ల ఝాన్వి బెహల్ గర్హించింది. ఆగస్టు 15న శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో భారత జాతీయ పతాకాన్ని ఎగరవేస్తానని, ఎవరు ఆపుతారో చూస్తానని ఆమె సవాల్ చేసింది.

07/24/2016 - 00:26

గ్వాలియర్, జూలై 23: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ సమీప గ్రామంలో 150 అడుగుల లోతైన బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు చనిపోయాడని పోలీసులు శనివారం తెలిపారు. శుక్రవారం తన నాయనమ్మ, అక్కతో కలిసి ఇంటికి తీసుకువస్తుండగా అభయ్ పచోరి అనే మూడేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు పొలంలోని బోరుబావిలో పడిపోయాడు. దాదాపు 22 గంటల పాటు శ్రమించిన అనంతరం శనివారం ఉదయం ఆ బాలుడిని బోరుబావిలోంచి బైటికి తీశారు.

07/24/2016 - 00:18

న్యూఢిల్లీ, జూలై 23: దేశంలో ఎక్కడలేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని కొందరు కుట్ర పన్నుతున్నారని మాలమహానాడు నాయకుడు జి చెన్నయ్య విమర్శించారు. రాజ్యాధికార సాధన కోసం దళితుల్లో ఏకీకరణ జరగాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మాలమహానాడు చేప్పట్టిన రిలే దీక్షలు శనివారం నాటికి నాలుగో రోజుకు చేరుకొన్నాయి.

07/23/2016 - 18:23

చెన్నై : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏఎన్-32 విమానం గల్లంతై 30గంటలైనా ఆచూకీ లభించలేదు. శనివారం తాంబరం ఎయిర్‌వేస్‌కు చేరుకున్న రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏరియల్ సర్వే నిర్వహించారు. విమానం కోసం జరుగుతున్న గాలింపు వివరాలను తెలుసుకున్నారు. చెన్నైకి 280 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిందని భావిస్తున్నా ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి జాడ దొరకలేదు.

Pages