S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/01/2016 - 06:24

తిరువనంతపురం, ఏప్రిల్ 30: అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ కుంభకోణంపై అధికార బిజెపి కాంగ్రెస్ పార్టీపై దాడిని మరింత తీవ్రం చేసింది. యుపిఏ హయాంలో ఆ కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారని, అయితే ఎన్డీఏ దాన్ని ఎత్తివేసిందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదన ‘ఊహాజనితమైన కట్టుకథ’ అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.

05/01/2016 - 06:20

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: పార్లమెంటులో, శాసన సభల్లో చట్టాలను చేసే ప్రజాప్రతినిధులు కొత్త చట్టాలను చేసేటప్పుడు ఎలాంటి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారో వాటి అమలుకు అవసరమైన వౌలిక సదుపాయాలను కల్పించడానికి కూడా అదే ఉత్సాహాన్ని ప్రదర్శించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సూచించారు.

05/01/2016 - 06:16

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఫ్లాట్ కొనుగోలుదారులు ఎనిమిదేళ్లుగా ఎదురు చూస్తున్న రియల్ ఎస్టేట్ చట్టం ఆదివారం నుంచి అమలులోకి వస్తోంది. కార్యాచరణ నియమాలు, నియంత్రణ అధికార వ్యవస్థ (రెగ్యులేటరీ అథారిటీ) ఏర్పాటు, పునర్వివిచారణ న్యాయ స్థానాలు (అప్పెల్లెట్ ట్రిబ్యునల్స్) పని మే 1నుంచి ప్రారంభం అవుతాయని కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ శనివారం ప్రకటించింది.

05/01/2016 - 06:15

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: ఇక ప్రభుత్వోద్యోగాల కోసం ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పని లేదు. అధికారులను కలిసి అభ్యర్థించాల్సిన అవసరం లేదు. పోలీసు వెరిఫికేషన్ కోసం ఇక లంచాలు ఇవ్వాల్సిన అక్కర లేదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ కేటగిరీల ఉద్యోగాలు ఇక ఆన్‌లైన్ ద్వారానే భర్తీ కానున్నాయి.

05/01/2016 - 06:13

బళ్లారి, ఏప్రిల్ 30: కర్నాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థినులు సహా తొమ్మిది మంది మృతిచెందారు. చెళ్లకెర తాలూకాలో జాతీయ రహదారిపై క్రూయిజర్ వాహనాన్ని కర్నాటక ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో క్రూయిజర్ డ్రైవర్ సహా బళ్లారికి చెందిన ఎనిమంది విద్యార్థినులు మృతి చెందారు.

05/01/2016 - 04:16

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆదివారం నేషనల్ ఎలిజబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) దేశవ్యాప్తంగా 52 నగరాల్లో జరగనుంది. ‘నీట్’ పరీక్షకు సంబంధించి ఇంతకుముందు ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ దాఖలయిన ఒక పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు శనివారం నిరాకరించడంతో ఆదివారం నాటి నీట్ పరీక్షకు మార్గం సుగమమైంది.

04/30/2016 - 18:10

దిల్లీ: ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన, దేశంలో కరవుపరిస్థితులు, కుంభకోణాల పేరిట తప్పుడు ఆరోపణలు తదితర విషయాలపై నిరసన గళం వినిపించేందుకు మే 6న దిల్లీలో భారీ ఆందోళన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు భవనం వరకూ జరిగే ర్యాలీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ పాల్గొంటారు.

04/30/2016 - 15:27

కోల్‌కత: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శనివారం 5వ విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఒకటి, రెండు చోట్ల స్వల్ప సంఘటనలు మినహా ఎక్కడా మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. 53 నియోజకవర్గాల్లో అయిదో విడత పోలింగ్‌కు 14,500 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

04/30/2016 - 15:26

ముంబయి: పలు బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయల మేరకు బకాయిపడిన విజయ్ మాల్యాకు చెందిన ‘కింగ్‌ఫిషర్’ ట్రేడ్‌మార్కులు, బ్రాండ్‌లను వేలంలో కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. ఎస్‌బిఐ ఆధ్వర్యంలో 17 మంది రుణదాతలు శనివారం ఉదయం 11-30 గంటలకు ఆన్‌లైన్‌లో ఈ వేలం పాట ప్రారంభించారు. కింగ్‌ఫిషర్ బ్రాండ్‌లు, ట్రేడ్‌మార్కులకు 366.70 కోట్ల రూపాయలతో బిడ్డింగ్ ప్రారంభమైంది.

04/30/2016 - 14:08

ముంబయి: అభిమానిపై తన బాడీగార్డు చేయి చేసుకున్నందుకు బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ ట్విట్టర్‌లో క్షమాపణ చెప్పాడు. ఇకముందు తన అభిమానులకు ఇలాంటి చేదు అనుభవాలు ఉండవని ఆయన హామీ ఇచ్చాడు. కొద్దిరోజుల క్రితం ముంబయి విమానాశ్రయానికి అక్షయ్ వచ్చినపుడు ఆయన అభిమాని ఒకరు సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించాడు. ఆ క్రమంలో అభిమానిని పక్కకు లాగేసి అక్షయ్ బాడీగార్డు కాస్త చేయి చేసుకున్నాడు.

Pages