S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/22/2016 - 18:21

దిల్లీ: శాంతిభద్రతలు మృగ్యమైనందున జమ్ము-కాశ్మీర్ రాష్ట్రంలో తక్షణం గవర్నర్ పాలన విధించాలంటూ పాంథర్స్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం నాడు విచారణకు సుప్రీం కోర్టు స్వీకరించింది. వచ్చే వారం ఈ పిటిషన్‌పై విచారణ జరుగుతుంది. జమ్ము-కాశ్మీర్ చట్టంలోని ఓ నిబంధన మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

07/22/2016 - 18:07

శ్రీనగర్‌: పుల్వామా జిల్లా అవంతిపొరాలో ఆందోళనకారులు శుక్రవారం రెచ్చిపోయారు. భద్రతా బలగాలపైనా దాడులు చేశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు మృతిచెందాడు. దీంతోఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మూకశ్మీర్‌ అల్లర్లలో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 45కి చేరింది.

07/22/2016 - 18:00

చెన్నై: చెన్నైలోని తాంబరం నుంచి అండమాన్‌ రాజధాని పోర్టుబ్లెయిర్‌ వెళ్తూ శుక్రవారం గల్లంతైన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానం కోసం గాలింపు చర్యల్లో 13 యుద్ధనౌకలు, 5 యుద్ధ విమానాలు, ఓ జలాంతర్గామి పాల్గొంటున్నాయి. గల్లంతైన విమానంలో ఆరుగురు సిబ్బంది సహా 29 మంది ఉన్నారు. విమానం కూలిపోయిందా? లేదా దారి మళ్లిందా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

07/22/2016 - 17:39

లక్నో: తనను, తన కుమార్తెను వేధింపులకు గురిచేస్తున్నారని బిఎస్‌పి అధినేత్రి మాయావతిపైన, ఆ పార్టీకి చెందిన ముగ్గురు నేతలపైన బిజెపి బహిష్కృత నేత దయాశంకర్ సింగ్ భార్య స్వాతి సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తన భర్త దయాశంకర్ ఇప్పటికే క్షమాపణలు చెప్పారని, అయినప్పటికీ తనను, తన 12 ఏళ్ల కుమార్తెను బిఎస్పీ కార్యకర్తలు వేధిస్తున్నారని స్వాతి ఆరోపించారు.

07/22/2016 - 17:39

దిల్లీ: పార్లమెంటు వద్ద భద్రతావ్యవస్థను ఎలా ఛేదించాలో సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సామాజిక వెబ్‌సైట్లలో పోస్టు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి భగవంత్ మాన్ చివరకు క్షమాపణలు చెప్పారు. తక్షణం తన ముందు హాజరుకావాలంటూ ఆయనకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సమన్లు జారీ చేశారు. దీంతో భగవంత్ మాన్ శుక్రవారం ఉదయం స్పీకర్‌ను కలిశారు.

07/22/2016 - 17:38

దిల్లీ: రాష్ట్ర విభజన ఫలితంగా సమస్యలను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ శుక్రవారం ఆరోపించారు. ఎపి విషయంలో బిజెపికి చిత్తశుద్ధి లేదన్నారు. తమ పార్టీ ఎంపీ కెవిపి ప్రతిపాదించిన ప్రైవేటు బిల్లుకు అన్ని ప్రాంతీయపార్టీలు మద్దతు ఇవ్వగా బిజెపి మాత్రం వౌనం వహించడం దారుణమన్నారు.

07/22/2016 - 15:56

గోరఖ్‌పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఎయిమ్స్‌కు, ఎరువుల ప్లాంట్‌ పునరుద్ధరణకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం శంకుస్థాపన చేశారు. 150 ఆపరేషన్‌ థియేటర్లు, 750 పడకలతో ఎయిమ్స్‌ను ఏర్పాటుచేయనున్నారు. ఎరువుల ప్లాంట్‌ను తిరిగి ప్రారంభిస్తే 4వేల మందికి ఉద్యోగాలు లభించడంతో పాటు రైతులకు యూరియా అందుతుంది.

07/22/2016 - 15:17

లక్నో: ‘నా భర్తపై పోలీసులు కేసు పెట్టారు.. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన క్షమాపణ చెప్పారు.. బిజెపి నుంచి ఆయనను బహిష్కరించారు.. అయినా బిఎస్‌పి అధినేత్రి మాయావతి ఇంకా శాంతించడం లేదు.. నా భర్త తలతీసే వరకూ ఆమె నిద్రపోరు..’- అంటూ దయాశంకర్ భార్య స్వాతి సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

07/22/2016 - 15:16

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్‌లో శాంతి భద్రతల పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. పలుచోట్ల హింసాత్మక సంఘటనలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్‌ను భద్రతాదళాలు కాల్చిచంపినందుకు నిరసనగా సుమారు రెండు వారాలుగా కాశ్మీర్‌లో ఆందోళనలు జరుగుతున్నాయి. శ్రీనగర్‌లో 14 రోజులుగా బంద్ కొనసాగుతోంది.

07/22/2016 - 15:14

దిల్లీ: భద్రతావ్యవస్థను దాటుకుంటూ పార్లమెంటులోకి ఎలా వెళ్లాలన్న విషయమై వీడియో తీసి సామాజిక మీడియాలో పోస్టు చేసిన ఆప్ ఎంపీ భగవంత్ మాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభలో శుక్రవారం కూడా సభ్యులు డిమాండ్ చేశారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, దేశ భద్రతకు సంబంధించి ఎవరు ఎలాంటి తప్పు చేసినా క్షమించరాదన్నారు.

Pages