S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/26/2016 - 18:22

ముంబయి: ప్రధాని నరేంద్ర మోదీ రెండేళ్ల పాలన తీరు సంతృప్తికరంగా లేదని బిజెపి మిత్రపక్షమైన శివసేన పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. శివసేన పార్టీ పత్రిక ‘సామ్నా’లో మోదీ విదేశీ పర్యటనలపైనా ఘాటైన వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. ఇంతకీ మోదీ స్థిర నివాసం భారత్‌లోనా? విదేశాల్లోనా? అని శివసేన ప్రశ్నించింది.

05/26/2016 - 18:21

పాట్నా: బిహార్ మాజీ సిఎం జితిన్‌రామ్ మాంఝీపై గయ జిల్లాలోని దుమారియా వద్ద దుండగులు ఆకస్మికంగా దాడి చేశారు. ఆయన కాన్వాయ్‌లో వెళుతున్న వాహనాలకు నిప్పు పెట్టారు. దుండగుల దాడి నుంచి మాంఝీ తప్పించుకున్నారు. మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ఎల్‌జెపి నేతల కుటుంబాలను పరామర్శించేందుకు మాంఝీ వెళుతుండగా ఈ దాడి జరిగింది. మావోయిస్టులు, దుండగుల దాడులతో ప్రస్తుతం దుమారియా వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.

05/26/2016 - 18:21

ముంబయి: దుబాయి నుంచి ఇక్కడికి వచ్చిన విమానంలో పోలీసులు సోదాలు చేయగా టాయిలెట్‌లో 3 కిలోల బంగారం బయట పడింది. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుల్లో ఎవరో ఈ బంగారాన్ని తెచ్చి టాయిలెట్‌లో వదిలేసి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. కస్టమ్స్ తనిఖీల్లో దొరికిపోతే కేసులు పెడతారన్న భయంతో ఇలా బంగారాన్ని వదిలేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

05/26/2016 - 18:21

నైనిటాల్: ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో గురువారం మధ్యాహ్నం జీపు బోల్తాపడి అయిదుగురు టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గోపేశ్వర్ గ్రామంలో విధులు ముగించుకుని వీరంతా తమతమ నివాసాలకు జీపులో బయలుదేరారు. వేగంగా వెళుతున్న జీపు ఒక్కసారిగా పక్కకు ఒరిగి బోల్తాపడింది. మృతుల్లో నలుగురు మహిళా టీచర్లు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు.

05/26/2016 - 18:20

చండీగఢ్: చండీగఢ్-హర్యానా రహదారిపై పిప్లీ వద్ద హర్యానాకు చెందిన బస్సులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. పేలుడుకు ముందు బస్సులో బ్యాటరీ లాంటి పరికరాన్ని చూశామని, బహుశా అది పేలి ఉంటుందని ప్రయాణికులు తెలిపారు.

05/26/2016 - 16:55

దిల్లీ: పర్యావరణాన్ని, మహిళల ఆరోగ్యాన్ని కాపాడాలన్న లక్ష్యంతో త్వరలో దేశ వ్యాప్తంగా 5 కోట్ల మందికి వంటగ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇస్తామని కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమార్ గురువారం తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా 8 కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు.

05/26/2016 - 16:53

లక్నో: యువకులకు సాయుధ శిక్షణ శిబిరాన్ని నిర్వహించిన బజరంగ్‌దళ్ నేత మహేష్ శర్మను ఫైజాబాద్ కోర్టులో గురువారం పోలీసులు హాజరుపరచగా వారం రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాగా, దేశరక్షణ కోసం యువతకు సాయుధ శిక్షణ ఇచ్చిన మహేష్‌పై పోలీసులు కేసు పెట్టడంపై విశ్వహిందూ పరిషత్ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

05/26/2016 - 15:02

చండీగఢ్: జాట్ కులస్థులతో పాటు మరో నాలుగు సామాజిక వర్గాలను బీసీ-సి జాబితాలో చేరుస్తూ హర్యానా ప్రభుత్వం జారీచేసిన రిజర్వేషన్ల చట్టంపై పంజాబ్-హర్యానా ఉమ్మడి హైకోర్టు గురువారం ‘స్టే’ మంజూరు చేసింది. ఈ ఏడాది మార్చి 29న హర్యానా అసెంబ్లీ ఆమోదించిన రిజర్వేషన్ల చట్టాన్ని సవాలు చేస్తూ భివానీకి చెందిన మురారీ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారించి ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

05/26/2016 - 15:02

గయ: బిహార్‌లోని గయ జిల్లాలో మావోయిస్టులు గురువారం నాడు ఇద్దరిని తుపాకులతో కాల్చి చంపారు. కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ బంధువులైన ఇద్దరు ఎల్‌జెపి నాయకులు దుమారియా గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగించుకుని వస్తుండగా మావోయిస్టులు విరుచుకుపడ్డారు. అతి సమీపం నుంచి ఆ ఇద్దరు నాయకులను మావోలు కాల్చి చంపి పరారయ్యారు.

05/26/2016 - 15:01

ముంబయి: థానే జిల్లాలోని డాంబివాలే ప్రాంతంలో గురువారం ఓ రసాయన పరిశ్రమలో బాయిలర్ పేలడంతో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా సుమారు 150 మంది కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఫ్యాక్టరీలో నుంచి భారీ శబ్దం వినిపించడంతో చుట్టుపక్కలవారు భయాందోళనలకు లోనై పరుగులు తీశారు.

Pages