S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/29/2016 - 20:03

న్యూదిల్లి:కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలాసీతారామన్‌లకు రాజ్యసభకు పంపేందుకు మరోసారి అవకాశం దక్కింది. ఈ విషయాన్ని బిజెపి అధిష్టానం వెల్లడించింది. రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల జాబితాలో వారి పేర్లున్నాయి. కాకపోతే గతంలో వారు ప్రాతినిధ్యం వహించిన రాష్ట్రాలనుంచి ఈసారి వారు పోటీ చేయడం లేదు. వెంకయ్య గతంలో కర్నాటక నుంచి ప్రాతినిధ్యం వహించగా ఇప్పుడు రాజస్థాన్‌నుంచి రంగంలోకి దిగుతున్నారు.

05/29/2016 - 20:02

హైదరాబాద్:తెలంగాణలో 2019 ఎన్నికల నాటికి బలీయమైన శక్తిగా అవతరిస్తామని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అభిప్రాయపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఎన్‌డిఎ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. టిఆర్‌ఎస్‌తో పొత్తు ప్రతిపాదనలేవీ లేవని, వచ్చినపుడు పరిశీలిస్తామని అన్నారు.

05/29/2016 - 17:20

దావణగెరె:కేంద్రంలోని తన ప్రభుత్వం పేదలకోసమే పనిచేస్తుందని, ఏసీ రూముల్లో కూర్చుని సలహాలు ఇచ్చేవారికోసం పనిచేయదని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. కర్నాటకలోని దావణగెరెలో ఆదివారం నిర్వహించిన ‘వికాస్ ర్యాలీ’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వారంలోనే తానేం చేశానంటూ ప్రశ్నించినవారు ఉన్నారని ఆయన అన్నారు.

05/29/2016 - 17:20

న్యూదిల్లి:రాజధాని నగరం దిల్లీలో ఆరుగురు ఆఫ్రికన్లపై దాడికి పాల్పడిన సంఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్‌తో విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఫోన్‌లో చర్చించారు.

05/29/2016 - 17:19

లూథియానా:పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్ మనుమడు హరింత్‌సింగ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కణతపై బుల్లెట్ గాయాలున్నాయి. చండీగఢ్‌లోని తన ఇంట్లో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

05/29/2016 - 16:36

హైదరాబాద్:్భరతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. సాయంత్రం జరిగే పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు పార్టీ తెలంగాణశాఖ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ స్వాగతం పలికారు.

05/29/2016 - 16:35

న్యూదిల్లి:హిమాచల్ ప్రదేశ్‌లోని రాపూర్ బుషాపురం వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ మునిమనుమడు అభితేజ్ సంధు (27) దుర్మరణం పాలయ్యాడు. భగత్‌సింగ్ తోబుట్టువు మునిమనుమడైన సంధు ద్విచక్రవాహనంపై ఇంటికి వెడుతూండగా అదుపుతప్పి పడిపోవడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. వెనుక మరో కారులో వస్తున్న అతడి స్నేహితులు చూసి ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది.

05/29/2016 - 05:19

మఫ్లంగ్, మే 28: మేఘాలయలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన శనివారం రెండోరోజు కూడా కొనసాగింది. పర్యాటక కేంద్రమైన మఫ్లంగ్ మోదీ గ్రామాన్ని సందర్శించారు. షిల్లాంగ్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ప్రధాని రాక సందర్భంగా స్థానిక కళాకారులు అక్కడి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా నృత్యాలు, సంప్రదాయ సంగీతంతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

05/29/2016 - 05:16

న్యూఢిల్లీ, మే 28: నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం సాయంత్రం ఇండియా గేట్ వద్ద భారీ ఎత్తున వేడుకలు నిర్వహించింది. బిజెపి కార్యకర్తల సందడితో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.

05/29/2016 - 05:13

న్యూఢిల్లీ, మే 28: మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరంను కాంగ్రెస్ పార్టీ మహారాష్టన్రుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది. త్వరలో జరగబోయే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకోసం కాంగ్రెస్ పార్టీ 8 మంది అభ్యర్థులను శనివారం ప్రకటించింది. పార్టీ సీనియర్ నాయకులు ఆస్కార్ ఫెర్నాండెజ్, జైరాం రమేశ్‌లను కర్నాటకనుంచి, కపిల్ సిబల్‌ను ఉత్తరప్రదేశ్‌నుంచి అభ్యర్థులుగా ఎంపిక చేసింది.

Pages