S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/29/2016 - 05:40

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని తెలుగుదేశం సభ్యుడు అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శ్రీనివాస్ గురువారం లోక్‌సభలో 377 నిబంధన కింద మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే రైల్వే జోన్ ఎంతో అవసరమని చెప్పారు.

04/29/2016 - 05:23

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: అగస్టా వెస్ట్‌ల్యాండ్ స్కాంలో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సోనియాకు సంబంధించి మరో బాంబు పేల్చారు. ‘వీవీఐపి చాపర్ కేసులో ముడుపులు తీసుకున్న సోనియాగాంధీ, ఆ డబ్బును జెనీవాలోని సరాసిన్ బ్యాంకులో దాచి ఉంచార’ని స్వామి గురువారం ఆరోపణ చేశారు. ‘సోనియా ముడుపులు తీసుకున్న మాట వాస్తవం.

04/29/2016 - 05:22

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: వివిఐపి హె లికాప్టర్ల కుంభకోణంలో ప్రధానమైన అంశం అవినీతేనని పేర్కొంటూ ఇందులో అవినీతికి, అక్రమాలకు పాల్పడిన వారినెవరినీ వదలిపెట్టబోమని, న్యాయస్థానం ముందు నిలబెడతామని రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ హెలికాప్టర్ల తయారీ సంస్థ అగస్టా వెస్ట్‌లాండ్‌ను యుపిఏ ప్రభుత్వం బ్లాక్‌లిస్టులో పెట్టిందని కాంగ్రెస్ చేసిన వాదనను తోసిపుచ్చింది.

04/29/2016 - 04:50

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: చేనేత కార్మికులను మహత్మా గాంధీ జాతీయ ఉపాధి కల్పనా హామీ పథకం పరిధిలోకి తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ లోక్‌సభ సభ్యుడు నిమ్మల కిష్టప్ప ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. కిష్టప్ప గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తెచ్చారు.

04/29/2016 - 05:25

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: బిజెపి సభ్యు డు డాక్టర్ సుబ్రమణ్య స్వామి మూ లంగా గురువారం రాజ్యసభ జీరో అవర్‌లో పెద్దఎత్తున గొడవ జరిగి, సభాకాలం అరగంట వృధా అయింది. కాంగ్రెస్ సభ్యులకు భారత రాజ్యాం గం కంటే ఇటలీ రాజ్యాంగం గురించి బాగా తెలుసంటూ స్వామి చేసిన వ్యాఖ్య రాజ్యసభలో గందరగోళం సృష్టించింది. స్వామి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదని డిప్యూటీ చైర్మన్ పి.

04/29/2016 - 04:48

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: నావిగేషన్ ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి ప్రయోగం ఇస్రో శాస్తవ్రేత్తలు సాధించిన ఘనమైన విజయమని, 125 కోట్ల దేశ ప్రజలకు వారు అందించిన అమూల్యమైన కానుక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కొత్త వ్యవస్థకు ‘నావిక్’ అని పేరుపెట్టిన ఆయన ‘నావిక్’ పూర్తి పేరును ‘నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెల్లేషన్’ అని వివరించారు.

04/29/2016 - 04:20

బిష్ణుపూర్ (పశ్చిమ బెంగాల్), ఏప్రిల్ 28: ప్రముఖులు ప్రయాణించడం కోసం అగస్టావెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో రూ. 3,600 కోట్లకు పైగా ముడుపులు ఎవరు తీసుకున్నారో వారి పేర్లు బైటికి వచ్చి తీరాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ‘కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై తీవ్రమైన ఆరోపణలు చేయడం జరుగుతోంది.

04/29/2016 - 04:13

చెన్నై, ఏప్రిల్ 28: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేపై అన్నా డి ఎంకే చీఫ్ జయలలిత తీవ్ర విమర్శలు చేశారు. తమ పోరాటం తమిళనాడును కబళించి తమ కుటుంబపాలన చేయాలని చూస్తున్న డీఎంకే నుంచి కాపాడాలన్నదేనని జయ అన్నారు. తమ పార్టీలో మాత్రమే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని, పేదలు, సామాన్య ప్రజలతో అధికారాన్ని పంచుకుంటామని జయలలిత పేర్కొన్నారు. ‘కుటుంబ పాలన ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం.

04/29/2016 - 05:31

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఉద్యోగుల భవిష్య నిధి (ఈపిఎఫ్) వడ్డీ రేటు 8.8 శాతం నుంచి 8.7 శాతానికి కేంద్రం తగ్గించినందుకు నిరసనగా ఈ నెల 29న దేశ వ్యాప్త ఆందోళనలు చేపట్టాలని ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి.సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. ఈపిఎఫ్‌ఓ సెంట్రల్ ట్రస్టు బోర్డు నిర్ణయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వడ్డీ రేటు తగ్గించడం దారుణమని అన్నారు.

04/29/2016 - 02:59

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గంలోని పలనాడు, వినుకొండ, మాచెర్ల, గురజాల తదితర ప్రాంతాలలోని ఆరు లక్షల మంది ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేయాలని తెలుగుదేశం లోక్‌సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. రాయపాటి సాంబశివరావు గురువారం ఉదయం పార్లమెంటు ఆవరణలో ప్రధాన మంత్రిని కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేశారు.

Pages