S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/29/2016 - 02:58

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: పార్టీ ఫిరాయింపులకు ఊతమిస్తున్న రెండు రాష్ట్రాల శాసనసభల సీట్ల సంఖ్యను పెంచే సవరణ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వదని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ ప్రకటించారు.

04/29/2016 - 02:39

నెల్లూరు/ సూళ్లూరుపేట, ఏప్రిల్ 28: మనకు సొంత దిక్సూచి వచ్చేసింది. మొత్తం ఏడు ఉపగ్రహాల ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ సిరీస్ ప్రయోగ విజయంతో భారత్ మరో అరుదైన ఘనతను సాధించింది. ఇస్రో గురువారం సాధించిన తలమానికమైన విజయం భారత్‌కు సొంత జిపిఎస్ వ్యవస్థ చేకూరేలా చేసింది.

04/29/2016 - 02:36

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో ప్రవేశానికి 2016-17 విద్యా సంవత్సరానికి ఒకే ఉమ్మడి ఎంట్రన్స్ పరీక్ష ‘నీట్’ను రెండు దశలుగా నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. దాదాపు ఆరున్నర లక్షల మంది అభ్యర్థులు నీట్ పరీక్షకు హాజరు అవుతారని భావిస్తున్నారు.

04/28/2016 - 17:56

దిల్లీ: దేశవ్యాప్తంగా ఎంబిబిఎస్, మెడికల్ పీజీ, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు అన్ని రాష్ట్రాల్లోనూ ‘నీట్’ (నేషనల్ ఎలిజిబిలటీ ఎంట్రన్స్ టెస్ట్) నిర్వహించాలని సుప్రీం కోర్టు గురువారం ఆదేశించింది. 2016-17 సంవత్సరానికి సంబంధించి ‘నీట్’ నిర్వహించి తీరాలని. తమ ఆదేశాల్ని అన్ని రాష్ట్రాలూ అమలు చెయ్యాల్సిందేనని స్పష్టం చేసింది.

04/28/2016 - 17:52

దిల్లీ: అగస్టా-వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో ఎవరెవరికి ముడుపులు అందాయన్న విషయమై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇకనైనా నోరు విప్పాలని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా డిమాండ్ చేశారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, కుంభకోణానికి సంబంధించి ఇటలీ జైలులో ఎవరెవరున్నారు? ఎంత మేరకు అవినీతి జరిగింది? ఎవరెవరికి ఎంతెంత ముడుపులు అందాయో సోనియా చెప్పాలన్నారు.

04/28/2016 - 16:55

దిల్లీ: భగత్‌సింగ్, చంద్రశేఖర్ అజాద్, సూర్యసేన్ వంటి స్వాతంత్య్ర సమరయోధులను ‘రివల్యూషనరీ టెర్రరిస్టుల’ని ఓ పాఠ్యాంశంలో పేర్కొన్నందుకు దిల్లీ విశ్వవిద్యాలయాన్ని కేంద్ర మానవ వనరులు మంత్రిత్వ శాఖ (హెచ్‌ఆర్‌డి) తీవ్రంగా మందలించింది. ప్రముఖ దేశభక్తులైన వీరిని ‘టెర్రరిస్టుల’ని సంబోధిస్తే ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని హెచ్‌ఆర్‌డి పేర్కొంది.

04/28/2016 - 16:52

దిల్లీ: పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, ఆ అధికారం ఎన్నికల సంఘానికి ఉండాలని వైకాపా అధినేత జగన్ గురువారం ఇక్కడ మీడియాతో అన్నారు. ఎపిలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టిడిపిలో చేరిన విపక్ష ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి గెలిపించుకోవాలని ఆయన సిఎం చంద్రబాబుకు సవాల్ చేశారు. ఉపఎన్నికల్లో ఓడిపోతామన్న భయం బాబును వెంటాడుతోందన్నారు.

04/28/2016 - 16:51

దిల్లీ: అగస్టా-వెస్ట్‌ల్యాండ్ వివిఐపి హెలికాప్టర్ల కొనుగోలులో భారీగా ముడుపులు అందుకున్నట్లు ఆరోపణలు వచ్చినందున కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఓ న్యాయవాది గురువారం నాడు ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశారు.

04/28/2016 - 16:49

దిల్లీ: ఎపిలో ఎమ్మెల్యేల ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయాలంటూ వైకాపా అధినేత జగన్ గురువారం ఇక్కడ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలను అసెంబ్లీకి అనర్హులుగా ప్రకటించాలన్నారు. పార్టీని వీడివెళ్లేవారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలన్నారు. కాగా, గురువారం ఉదయం అరకు, శ్రీశైలం ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్పడంతో టిడిపిలో చేరిన శాసనసభ్యుల సంఖ్య 16కు చేరింది.

04/28/2016 - 14:06

పాట్నా: ప్రస్తుత వేసవిలో బీహార్‌లోని పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు నిత్యకృత్యం కావడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఎవరూ హోమాలు, యాగాలు చేయరాదని ఆయన ఆదేశించారు. ఈ ఆదేశాలను తక్షణం అమలు చేయాలని అధికారులకు నితీష్ సూచించారు.

Pages