S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/29/2016 - 05:13

న్యూఢిల్లీ, మే 28: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఇ) శనివారం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల్లో దేశవ్యాప్తంగా 1,68,541 మంది విద్యార్థులు 10 సిజిపిఎ (క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్) మార్కులు సాధించారు. వీరిలో బాలురు 85,316 మంది ఉండగా, బాలికలు 83,225 మంది ఉన్నారు.

05/29/2016 - 05:07

పుదుచ్చేరి, మే 28: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి వి నారాయణస్వామి శనివారం పుదుచ్చేరి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన పుదుచ్చేరికి పదో ముఖ్యమంత్రి కావడానికి రంగం సిద్ధమయింది.

05/29/2016 - 05:04

న్యూఢిల్లీ/ముంబై, మే 28: మోదీ ప్రభుత్వం గత రెండేళ్లలో ఏం సాధించారని సంబరాలు చేసుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. దేశమంతటా రైతులు కరవుతో అల్లాడుతుంటే ఇండియాగేట్ దగ్గర మోదీ సర్కారు పండుగ చేసుకుంటోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ న్యూఢిల్లీలో విమర్శించారు. మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధి ఆగిపోయిందని..

05/29/2016 - 04:44

సింహాచలం, మే 28 : దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో జీవనం సాగించాలని వరాహ లక్ష్మీనృసింహస్వామి వారిని ప్రార్థించినట్లు మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డి దేవెగౌడ అన్నారు. శనివారం ఆయన సింహాచలేశుని దర్శనం చేసుకున్నారు. తన స్నేహితుడి ఆహ్వానం మేరకు విశాఖపట్నం వచ్చినట్లు ఆయన చెప్పారు. వరాహలక్ష్మీ నృసింహస్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.

05/29/2016 - 04:18

న్యూఢిల్లీ, మే 28: తమిళనాడులోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణ కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి రాబోయే రోజుల్లో తాజాగా మళ్లీ నిర్వహించాలని కేంద్ర ఎన్నిల సంఘం శనివారం నిర్ణయించింది. ఎన్నికల కోసం ఒకసారి జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడం దేశ ఎన్నికల చరిత్రలో ఇదే ప్రథమం. తమిళనాడు అసెంబ్లీకి ఈ నెల 16న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

05/29/2016 - 01:09

న్యూఢిల్లీ, మే 28: దేశంలో కొన్నిరోజులుగా రెండు వాదాలు మాత్రమే ప్రధానంగా వినిపిస్తున్నాయ. అవి ఒకటి వికాస వాదం. రెండు విరోధ వాదం. మనం వికాసవాదాన్ని అనుసరించే ముందుకుపోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శనివారం రాత్రి ఇండియాగేట్ వద్ద ఎన్డీయే ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన మెగా ఈవెంట్ ‘ఏక్ నరుూ సుబహ్’ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు.

05/28/2016 - 18:16

పుదుచ్చేరి: పుదుచ్చేరి ముఖ్యమంత్రి పదవికి కేంద్ర మాజీమంత్రి వి.నారాయణస్వామిని కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశంలో ఎంపిక చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్- డిఎంకె కూటమికి మెజార్టీ లభించిన సంగతి తెలిసిందే. సిఎం పదవికి కాంగ్రెస్‌లో పోటీ ఏర్పడగా, శనివారం ఇక్కడ పార్టీ పరిశీలకులు షీలా దీక్షిత్, ముకుల్ వాస్నిక్ సమక్షంలో అధికారపక్ష ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు.

05/28/2016 - 16:54

దిల్లీ: రాజ్యసభ ఎన్నికల సందర్భంగా 8 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో తమ పార్టీకి తగినంత సంఖ్యాబలం లేనందున పోటీ చేయరాదని టి.కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశంలో నిర్ణయించారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేనందున అక్కడ ఆ పార్టీ పోటీ చేసే అవకాశమే లేదు.

05/28/2016 - 15:55

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా బాన్సీ వద్ద అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మావోలు సమావేశమవుతున్నారని సమాచారం అందడంతో పోలీసులు బాన్సీ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లారు. తమను చూసి మావోలు తొలుత కాల్పులు జరపగా, తాము కూడా తిరిగి కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు మృతిచెందగా మిగతా వారు పరారయ్యారని తెలిపారు.

05/28/2016 - 14:42

దిల్లీ: సీబీఎస్‌ఈ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) పదో తరగతి ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. www.cbse.nic.in, www.results.nic.in, www.cbseresults.nic.in వెబ్‌సైట్లలో విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చని బోర్డు తెలిపింది.

Pages