S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/22/2016 - 02:23

న్యూఢిల్లీ, జూలై 21: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై హస్తినలో రాజకీయం రసకందాయంగా సాగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత కెవిపి రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు సభ్యుడి బిల్లు శుక్రవారం చివరి రెండున్నర గంటల్లో చర్చకు రానుంది. ఇది ఓటింగ్ దాకా వెళ్తుందా? లేక ఓటింగ్‌కు రాకుండా అధికార బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా అన్నది సస్పెన్స్‌గానే ఉంది.

07/22/2016 - 02:17

న్యూఢిల్లీ, జూలై 21: గుజరాత్‌లో దళితులపై జరిగిన దాడి మానవత్వానికే మాయని మచ్చ అని కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్వరంతో స్పందించింది. ఇలాంటి సంఘటనలను ఉపేక్షించేది లేదని గురువారం రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానంగా చెప్పింది. ఎన్టీయే పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయంటూ విపక్షాలు చేసిన ఆరోపణలను తిప్పికొట్టింది.

07/22/2016 - 01:02

సమధియాల (గుజరాత్), జూలై 21: గుజరాత్‌లో బలహీన వర్గాలకు, దళితులకు దిక్కు లేకుండా పోతోందంటూ బిజెపి, ఆరెస్సెస్‌లపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆవు చర్మాన్ని వలుస్తున్నారనే ఆరోపణపై గిర్-సోమనాథ్ జిల్లాలోని ఉనా పట్టణ శివార్లలో ఉన్న సోమధియాల గ్రామానికి చెందిన ఏడుగురు దళిత యువకులు గోరక్షా సమితికి చెందిన కార్యకర్తలు బట్టలూడదీసి దారుణంగా చితకబాదిన విషయం తెలిసిందే.

07/22/2016 - 00:57

లక్నో, జూలై 21 బిఎస్పీ అధినేత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి బహిష్కృత నేత దయాశంకర్ సింగ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీకి చెందిన వేలాది కార్యకర్తలు గురువారం లక్నోలో భారీ నిరసన ప్రదర్శన జరిపారు. నగరంలో రద్దీగా ఉండే దరియాగంజ్ ప్రాంతంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ధర్నాకు రాష్ట్రం నలుమూలలనుంచి వేలాదిగా బిఎస్పీ కార్యకర్తలు తరలివచ్చారు.

07/22/2016 - 00:52

న్యూఢిల్లీ, జూలై 21: తనపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన దయాశంకర్ సింగ్‌పై బిఎస్‌పి అధినేత్రి మాయావతి మరింతగా పట్టుబిగించారు. దయాశంకర్‌ను అన్ని పదవుల నుంచీ తొలగించినంత మాత్రాన సరిపోదని, ఆయనపై బిజెపి స్వయంగా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దళితులపై దాడులు తీవ్రమయ్యాయని, గోరక్షణ పేరుతో ఇలాంటి కృత్యాలకు పాల్పడుతున్నారని గురువారం రాజ్యసభలో అన్నారు.

07/22/2016 - 00:46

న్యూఢిల్లీ, జూలై 21: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించబోతున్న నూతన విద్యావిధానం, విద్యారంగంలో రాష్ట్రాల హక్కులను హరించే విధంగా ఉండబోదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ గురువారం లోక్‌సభలో తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు జవాబిచ్చిన ఆయన నూతన విద్యావిధానంలో పాఠశాలల్లో ఉదయం ప్రార్థనలు తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు.

07/22/2016 - 00:42

న్యూఢిల్లీ, జూలై 21: కాశ్మీర్‌లో ఇటీవలి అల్లర్లను రాజేయడంలో పాకిస్తాన్ కీలకపాత్ర పోషించిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. పాకిస్తానే భారత్‌లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. కాశ్మీర్ లోయలో పరిస్థితి క్రమంగా కుదుటపడుతోందని ఆయన తెలిపారు.

07/22/2016 - 00:38

న్యూఢిల్లీ, జూలై 21: ఆఫ్రికన్లపై ఇటీవల జరిగిన దాడులు జాతి వివక్షతో కానీ, ముందస్తు కుట్రతో కానీ చేసినవి కావని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. గురువారం రాజ్యసభలో మాట్లాడుతూ ఇవి సంఘ వ్యతిరేక శక్తులు చేసిన నేరపూరిత దాడులని అన్నారు. ఆఫ్రికన్లపై ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని సభ్యులకు వివరించారు.

07/22/2016 - 00:36

న్యూఢిల్లీ, జూలై 21: శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని తాము వ్యతిరేకించడం లేదని కేరళ్‌లోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వ స్పష్టం చేసింది. కేరళ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మహిళల ఆలయ ప్రవేశాన్ని సమర్ధిస్తూ 2007లో ఇచ్చిన అఫిడవిట్‌కు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. ‘ఆనాడు ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం అందజేసిన అఫిడవిట్‌కు మేం కట్టుబడి ఉన్నాం.

07/22/2016 - 00:35

న్యూఢిల్లీ, జూలై 21: భారత దేశంలో ఉన్న శాస్త్ర పరిశోధన అభివృద్ధి సంస్థలన్నీ ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి చేరుకోగలవన్న ధీమాను రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం పరిశోధనలకు ఇస్తున్న ప్రాధాన్యత సంతృప్తికరంగా లేదని, దీన్ని మరింతగా పెంచాల్సిన అవసరం ఎంతో ఉందని వెల్లడించారు.

Pages