S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/30/2016 - 06:43

కోల్‌కతా, ఏప్రిల్ 29: పశ్చిమబెంగాల్‌లో శనివారం అయి దో దశ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ జరుగనున్న 53 నియోజకవర్గాలలో సుమారు 90వేల మంది కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలను మోహరించనున్నారు. నేరశిక్షాస్మృతిలోని సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు అమలు చేయనున్నారు.

04/30/2016 - 06:35

ముంబయి, ఏప్రిల్ 29: మహారాష్టల్రోని ఆదర్శ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కేసులో శుక్రవారం బాంబే హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. 31 అంతస్తుల భవనాన్ని కూల్చేయాలని కేంద్ర పర్యావరణ శాఖను న్యాయస్థానం ఆదేశించింది. దక్షిణ ముంబయిలోని కొలాబా ప్రాంతంలో కార్గిల్ యుద్ధంలో మరణించిన సైనికుల కోసం ఆదర్శ హౌసింగ్ సొసైటీలో ఆరు అంతస్తుల భవనాన్ని నిర్మించారు.

04/30/2016 - 03:26

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29:ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థికంగా, హార్థికంగా కేంద్రం ఆదుకుంటున్నందున ప్రత్యేక హోదా అవసరం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరీభాయి చౌదరి తేల్చి చెప్పారు.

04/30/2016 - 02:35

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ స్థాయి అర్హతా పరీక్ష (నీట్) నిర్వహణపై ఇచ్చిన తీర్పును పునస్సమీక్షించాలంటూ కేంద్రం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది.

04/30/2016 - 02:34

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: బొగ్గు క్షేత్రాల కేటాయింపు కుంభకోణానికి సంబంధించిన ఒక కేసులో పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రి దాసరి నారాయణరావు, మరో 13 మందిపై నేరపూరిత కుట్ర, మోసం, ఇతర నేరాలకుగాను అభియోగాలను నమోదు చేయాలని సిబిఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం ఆదేశించింది.

04/30/2016 - 02:31

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపిఎఫ్‌ఓ) వడ్డీ రేటును కేంద్రం .1 శాతం పెంచింది. వడ్డీ రేటును 8.7 శాతం నుంచి 8.8 శాతానికి పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు.

04/29/2016 - 18:17

చెన్నై: కాంచీపురంలో శంకరమఠం ఆడిటర్ రాధాకృష్ణన్‌పై దాడికి సంబంధించిన కేసులో కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతితో పాటు మరో ఎనిమిది మందిని నిర్దోషులుగా పేర్కొంటూ చెన్నైలోని సెషన్స్ కోర్టు శుక్రవారం తీర్పును ప్రకటించింది. 2002 సెప్టెంబర్ 20న ఆడిటర్ రాధాకృష్ణన్, ఆయన భార్య జయశ్రీ, సహాయకుడు కృష్ణన్‌పై ఆగంతకులు దాడి చేశారు.

04/29/2016 - 18:16

కొట్టాయం: సీనియర్ కాంగ్రెస్ నేత, కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ పుత్తుపల్లి నియోజకవర్గం నుంచి 11వ సారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఆయన పుత్తుపల్లి నుంచి ఇప్పటికి పదిసార్లు గెలిచారు. ఈసారి కూడా అదే స్థానం నుంచి బరిలోకి దిగారు. నామినేషన్ వేసే ముందు ఆయన స్థానిక చర్చిలో ప్రార్థనలు చేసి, తల్లిదండ్రుల సమాధుల వద్ద నివాళులర్పించారు.

04/29/2016 - 18:14

దిల్లీ: ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం సూచించలేదని, రెవెన్యూలోటును భర్తీ చేయాలని చెప్పినందున ఆంధ్రప్రదేశ్‌కు ఇక ప్రత్యేకహోదా అవసరం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హెచ్‌పి చౌదరి శుక్రవారం ఇక్కడ మీడియా సమావేశంలో తేల్చిచెప్పారు. ఎపికి పన్ను రాయితీలు, ప్రత్యేక కేటాయింపులు ఇస్తున్నామన్నారు.

04/29/2016 - 17:06

దిల్లీ: విభజన చట్టంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ఎపికి నిధుల్ని కేటాయిస్తున్నట్లు కేంద్రమంత్రి హెచ్‌పి చౌదరి శుక్రవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. గత రెండేళ్లలో ఎపి రాజధాని అమరావతి నిర్మాణానికి 2,050 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు 750 కోట్లు ఇచ్చామన్నారు. ఎపిలో మూడు ఎయిర్‌పోర్టుల విస్తరణకు చురుగ్గా భూసేకరణ జరుగుతోందన్నారు.

Pages