S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/23/2016 - 01:16

న్యూఢిల్లీ, మే 22: వైద్య, దంత వైద్య కోర్సుల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నీట్‌ను ఏడాది పాటు వాయిదా వేస్తూ ఆర్డినెన్స్ తీసుకు రావడానికి గల కారణాలను వివరించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రి జె.పి.నడ్డా సోమవారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ కానున్నారు.

05/23/2016 - 00:59

చండేల్, మే 22: మణిపూర్‌లో ఆదివారం ఉగ్రవాదులు మారణకాండ సృష్టించారు. చండేల్ జిల్లాలో 29వ అసోం రైఫిల్స్ సైన్యంపై మెరుపుదాడి చేసి జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ సహా అయిదుగురు జవాన్లను హతమార్చారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో హెంగ్షి ప్రాంతంలో అసోం రైఫిల్స్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. జవాన్ల దగ్గరున్న ఏకే రైఫిల్స్, ఒక ఇన్‌సాస్ రైఫిల్, ఒక ఎల్ ఎంజీ రైఫిల్‌ను తీసుకెళ్లారు.

05/22/2016 - 19:20

హైదరాబాద్:తెలుగుదేశం పార్టీ అధినేత, ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఫోన్ చేశారు. ఈనెల 24న అసోం ముఖ్యమంత్రిగా సోనోవాల్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు.

05/22/2016 - 19:19

ఇటానగర్:చండేల్ జిల్లాలో ఉగ్రవాదుల మెరుపుదాడిలో ఆరుగురు సైనికులు మరణించారు. వీరిలో ఒకరు జెసిఓ స్థాయి అధికారి. ఆదివారం సాయంత్రం హఠాత్తుగా ఉగ్రవాదులు తెగబడగా ఎదురుకాల్పులు జరిగాయి.

05/22/2016 - 16:18

న్యూదిల్లి:ఇరాన్‌తో సత్సంబంధాలు మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రెండు రోజుల పర్యటనకు ప్రధాని నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. ఆదివారం ఆయన ప్రత్యేక విమానంలో ఇరాన్ బయలుదేరి వెళ్లారు. చమురు దిగుమతులు, వాణిజ్యంసహా పలు అంశాలపై ఆయన చర్చిస్తారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కుదరనున్నాయి.

05/22/2016 - 05:38

కోటబొమ్మాళి, మే 21: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం రామచంద్రపురం(గోదావరిపేట) వద్ద శనివారం మధ్యాహ్నం తిరుచురాపల్లి-హౌరా సూపర్‌ఫాస్ట్ వీక్లీ రైలులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. రైలు చివరి జనరల్ బోగీలో చెలరేగిన ఈ మంటలను ఒక ప్రయాణికుడు వెంటనే గుర్తించి డోర్ వద్దకు వచ్చి చైన్ పుల్ చేయడంతో రైలు ఆగిపోయింది. వెంటనే ప్రయాణికులు విషయం గమనించి పరుగులు తీసారు.

05/22/2016 - 05:36

విశాఖపట్నం, మే 21: పశ్చిమ నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు ఒమన్‌లో అక్కడి నౌకాదళంతో విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. ఒమన్ రాయల్ నేవీతో కలిసి మస్కట్‌లో శనివారం నుంచి నిర్వహిస్తున్న విన్యాసాల్లో ఐఎన్‌ఎస్ ఢిల్లీ, ఐఎన్‌ఎస్ తారకేష్, ఐఎన్‌ఎస్ దీపక్ నౌకలు పాల్గొంటున్నాయి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఒమన్‌లో పర్యటించనున్న సందర్భంగా ఈ విన్యాసాలు చేపట్టడం గమనార్హం.

05/22/2016 - 05:11

భారత పర్యటనలో ఉన్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్ శనివారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. భారత్‌లో యాపిల్ ఉత్పత్తులను తయారు చేసేందుకు కుక్ ఆసక్తి కనపరిచారు.
ఈ సందర్భంగా ‘నరేంద్రమోదీ మొబైల్ యాప్’ను మోదీ-కుక్ ఆవిష్కరించారు.

05/22/2016 - 04:45

న్యూఢిల్లీ, మే 21: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో బిజెపిని విస్తరించేందుకు పటిష్ట వ్యూహంతో ముందుకెళ్తామని బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ ప్రకటించారు. అసోంలో పార్టీకి అఖండ విజయం సాధించిపెట్టిన రామ్‌మాధవ్ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేస్తామని, 2019 ఎన్నికల్లో మరిన్ని లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించేలా పార్టీని సిద్ధం చేస్తామని చెప్పారు.

05/22/2016 - 05:16

శ్రీనగర్, మే 21: ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో శనివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో అయిదుగురు ఉగ్రవాదులు హతమైనట్లు సైనికాధికారులు తెలిపారు. ఇద్దరు జవాన్లు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. శ్రీనగర్‌కు 81కిలోమీటర్ల దూరంలోని కుప్వారా జిల్లాలోని ద్రుగ్‌ముల్లా గ్రామంలో మిలిటెంట్ల ఉనికిని పసిగట్టిన సైనిక బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి అదుపులోకి తీసుకోవటానికి ప్రయత్నించారు.

Pages