S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/18/2016 - 15:05

దిల్లీ: ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు పాల్పడుతున్నారంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా మహారాష్ట్ర రాష్ట్రాలకు బుధవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారంటూ రేలా అనే స్వచ్ఛంద సంస్థ, వరలక్ష్మి ఎన్జీటీ పిటిషన్‌ దాఖలు చేశారు.

05/18/2016 - 13:51

పనాజీ: బాలికపై అత్యాచారం చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న గోవా ఎమ్మెల్యే బాబుష్ మోన్సరేట్‌కు ఇక్కడి చిల్డ్రన్స్ కోర్టులో అదనపు సెషన్స్ జడ్జి బుధవారం బెయిల్ మంజూరు చేశారు. నిందితుడు గత 12 రోజులుగా పోలీసు కస్టడీలో ఉన్నారు. తనను 50 లక్షలు ఇచ్చి ఎమ్మెల్యే కొనుక్కున్నారని, ఆ తర్వాత పలుసార్లు అత్యాచారం చేశాడని బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

05/18/2016 - 12:13

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్‌లో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన వైష్ణోదేవి ఆలయం సమీపంలోని అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం మంటలు వ్యాపించాయి. త్రికుల హిల్స్ ఫారెస్టు ఏరియాలో భారీఎత్తున మంటలు ఎగసిపడడంతో సిఆర్‌పిఎఫ్ సిబ్బంది రంగప్రవేశం చేశారు. మంటలను అదుపు చేసేందుకు చర్యలు ప్రారంభించారు. ఆలయం వద్ద ఉన్న యాత్రీకులను హెలికాప్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

05/18/2016 - 12:13

చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రతరమై రాబోయే 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బుధవారం ఉదయం సమయానికి వాయుగుండం చెన్నైకి తూర్పుదిశగా 70 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ వాయుగుండం చెన్నై నుంచి ఉత్తర దిశగా కోస్తాంధ్ర వైపు పయనిస్తోంది. ఈదురుగాలులతో వర్షం కురియడంతో చెన్నైలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ సంఖ్యలో చెట్లు విరిగిపోయాయి.

05/18/2016 - 07:29

న్యూఢిల్లీ, మే 17: ఫిబ్రవరి 9వ తేదీన ప్రతిష్ఠాత్మకమైన జవహర్‌లాల్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం నాయకులు కన్హయ్యకుమార్ బృందం దేశ ద్రోహ నినాదాలు చేసిన మాట వాస్తవమేనని స్పష్టమైంది.

05/18/2016 - 07:02

న్యూఢిల్లీ,మే 17: వెట్టిచాకిరీ నుంచి విముక్తి కలిగించేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వెట్టిచాకిరీ నిర్మూలన పథకం వచ్చి 40 ఏళ్లు అయినా దాన్ని నిర్మూలించలేక పోయామన్నారు. గడచిన 38ఏళ్లలో 18 రాష్ట్రాలలో 172 జిల్లాలలో 2లక్షల 82వేల మందిని విముక్తి కల్గించామన్నారు.

05/18/2016 - 07:01

న్యూఢిల్లీ, మే 17: అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఓం సహా కొన్ని వేద మంత్రోచ్చారణ ఐచ్ఛికమే తప్ప తప్పనిసరి కాదని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ మంగళవారం స్పష్టం చేసింది. వచ్చే నెల 21న జరిగే యోగా దినోత్సవం రోజున ఓం సహా ఇతర వేద మంత్రోచ్ఛరణ జరగాలంటూ కేంద్ర ప్రభుత్వం సర్కులర్ జారీ చేయడంపై వివాదం తలెత్తిన నేపథ్యంలో ఈ వివరణ వెలువడింది.

05/18/2016 - 06:44

న్యూఢిల్లీ, మే 17: నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అనేక పథకాలు ప్రవేశపెట్టనప్పటికీ జన్‌ధన్, స్వచ్ఛ్భారత్ లాంటి కొన్ని పథకాలు మాత్రమే ప్రజల దృష్టిని ఆకర్షించగా, మిగతా పథకాలేవీ వారి దృష్టిలో పడనే లేదని సిఎంఎస్ సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. 2014 మేలో మోదీ అధికారం చేపట్టినప్పటినుంచి దాదాపు 40 పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది.

05/18/2016 - 06:42

గయ, మే 17: బిహార్‌లో జెడియు సస్పెండ్ ఎమ్మెల్సీ మనోరమ దేవి మంగళవారం ఎట్టకేలకు లొంగిపోయారు. మద్య నిషేధ చట్టం ఉల్లంఘించారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న మనోరమను 14 రోజుల జుడీషియల్ కస్టడికి పంపుతూ గయ జిల్లా కోర్టు ఆదేశాలిచ్చింది. తన కారును ఓవర్‌టేక్ చేశాడన్న ఆగ్రహంతో ఓ యువకుడిని ఎమ్మెల్సీ కొడుకు రాకీ యాదవ్ కాల్చి చంపేశాడు. రాకీకోసం ఎమ్మెల్సీ ఇంట్లో పోలీసులు గాలించగా విదేశీ మద్యం బాటిళ్లు లభించాయి.

05/18/2016 - 06:41

ఇండోర్/అహ్మదాబాద్, మే 17: గుజరాత్ ముఖ్యమంత్రిగా వేరొకర్ని నియమించేందుకు బిజెపి కసరత్తు చేస్తోదంటూ వస్తున్న వార్తలను ముఖ్యమంత్రి ఆనందిబెన్ కొట్టిపారేశారు. అలాంటిదేమీ లేదనీ, ఈ పుకార్లన్నీ ఊహాగానాలేనని ఆమె స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు విచ్చేసిన సందర్భంగా విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆనందిబెన్ పైవిధంగా స్పందించారు.

Pages