S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/23/2016 - 18:18

లూధియానా: జమ్ముకాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లాల్‌చౌక్‌లో ఆగస్ట్15న భారత జెండాను ఎగరేస్తానని, దమ్ముంటే ఆపమని పంజాబ్ లూధియానాకు చెందిన 15 ఏళ్ల విద్యార్ధిని ఝాన్వీ బెహల్ సవాల్ విసిరారు. జమ్ముకాశ్మీర్ వాసుల్లో కొందరు కావాలనే భారత జెండాను అవమానిస్తూ, పాక్ జెండాలను ఎగురవేస్తున్నారని, వారికి బుద్ధి చెప్పేందుకే తాను లాల్‌చౌక్‌లో తిరంగా ఎగురవేయాలనుకుంటున్నానని చెప్పారు.

07/23/2016 - 18:13

డార్జిలింగ్: పశ్చిమ బెంగాల్ లో సంభవించిన వరదల్లో ఒక భవంతి కూలి ముగ్గురు మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఇందులో మరి కొంతమంది చిక్కుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. స్థానికులతో కలిసి పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు.

07/23/2016 - 17:27

ముజఫర్‌నగర్‌ (ఉత్తరప్రదేశ్‌ ) : ముజఫర్‌నగర్‌లో చందెలమల్‌ గ్రామంలో టీనేజి బాలిక ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉండటం చూసి ఆగ్రహంతో కుటుంబ సభ్యులు ఆ ఇద్దరినీ గొంతునులిమి చంపేశారు. బాలిక తండ్రి ముఖేష్‌, సోదరుడు దీపక్‌లను పోలీసులు విచారించగా కుటుంబం పరువు తీసినందుకు తామే వారిని చంపినట్లు నిందితులు అంగీకరించారు.

07/23/2016 - 16:48

జబల్పూర్: మధ్యప్రదేశ్‌లోని కెహ్రి గ్రామంలో శుక్రవారం బోరుబావిలో పడిన రెండేళ్ల బాలుడు మరణించాడు. బాలుడిని రక్షించేందుకు బిఎస్‌ఎఫ్ సిబ్బంది బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వి సుమారు 15 గంటల సేపు శ్రమించారు. శనివారం మధ్యాహ్నం బాలుడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

07/23/2016 - 16:45

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 31న దిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద రియో పరుగును ప్రారంభిస్తారని కేంద్ర క్రీడలశాఖ మంత్రి విజయ్‌ గోయల్‌ తెలిపారు. బ్రెజిల్‌ రాజధాని రియో డి జెనీరోలో ఆగస్టు 5న ఆరంభం కానున్న ఒలింపిక్‌ గేమ్స్‌పై భారత్‌లో అవగాహన తీసుకురావడంలో భాగంగా ‘రియో పరుగు’ను నిర్వహించనున్నారు.

07/23/2016 - 16:41

దిల్లీ: బులియన్‌ మార్కెట్లో శనివారం పది గ్రాముల పసిడి రూ.20 తగ్గి రూ.30,750కి చేరింది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కేజీ వెండి ధర రూ.75 తగ్గి రూ.46,125కు చేరింది. న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,322.10 అమెరికా డాలర్లు ఉండగా ఔన్సు వెండి ధర 19.59 డాలర్లు ఉంది.

07/23/2016 - 16:39

దిల్లీ: అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన చిత్రకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత హైదర్‌ రజా (94) దిల్లీలో మృతి చెందారు. వృద్ధాప్య సమస్యలతో రెండు నెలలుగా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం కన్నుమూసినట్లు, మధ్యప్రదేశ్‌లోని మండాలాలో అంత్యక్రియలు జరిపించనున్నట్లు ఆయన ఆప్తమిత్రడైన అశోక్‌ చెప్పారు.

07/23/2016 - 15:51

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా కి చెందిన 8 కార్లను వేలం వేయడానికి సిద్ధమైంది. మాల్యా, ఆయన కంపెనీకి చెందిన కార్లను వేలం వేస్తున్నట్లు ఎస్‌బీఐ కాప్‌ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్‌ ప్రకటించింది. ఇటీవల మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్‌ హౌస్‌, ఇతర ఆస్తులు వేలం వేయగా కొనడానికి ఒక్కరు కూడా ముందుకు రాని సంగతి తెలిసిందే.

07/23/2016 - 15:17

శ్రీనగర్: శాంతి భద్రతల సమస్యతో సతమతమవుతున్న జమ్ము-కాశ్మీర్‌లో తాజా పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం ఉదయం ఇక్కడికి చేరుకున్నారు. భద్రతకు సంబంధించి ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన అధికారులతో మాట్లాడతారు. రెండు రోజుల పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, గవర్నర్ నరేంద్రనాథ్ ఒహ్రాలతో ఆయన భేటీ అవుతారు.

07/23/2016 - 15:16

రాయ్‌పూర్: భద్రతాదళాలకు, మావోయిస్టులకు మధ్య శనివారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు మరణించారు. చత్తీస్‌గఢ్‌లోని కుంట ఫారెస్టు ఏరియాలో ఈ ఘటన జరిగింది. సంఘటన ప్రాంతంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Pages