S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/27/2016 - 15:39

దిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంపై బుధవారం రాజ్యసభలో బిజెపి, కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఈ కుంభకోణంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రమేయం ఉందంటూ బిజెపి సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించడంతో కాంగ్రెస్ సభ్యులు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ వెల్‌లోకి దూసుకుపోయారు.

04/27/2016 - 15:39

దిల్లీ: ‘సేవ్ డమొక్రసీ’ పేరుతో దిల్లీలో మకాం వేసిన వైకాపా అధ్యక్షుడు జగన్ బుధవారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. చంద్రబాబు అవినీతి గురించి రాసిన పుస్తకాన్ని ఆయనకు అందజేశారు. ఎపిలో బాబు అక్రమాల గురించి విచారణ జరిపించాలని జైట్లీకి విజ్ఞప్తి చేసినట్లు మీడియాకు జగన్ తెలిపారు. ఎపికి ప్రత్యేక హోదా, రైల్వే డివిజన్, తగినన్ని నిధులు ఇవ్వాలని కూడా ఆయన కోరారు.

04/27/2016 - 15:38

దిల్లీ: తీవ్ర నీటికొరత ఏర్పడినందున మే 1 తర్వాత మహారాష్టల్రో ఐపిఎల్ మ్యాచ్‌లు నిర్వహించరాదని సుప్రీం కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. ఈ విషయంలో ఇదివరకే బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్ధించింది. హైకోర్టు తీర్పును నిలిపివేయాలని కోరుతూ మహారాష్ట్ర క్రికెట్ సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.

04/27/2016 - 06:47

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: సినిమాలకు కత్తెర వేసే కంటే వాటిని పెద్దలు, పిల్లల సినిమాలుగా వర్గీకరించాలని శ్యాం బెనెగల్ కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. కొత్త తరహాలో సినిమాల వర్గీకరణ విధానాన్ని అమలులోకి తేవాలని తెలిపింది. ఇందులో భాగంగా మొత్తం నాలుగు విభాగాలుగా సినిమాలు విభజించింది. వీటిలో మొదటిది వన్ ప్లస్ 12కాగా రెండోది వన్ ప్లస్ 15 ఉండాలని స్పష్టం చేసింది.

04/27/2016 - 06:30

న్యూఢిల్లీ,ఏప్రిల్ 26: తెలంగాణకు అదనపు పశుగ్రాసం పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ తెలిపారు.గ్ మంగళవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో దేశంలో నెలకొన్న కరువుకు సంబంధించిన ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఈ విషయం చెప్పారు.

04/27/2016 - 06:19

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: అగస్టావెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలుకు 2010లో భారత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో అవినీతి జరిగిందని స్పష్టంగా కనిపిస్తోందని, భారత వైమానిక దళం మాజీ చీఫ్ ఎస్‌పి త్యాగికి ఈ కుంభకోణంతో సంబం ధం ఉందని ఇటలీకి చెందిన మిలన్ కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీస్ తన 225 పేజిల తీర్పులో పేర్కొంది.

04/27/2016 - 05:41

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: ఉత్తరాఖండ్ వ్యవహారంలో రాజ్యసభను అడ్డుకుంటున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ దూకుడుకు కళ్లెం వేసేందుకు అధికార బిజెపి పదునైన ఆయుధాలను సిద్ధం చేస్తోంది.

04/27/2016 - 05:41

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: మధ్య ఢిల్లీలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్నిప్రమాదంలో నేచురల్ మ్యూ జియం ఆఫ్ హిస్టరీ పూర్తిగా కాలి బూడిదై పోయింది. తెల్లవారుజామున ఒంటిగంటా నలభై అయిదు నిమిషాల ప్రాంతంలో కన్నాట్‌ప్లేస్ సమీపంలోని మండీ హౌస్ వద్ద ఉన్న అరంతస్థుల ఫిక్కీ కాంప్లెక్స్ భవనం పై అంతస్తులో ఉన్న మ్యూజియంలో తొలుత మంటలు ప్రారంభమైనాయి. ఆవెంటనే మిగతా అవి అంతస్తులకు మంటలు వ్యాపించాయి.

04/27/2016 - 05:39

ముంబయి, ఏప్రిల్ 26: ముంబయిలోని జవేరీబజార్ పేలుళ్ల కేసులో నిందితుడు జైనుల్ అబేదిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన అబేదిన్‌ను ముంబయి విమానాశ్రయంలో మంగళవారం అరెస్టు చేశారు. జవేరీబజార్ పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న అబేదిన్ తప్పించుకు తిరుగుతున్నాడు.

04/27/2016 - 05:38

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: ఎన్ని కమిటీలు వేసినా, దర్యాప్తులు జరిపించినా నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై నెలకొన్న మిస్టరీ తొలగిపోలేదు. ఈ నేపథ్యంలో నేతాజీకి సంబంధించి తన వద్ద ఉన్న పత్రాల్లో కొన్నింటిని జపాన్ విడుదల చేయనుంది. నేతాజీకి చెందిన వందలాది రహస్య పత్రాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం విడుదల చేసిన కొద్ది నెలల తర్వాత జపాన్ కూడా తన వద్దనున్న కొన్ని పత్రాలను విడుదల చేయనుండడం గమనార్హం.

Pages