S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/26/2016 - 15:00

పాట్నా: తన భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిని, ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీలను రాజ్యసభకు పంపాలని ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్ యాదవ్ యోచిస్తున్నట్లు సమాచారం. బిజెపి నేత సుబ్రహ్మణ్య స్వామిని కట్టడి చేయాలంటే రాజ్యసభలో రాం జెఠ్మలానీ లాంటివారు ఉండాలని లాలూ భావిస్తున్నారట.

05/26/2016 - 11:02

ఢిల్లీ: దేశవ్యాప్తంగా మెడికల్‌, డెంటల్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నీట్‌-2ను జూలై 24న నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ గురువారం ప్రారంభమవుతుంది. అభ్యర్థులు www.aipmt.nic.in వెబ్‌సైట్‌ ద్వారా తమ అప్లికేషన్‌ను పంపుకోవచ్చు.

05/26/2016 - 06:21

న్యూఢిల్లీ, మే 25: ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో బహిరంగ మూత్ర విసర్జన చేయడం, ఉమ్మి వేయడం లాంటివి చేస్తే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన పరిసరాలు ఉండేలా చూడడానికి ప్రభుత్వం స్వచ్ఛ్భారత్ మిషన్‌లో భాగంగా తాజాగా పాటించాల్సిన నిబంధనావళి (ఎస్‌ఓపి) ఒక దానిని జారీ చేసింది.

05/26/2016 - 06:19

తిరువనంతపురం, మే 25: సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు పినరయి విజయన్ బుధవారం కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మరో 18 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 19మందితో కూడిన మంత్రివర్గంలో ఇద్దరు మహిళలు సహా 13మంది కొత్తవారే. అయిదుగురు మాత్రమే గతంలో సిపిఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు.

05/26/2016 - 06:19

న్యూఢిల్లీ, మే 25: ‘జాతి మతాలకు సంబంధం లేని విశ్వపదం ఓం. ఉదాత్తమైన ఈ పదానికి యోగాలో ఎప్పుడూ చోటుంటుంది. కాకపోతే, అంతర్జాతీయ యోగా దినోత్సవాన నిర్వహించే యోగాసనాల్లో ఓం స్మరించాలన్న బలవంతం ఏమీ లేదు. లేదు. ఇష్టమైనవాళ్లు ఓం స్మరణ చేయొచ్చు. లేనివాళ్లు నచ్చిన మరే పదమైన స్మరించుకోవచ్చు. అది వాళ్లిష్టం’ అని ఆయుష్ మంత్రి శ్రీపాద నాయక్ స్పష్టం చేశారు.

05/26/2016 - 06:16

న్యూఢిల్లీ, మే 25: ఢిల్లీలోని పుల్ ప్రహ్లాద్‌పూర్ ప్రాంతంలో 13 ఏళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా అత్యాచారం జరిపి ఆ తర్వాత రైల్వే ట్రాక్ సమీపంలో పడేశారని పోలీసులు తెలిపారు. అనాథ అయిన ఆ బాలికను అఖిల భారత వైద్య శాస్త్రాల అధ్యయన సంస్థ (ఎయిమ్స్)లో చేర్చారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

05/26/2016 - 06:15

న్యూఢిల్లీ, మే 25: కేంద్ర ప్రభుత్వం తాజాగా రూపొందిస్తున్న బాల నేరస్థుల చట్టం (జువనైల్ జస్టిస్ యాక్ట్) 2015 ప్రకారం చట్టవిరుద్ధంగా 16 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు గల చిన్నారులకు చేతులు బేడీలు వేయడం కానీ జైల్లో లేదా పోలీసు స్టేషన్‌లోని లాకప్‌లో పెట్టడం కానీ చేయకూడదు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ బుధవారం ఈ చట్టానికి సంబంధించిన ముసాయిదా నిబంధనలను విడుదల చేశారు.

05/26/2016 - 01:26

న్యూఢిల్లీ, మే 25: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం తిరుపతిలో ఐఐటి ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే విజయనగరం- టిట్లాగర్ మూడో రైల్వే లైన్ నిర్మాణానికి కూడా అనుమతి మంజూరు చేసింది. ఈ లైన్ నిర్మాణాన్ని 2,335.68 కోట్ల ఖర్చుతో చేపడతారు. ప్రధాని అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో దేశవ్యాప్తంగా ఆరు కొత్త ఐఐటిల ఏర్పాటు చేసేందుకు అనుమతి మంజూరు చేసింది.

05/26/2016 - 01:15

న్యూఢిల్లీ, మే 25: భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి తమ శాసన సభ్యులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ‘బాండు పేపర్ హామీ పత్రం’ బాటపట్టింది. ‘కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి విధేయులుగా ఉంటాం. పార్టీ ఫిరాయింపులకు పాల్పడబోం’ అంటూ వంద రూపాయల బాండు పేపర్‌పై ఎమ్మెల్యేలతో హామీపత్రం రాయించుకున్నారు.

05/26/2016 - 00:59

న్యూఢిల్లీ, మే 25: దేశవ్యాప్తంగా బస్సుల్లో ప్రయాణించే మహిళల భద్రత కోసం ప్రభుత్వం అనేక కీలక చర్యలు చేపట్టబోతోంది. ఆత్యవసర ప్యానిక్ బటన్లు, సిసిటివి కెమేరాలు, జిపిఎస్ ఆధారిత ట్రాకింగ్ పరికరాలను ఇందులో భాగంగా అన్ని బస్సుల్లోనూ ఏర్పాటు చేయబోతోంది. ఇందుకు సంబంధించి జూన్ 2న నోటిఫికేషన్ జారీ చేయబోతున్నట్టు రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ బుధవారంనాడిక్కడ వెల్లడించారు.

Pages