S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/24/2016 - 01:22

న్యూఢిల్లీ, జూన్ 23: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి గురువారం కూడా ఆర్థిక శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారు అయిన అరవింద్ సుబ్రమణియన్‌పై దాడి కొనసాగించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. స్వయంగా అరవింద్ సుబ్రమణియన్‌ను వెనుకేసుకొచ్చినప్పటికీ సుబ్రహ్మణ్య స్వామి మాత్రం తన దాడిని ఆపలేదు. ‘ఆయన ఏమి చెప్పాలనుకుంటే అది చెప్పనివ్వండి. జైట్లీ చెప్పినదానిపై నేను చేసేదేమీ లేదు.

06/24/2016 - 01:22

న్యూఢిల్లీ, జూన్ 23: తప్పుడు వైద్యం చేసినందుకు గానూ ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రికి, వైద్యుడికి రూ. 10లక్షలు చెల్లించాలని వినియోగదారుల ఫోరం ఆదేశించింది. ఓ మహిళకు తలలో ట్యూమర్ తొలగించటానికి తప్పుడు చికిత్స చేయటంతో తప్పనిసరిగా రెండోసారి సర్జరీ చేయాల్సిన పరిస్థితి కలిపంచటంతో ఆ మహిళ చనిపోయింది.

06/24/2016 - 01:21

ముంబయి, జూన్ 23: అంతర్జాతీయ యోగ దినోత్సవం రోజున యావత్ ప్రపంచమంతా ఆసనం వేస్తే, బిజెపి మిత్రపక్షమైన శివసేన మాత్రం ప్రధాని నరేంద్ర మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. భారత సంస్కృతిని ప్రతిబింబించే యోగకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చారంటూ ప్రశంసిస్తూనే, వాస్తవ సవాళ్లకు యోగ ఎంతమేరకు పరిష్కారం చూపుతుందని ప్రశ్నించింది.

06/24/2016 - 01:20

న్యూఢిల్లీ, జూన్ 23: ఈ సంవత్సరం ఇఫ్తార్ విందును ఇవ్వరాదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయించారు. సాధారణంగా సంప్రదాయపరమైన వేడుకలా కాకుండా రాజకీయ వేదికగా మారే ఇఫ్తార్ విందును కాంగ్రెస్ ఈసారి రద్దు చేసుకోవటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా ప్రతి సంవత్సరం రాజధానిలోని అశోకా హోటల్‌లో ఇఫ్తార్ విందు ఇవ్వటం సోనియా సంప్రదాయంగా పాటిస్తూ వస్తున్నారు.

06/24/2016 - 01:19

న్యూఢిల్లీ, జూన్ 23: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ‘స్మార్ట్ సిటీ పథకం’లో చోటు దక్కించుకున్న 20 నగరాల్లో పనులను ఈ నెల 25న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాంచనంగా ప్రారంభిస్తారు. పుణేలో 5000 సీటింగ్ సామర్థ్యం కలిగిన శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంతో ‘స్మార్ట్ సిటీ మిషన్’ పథకం పనులు అమలులోకి రానున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

06/23/2016 - 18:10

దిల్లీ: న్యూదిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఎంఎం ఖాన్ హత్యకేసులో ప్రమేయం ఉన్నందున దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను పదవి నుంచి తొలగించి అరెస్టు చేయాలని ఆమ్ ఆద్మీపార్టీ గురువారం డిమాండ్ చేసింది. ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం నిరాకరించిన ఖాన్‌పై చర్యలు తీసుకోవాలని గవర్నర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎందుకు రాశారని ఆప్ దిల్లీ విభాగం కన్వీనర్ దిలీప్ పాండే ప్రశ్నించారు.

06/23/2016 - 18:09

శ్రీనగర్: కుప్వారా జిల్లా లాలోబ్ అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో అటవీ ప్రాంతానికి పారామిలటరీ దళం సభ్యులు చేరుకున్నారు. సైనికులను చూసి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతాదళం నుంచి ఎదురుకాల్పులు మొదలయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించగా, పరారైన వారి కోసం సైనికులు గాలిస్తున్నారు.

06/23/2016 - 18:09

చెన్నై: ప్రముఖ దక్షిణాది నటుడు శరత్‌కుమార్ గురువారం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.్ఛతీలో నొప్పిరావడంతో ఆయన అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

06/23/2016 - 16:21

దిల్లీ: ఆదాయపుపన్ను శాఖ పేర్కొన్న ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారుల’ జాబితాలో ఉన్న వ్యక్తుల ఆస్తులను మాత్రమే వేలం వేస్తామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ జాబితాలో కేవలం 60 మంది పేర్లు మాత్రమే ఉన్నాయని, చాలామంది పేర్లు ఇంకా ఉండాలన్నారు. ఆదాయపుపన్ను శాఖతో వివాదాలున్న వారిని ఆ జాబితాలో చేర్చలేమన్నారు.

06/23/2016 - 14:08

బెంగళూరు: గుల్బర్గాలోని ఓ నర్సింగ్ కళాశాలలో కేరళకు చెందిన జూనియర్ విద్యార్థిని చేత బలవంతంగా ఫినాయిల్ తాగించి ర్యాగింగ్‌కు పాల్పడిన ఇద్దరు సీనియర్ విద్యార్థినులపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ర్యాగింగ్ పేరిట ఫినాయిల్ తాగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలైన నర్సింగ్ విద్యార్థిని ప్రస్తుతం కేరళోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Pages