S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/23/2016 - 14:36

శ్రీనగర్‌: కశ్మీర్‌ లోయలో పరిస్థితి కాస్త కుదుటపడడంతో శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో, నాలుగు జిల్లాల్లో అధికారులు కర్ఫ్యూ తీసివేశారు. బందీపొరా, బారాముల్లా, బుద్గాం, గందేర్‌బల్‌ జిల్లాల్లో కర్ఫ్యూ ఎత్తేసినట్లు పోలీసులు తెలిపారు. ఎక్కువ మంది ఒక్కచోట గుమిగూడొద్దంటూ నిషేధాజ్ఞలు జారీ చేశారు. ముందుజాగ్రత్త చర్యగా

07/23/2016 - 12:07

చెన్నై: చెన్నై నగరంలోని తాంబరం నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరి కొద్దిసేపటికే అదృశ్యమైన వైమానిక దళానికి చెందిన విమానం కోసం రెండోరోజు శనివారం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నిన్న ఉదయం 8:30 గంటలకు తమిళనాడులోని తాంబరం నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన 16 నిమిషాలకే కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.

07/23/2016 - 11:34

ఢిల్లీ: ఆఫ్గనిస్థాన్‌లోని కాబూల్‌లో గత నెలలో అపహరణకు గురైన భారతీయ మహిళ జుడిత్ డిసౌజాను కాపాడారు. ఆమె సురక్షితంగా ఉన్నట్టు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. 40 ఏళ్ల జుడిత్ అంతర్జాతీయ ఎన్జీవో ఆఘా ఖాన్ పౌండేషన్‌లో సీనియర్ టెక్నికల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. జూన్ 9న ఆమెను కార్యాలయం బయట అనుమానిత ఉగ్రవాదులు అపహరించుకుపోయారు. అప్పటినుంచి ఆమెను కాపాడడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.

07/23/2016 - 06:20

చెన్నై / న్యూఢిల్లీ, జూలై 22: చెన్నైలోని తాంబరం ఎయిర్‌బేస్‌నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు శుక్రవారం ఉదయం బయలుదేరిన భారత వైమానిక దళానికి చెందిన ఎఎన్-32 విమానం జాడ తెలియకుండా పోయింది. విమానంలో ఆరుగురు విమాన సిబ్బందితో పాటుగా మొత్తం 29 మంది ఉన్నారు. వీరిలో వైమానిక దళానికి చెందిన అధికారి సహా 11 మంది, ఆర్మీకి చెందిన ఒక అధికారి, ఇద్దరు కోస్ట్‌గార్డు అధికారులు, నౌకాదళానికి చెందిన తొమ్మిది మంది ఉన్నారు.

07/23/2016 - 06:17

న్యూఢిల్లీ,జూలై 22: ఆమ్ ఆద్మీ పార్టీ లోక్‌సభ సభ్యుడు భగవంత్ సింగ్ మాన్ నిర్వాకం మూలంగా శుక్రవారం ఓటింగ్‌కు ఏపీ ప్రత్యేక హోదాకు ప్రైవేట్ మెంబర్ బిల్లు రెండు వారాల తరువాత మరోసారి రాజ్యసభ ముందుకు వస్తుంది. కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచందర్‌రావు ప్రతిపాదించిన ఈ బిల్లుపై రెండు వారాల తరువాత కూడా ఓటింగ్ జరుగుతుందా? అనేది అనుమానమే.

07/23/2016 - 06:46

న్యూఢిల్లీ,జూలై 22: ఎన్‌డిఏ ప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ సభ్యుడు కె.వి.పి.రామచందర్‌రావుప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఓటింగ్ జరగకుండా అడ్డుకుంది. బిజెపి, అకాలీదళ్ సభ్యులు శుక్రవారం చేసిన గొడవ మూలంగా ప్రత్యేక హోదా బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరగలేదు.

07/23/2016 - 03:06

గోరఖ్‌పూర్ (ఉత్తరప్రదేశ్), జూలై 22: కులతత్వ రాజకీయాలను, బంధుప్రీతి రాజకీయాలను తిరస్కరించి, అభివృద్ధి రాజకీయాలకు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు.

07/23/2016 - 07:15

గోరఖ్‌పూర్, జూలై 22: దేశాన్ని ఆధునికం, సౌభాగ్యవంతం చేయడంలో స్వామీజీలు, వివిధ మతాలకు చెందిన మఠాలు కీలకపాత్ర పోషించాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయ పడ్డారు. అంతేకాదు వీరిలో చాలా మంది ఇప్పటికే టాయిలెట్లు నిర్మించడం, వైద్య సేవలు అందించడం లాంటి అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నాయని కూడా ఆయన అన్నారు.

07/23/2016 - 02:59

న్యూఢిల్లీ, జూలై 22: ప్రత్యేక హోదాపై ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రస్తుతం రాజ్యసభలో వాయిదా వేయగలిగారే దాన్ని ఓటింగ్ రాకుండా అడ్డుకోలేరని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్‌రావుస్పష్టం చేశారు. ఈ బిల్లు రాజ్యసభలో మళ్లీ అడ్డుకోడానికి ఎన్ని కుట్రలు చేస్తారో చూడాలని ఆయన అన్నారు. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై అనేక పార్టీలు ముక్తకంఠంలో ఖండించాయని శుక్రవారం ఇక్కడ చెప్పారు.

07/23/2016 - 02:58

అహ్మదాబాద్, జూలై 22: దళితుల ఆందోళనలతో అట్టుడికిన గుజరాత్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అనేక ప్రాంతాల్లో నిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయి. బోటా డ్ జిల్లాలో ఆవుచర్మం క్రయిస్తున్నారన్న ఆరోపణలతో నలుగురు దళితులను అర్థనగ్నం చేసి దాడి చేసిన ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. అనేక ప్రాంతాల్లో మూడు రోజులుగా హిం సాత్మక సంఘటనలు జరిగాయి.

Pages