S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/06/2016 - 00:04

న్యూఢిల్లీ, జూలై 5: రాజకీయంగా ఎంతో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో పార్టీ అప్పగించే ఎలాంటి బాధ్యతనైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున షీలా దీక్షిత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టే అవకాశాలున్నాయన్న సంకేతాల నేపథ్యంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలకు రాజకీయ ప్రాధాన్యత చేకూరింది.

07/06/2016 - 00:02

న్యూఢిల్లీ, జూలై 5: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన మంత్రివర్గం విస్తరణను కాంగ్రెస్ పార్టీ విమర్శలతో ముంచెత్తింది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా మంగళవారం ఏఐసిసి కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ రెండు మూడు నెలల నుండి చర్చనీయాంశంగా మారిన మంత్రివర్గం విస్తరణ తుస్సుమనిపించిందని అన్నారు.

07/06/2016 - 00:02

న్యూఢిల్లీ, జూలై 5: బొంబాయి, మద్రాసు హైకోర్టుల పేర్లు మారనున్నాయి. మారిన నగరాల పేర్లకు అనుగుణంగా ఈ హైకోర్టుల పేర్లను మార్చాలనే డిమాండ్ చాలాకాలంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ డిమాండ్లకు అనుగుణంగా బాంబే హైకోర్టును ముంబయి హైకోర్టుగా, మద్రాసు హైకోర్టు పేరును చెన్నై హైకోర్టుగా మార్చాలని మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.

07/06/2016 - 00:57

న్యూఢిల్లీ, జూలై 5: అవినీతి కేసులో సోమవారం అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య కార్యదర్శి రాజేంద్ర కుమార్‌ను, మరో నలుగురిని స్థానిక ప్రత్యేక కోర్టు మంగళవారం అయిదు రోజులు సిబిఐ కస్టడీకి అప్పగించింది.

07/05/2016 - 18:08

ముంబయి: ‘కండల వీరుడు’, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను ‘హిట్ అండ్ రన్’ కేసు ఇంకా వదలడం లేదు. ఆ కేసులో నిర్దోషిగా విడుదలైన సల్మాన్‌కు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దానిని విచారణకు స్వీకరిస్తున్నట్లు సుప్రీం మంగళవారం తెలిపింది.

07/05/2016 - 16:27

ఢిల్లీ: హైకోర్టుల పేర్లు మార్చుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కలకతా హైకోర్టును కోల్‌కతా హైకోర్టుగా, బాంబే హైకోర్టును ముంబై హైకోర్టుగా, మద్రాస్ హైకోర్టును చెన్నై హైకోర్టుగా పిలుస్తారు.

07/05/2016 - 15:39

దిల్లీ: మోదీ మంత్రివర్గంలో 19 మంది కొత్తవారు ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఓ మంత్రి గాభరాలో తన పేరును మరచిపోయారు. తన పేరు చెప్పకుండానే ఆయన ప్రమాణ పత్రం చదువుతుండగా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ గమనించి తప్పును సరిదిద్దారు. మహారాష్ట్ర నుంచి బిజెపి భాగస్వామి పక్షమైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి చెందిన రామ్‌దాస్ అథవాలే (56) ప్రమాణ స్వీకారం చేస్తున్నపుడు తడబడిపోయి తన పేరును చదవడం మరిచారు.

07/05/2016 - 13:49

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గం నుంచి ఐదుగురికి ఉద్వాసన పలికారు. నిహాల్‌ చంద్‌, రామశంకర్‌ కఠారియా, సన్వర్‌లాల్‌ జాట్‌, మనుసుఖ్‌భాయ్‌ వాస్వా, ఎం.కె.కుందారియాను మంత్రివర్గం నుంచి తొలగించారు. సహాయ మంత్రిగా ఉన్న ప్రకాశ్‌ జవదేకర్‌కు పదోన్నతి కల్పించడంతో పాటు 19మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు.

07/05/2016 - 12:28

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం మంగళవారం ఉదయం ముగిసింది. రాష్టప్రతి భవన్‌లోని దర్బార్ హాలులో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుత సహాయ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు క్యాబినెట్ హోదా లభించింది. ఈసారి క్యాబినెట్ విస్తరణలో ఉత్తరాది రాష్ట్రాలకు పెద్దపీట దక్కింది.
కొత్త మంత్రులు వీరే...
-------------------------

07/05/2016 - 11:51

దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరానికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి సమన్లు జారీ చేసింది. కార్తీ చిదంబరం స్వయంగా లేదా తన ప్రతినిధి ద్వారా ఈ వారంలో హాజరవ్వాలని ఈడీ ఆదేశించింది. 2జీ కుంభకోణంలో ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ ఒప్పందంలోని మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి కేసు విచారణ జరుగుతుండగా తొలిసారి కార్తీకి ఈడీ నోటీసులు పంపించింది.

Pages