S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/05/2016 - 06:09

న్యూఢిల్లీ, జూలై 4: దేశంలోని రైతులకు 4500కోట్లమేర లబ్ధి చేకూర్చేలా కేంద్రం వివిధ రకాల ఎరువుల ధరల్ని తగ్గించింది. గత పదిహేనేళ్లలో తొలిసారిగా నాన్ యూరియా ఎరువుల రేట్ల నూ తగ్గించామని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి అనంత్‌కుమార్ సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. డిఎపి సహా నాన్ యూరియా ఎరువుల రిటైల్ ధరల్ని టన్నుకు 5వేల రూపాయల చొప్పున తగ్గించామన్నారు.

07/05/2016 - 05:28

న్యూఢిల్లీ, జూలై 4: భర్తీ ప్రక్రియ ఎలా ఉన్నప్పటికీ అన్ని ఉద్యోగాల్లోనూ దివ్యాంగులకు మూడు శాతం రిజర్వేషన్లు తప్పనిసరిగా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.

07/05/2016 - 05:27

న్యూఢిల్లీ, జూలై 4: నీట్ నిర్వహణను ఈ సంవత్సరానికి మినహాయింపునిస్తూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్సును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు జూలై 7కి వాయిదా వేసింది. ప్రముఖ సామాజిక వేత్త ఆనంద్ రే, సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్‌లు ఈ అర్టినెన్సును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.

07/05/2016 - 05:26

న్యూఢీల్లీ, జూలై 4: తెలుగు రాష్ట్రాలకు చెందిన ఖైదీల విడుదల కేసు విచారణను సుప్రీం కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. 2007లో ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది.

07/05/2016 - 05:24

న్యూఢిల్లీ, జూలై 4: ఎమ్మెల్యే రోజా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణలో రెండు వారాల్లో ఆమె లిఖిత పూర్వక వివరణ ఇచ్చే అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై ఈ ఏడాది చివరి కల్లా విచారణను పూర్తి చేయాలని ఉమ్మడి హైకోర్టుకు సుప్రీంకోర్టు నిర్దేశించింది.

07/04/2016 - 18:30

దిల్లీ: అవినీతి రాజకీయాలు అంతం కావాలంటూ నిత్యం ప్రసంగాలు చేసే దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీపార్టీ అధినేత కేజ్రీవాల్‌కు సిబిఐ అనుకోని షాక్ ఇచ్చింది. దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్రకుమార్‌తో పాటు మరో నలుగురు అధికారులను అవినీతి ఆరోపణలపై సిబిఐ సోమవారం అరెస్టు చేసింది. ఈ పరిణామాలను సిఎం కేజ్రీవాల్ ఊహించలేదు.

07/04/2016 - 17:34

దిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డిమాండ్‌ ఎక్కువవడంతో వెండి ధర విపరీతంగా పెరుగుతోంది. వరుసగా ఆరో రోజు సోమవారం ధర పెరగడంతో 28 నెలల గరిష్ఠానికి చేరుకుంది. సోమవారం రూ. 2,155 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 47,715గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో ధర పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. బంగారం ధర కూడా నేడు స్వల్పంగా పెరిగింది. రూ.

07/04/2016 - 17:13

లక్నో: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో యుపిలో అపుడే రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. విపక్ష పార్టీల నేతలను తమవైపు తిప్పుకునేందుకు బిజెపి అగ్రనాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తాజాగా బిజెపిలో అప్నాదళ్ పార్టీ విలీనమైంది. లోక్‌సభలో ఇద్దరు ఎంపీల బలం ఉన్న ఈ పార్టీకి వారణాసి, మీర్జాపూర్ ప్రాంతంలో ఓబిసీలు, కూర్మి కులస్థుల్లో కొంత పట్టు ఉంది.

07/04/2016 - 17:11

ముంబయి: ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గంలో మంగళవారం మార్పులు, చేర్పులు చేస్తారన్న ఊహాగానాలు ఊపందుకోవడంతో ‘ఇంతకీ మాకెన్ని పదవులిస్తారు?’- అంటూ శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రశ్నిస్తున్నారు. మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో శివసేన కూడా భాగస్వామి పార్టీ కావడంతో క్యాబినెట్ మార్పులపై ఉద్ధవ్ ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఉద్ధవ్ ప్రశ్నలతో బిజెపి నాయకులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు.

07/04/2016 - 17:03

ముంబై: సోమవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు రోజంతా లాభాల్లోనే పయనించాయి. సెన్సక్స్ 134 పాయింట్ల లాభంతో 27,279 దగ్గర,నిఫ్టీ 42.పాయింట్ల లాభంతో 8,371దగ్గర క్లోజయ్యాయి. మరోవైపు బులియన్ మార్కెట్లో పసిడి మెరుపులు కొనసాగుతున్నాయి. ఎంసీఎక్స్ మార్కెట్ లో 10.గ్రా. బంగారం ధర 365 రూపాయల లాభంతో 31,828 దగ్గర ఉంది.

Pages