S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/24/2016 - 02:34

సూళ్లూరుపేట, మే 23: రాకెట్ ప్రయోగాల్లో విప్లవం సృష్టించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేసిన స్పేస్ షటిల్ ప్రయోగం తొలి అడుగులోనే ఘన విజయం సాధించింది. రోదసీ పరిశోధనల్లో భారత తివర్ణపతాకం మరోసారి రెపరెపలాంది.

05/24/2016 - 02:22

న్యూఢిల్లీ, మే 23: రైళ్లలో వెయిటింగ్ లిస్టులో ఉండి బెర్త్‌లు ఖరారుకాని ప్రయాణికుల కోసం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన వికల్ప్ విధానం అమలులోకి వచ్చింది. బెర్తులు దక్కని ప్రయాణికుల కోసం సోమవారం నుంచి ప్రత్యామ్నయ రైళ్ల సదుపాయం కల్పిస్తున్నారు. ఐదు ప్రధాన రూట్లయిన హౌరా, ముంబయి, చెన్నై, బెంగళూరు, సికింద్రాబాద్‌లో తొలుత అమలు చేస్తున్నారు.

05/24/2016 - 02:21

న్యూఢిల్లీ, మే 23: బ్రెడ్ తింటున్నారా? అయితే మీకు కేన్సర్ ముప్పు తప్పదు. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సిఎస్‌ఇ) జరిపిన పరిశీలనలో భయంకరమైన వాస్తవాలు వెలుగుచూశాయి. ఏ రకమైన బ్రెడ్ అయినా సరే వాటిల్లో పొటాషియం బ్రోమేట్ లేదా ఐయోడెట్ అవశేషాలు ఉంటున్నట్టు సిఎస్‌ఇ హెచ్చరించింది. ఈ రసాయనాలు కేన్సర్ కారకాలని స్పష్టం చేసింది.

05/24/2016 - 01:25

చెన్నై, మే 23: పురచ్చితలైవి జయలలిత తానేంటో మరోసారి నిరూపించుకున్నారు. తమిళనాడులో మూడు దశాబ్దాల తరువాత వరుసగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన నేతగా రికార్డు సృష్టించిన జయలలిత సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఎన్నికల్లో తానిచ్చిన ప్రధానమైన అయిదు హామీలనూ నెరవేర్చారు.

05/24/2016 - 01:22

న్యూఢిల్లీ, మే 23: కాంగ్రెస్ పార్టీలో జూనియర్, సీనియర్ల నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు ప్రారంభమయ్యాయి. అసోం, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలుకావటంతో జూనియర్, సీనియర్ల మధ్య మాటల యుద్ధం బహిరంగమైంది. కాంగ్రెస్‌ను బతికించుకోవాలంటే యువతకు పెద్దపీట వేయాలంటూ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ చేసిన ప్రకటన జూనియర్ల తిరుగుబాటుకు మరింత ఊతాన్నిచ్చింది.

05/24/2016 - 01:20

కోల్‌కతా, మే 23: రెండేళ్ల క్రితం లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రజల్లో కొంత మేరకు పట్టును కోల్పోయిన బిజెపి ఇటీవల పశ్చిమ బెంగాల్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అక్కడి ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇచ్చి సత్తా చాటుకుంది. ముఖ్యంగా 70కి పైగా నియోజకవర్గాల్లో ప్రతిపక్ష లెఫ్ట్ ఫ్రంట్-కాంగ్రెస్ పొత్తును నీరుగార్చడంలో బిజెపి సఫలీకృతమైంది.

05/24/2016 - 01:18

జమ్ము, మే 23: జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సోమవారం ఉగ్రవాదులు ఒక పోలీసు పార్టీపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులు వీరమరణం పొందారు. జమ్మూకాశ్మీర్‌లో మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో పిడిపి-బిజెపి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వేర్పాటువాద గెరిల్లాలు పెద్దదాడికి తెగబడటం ఇదే మొదటిసారి. ఈ దాడికి తామే పాల్పడినట్లు కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ (హెచ్‌ఎం) ప్రకటించుకుంది.

05/24/2016 - 01:16

న్యూఢిల్లీ, మే 23: ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడవేస్తూ ఇండిగో సంస్థకు చెందిన ఒక విమానం ఇటీవల జైపూర్ ఎయిర్‌పోర్టు రన్‌వేకి సమాంతరంగా ఉన్న రోడ్డుకు అత్యంత సమీపంగా ఎగిరింది. ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో మేల్కొన్న డిజిసిఎ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అధికారులు ఆ విమానానికి చెందిన ఇద్దరు పైలెట్ల లైసెన్సులను రద్దు చేశారు.

05/24/2016 - 01:14

న్యూఢిల్లీ, మే 23: దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో సేకరించే నిధుల్లో 63 శాతం వరకూ నగదు రూపేణా వస్తున్నవేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఎడిఆర్) సంస్థ వెల్లడించింది. 2004-2015 మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 2,100 కోట్ల రూపాయలు నిధులు సమకూర్చుకున్నట్టు ఎడిఆర్ తెలిపింది. అందులో నగదు రూపేణ వచ్చిన నిధులే అధికమని వారు చెప్పారు.

05/24/2016 - 01:13

న్యూఢిల్లీ, మే 23: భారతీయ సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అంతర్జాతీయ చలన చిత్రోత్సవ పోటీలకు వెళ్లే సినిమాల కోసం ఓ నిధిని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఆస్కార్ అవార్డుకు పోటీపడే చిత్రానికి కోటి రూపాయలు, కేన్స్, వెనీస్ అవార్డులకు పోటీపడే చిత్రానికి 50 లక్షల రూపాయల ప్రోత్సాహకాలు ఇవ్వాలని మంత్రిత్వశాఖ తెలిపింది.

Pages