S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/02/2020 - 02:30

న్యూఢిల్లీ, మార్చి 1: అల్లర్లతో అట్టుడికిన ఈశాన్య ఢిల్లీ క్రమంగా తేరుకుంటోంది. అలాగని.. ఉద్రిక్త పరిస్థితులు పూర్తిగా సడలినట్లు చెప్పలేని విధంగా పరిస్థితులు ఉన్నాయి. అయితే, గత మూడు రోజులుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు.

03/02/2020 - 02:22

న్యూఢిల్లీ, మార్చి 1: సమగ్ర పరిపాలనా సంస్కరణల కోసం శాశ్వత స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి, పార్టీ పార్లమెంటు సభ్యుడు మనీష్ తివారి సూచించారు. సమగ్ర సంస్కరణలు చేపట్టేందుకు సమయం ఆసన్నమైందన్నారు. ఈ మేరకు మనీష్ తివారి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. సమగ్ర పరిపాలనా సంస్కరణల కోసం పార్లమెంటు స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన ఆ లేఖలో కోరారు.

03/02/2020 - 02:21

న్యూఢిల్లీ, మార్చి 1: ఢిల్లీలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో మరోసారి బోర్డు పరీక్షలు వాయిదా వేస్తే విద్యార్థులు నష్టపోతారని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఇ) అధికారులు తెలిపారు. ముఖ్యంగా వృత్తి విద్యా కోర్సులకు వెళ్ళేందుకు అవకాశాలు దెబ్బ తింటాయని వారు తెలిపారు.

03/02/2020 - 02:09

న్యూఢిల్లీ, మార్చి 1: సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు అధికార, విపక్ష పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ మత కలహాలు సహా అనేక అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు అస్తశ్రస్త్రాలతో సిద్ధమవుతున్నాయి.

03/02/2020 - 02:02

రాంచీ, మార్చి 1: అంతర్జాతీయ మార్కెట్లో దేశీయ కళలు, చేతివృత్తులకు తగిన గుర్తింపు వచ్చేలా కేంద్రంలోని తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఆదివారంనాడు ఇక్కడ తెలిపారు. ఇక్కడి హర్మో మైదానంల హూనార్ హాట్ ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఆయన ‘ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్‌లో దేశీయ ఉత్పత్తులకు, కళాకారుల నైపుణ్యాన్ని గుర్తించేందుకు ఏర్పాటు చేశాం.

03/02/2020 - 01:53

పాట్నా, మార్చి 1: బిహార్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఆఖరున జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలు 200లకు పైగా సీట్లలో విజయం సాధిస్తాయని జనతాదళ్(యు) అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ధీమాగా చెప్పారు. బిహార్‌లో ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలు ఐక్యంగా ఉన్నాయని ఆయన చీలిక ఊహగానాలకు తెర దించారు.

03/02/2020 - 01:48

కోల్‌కతా, మార్చి 1: మమతా బెనర్జీ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం జరిగిన ర్యాలీలో విమర్శలు గుప్పించడంపై అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తింది. ‘పశ్చిమ బెంగాల్‌లో శాంతి భద్రతల పరిరక్షణ మాకు తెలుసు. ముందు ఢిల్లీ పరిస్థితిని చక్కదిద్దండి’ అంటూ అమిత్ షాకు హితవు పలికింది.

03/02/2020 - 05:07

న్యూఢిల్లీ, మార్చి 1: భారత దేశ భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయడానికి నిర్దేశించిన రెండు రోజుల సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ (సీపీఆర్) సదస్సు సోమవారం ప్రారంభం కానుంది. వివిధ రాజకీయ, భౌగోళికాది అంశాలతో పాటు నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) తగ్గుదల, వృద్ధి రేటు పతనం వంటి కీలకాంశాలు కూడా ఈ సదస్సులో చర్చకు వస్తాయి. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.

03/02/2020 - 00:39

కోల్‌కతా, మార్చి 1: పొరుగున ఉన్న మూడు దేశాల శరణార్థులకు పౌర చట్టాన్ని కల్పించాలన్న తమ ప్రభుత్వ నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంతమాత్రం అడ్డుకోలేరని కేంద్ర హోం మం త్రి అమిత్ షా ఆదివారం నాడు ఇక్కడ జరిగిన ఓ భారీ ర్యాలీలో స్పష్టం చేశారు. దేశంలోని శరణార్థులందరికీ పౌరసత్వాన్ని కల్పిం చే వరకూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం విశ్రమించే ప్రస క్తే లేదని ఆయన అన్నారు.

03/01/2020 - 05:53

గుమ్లా (జార్ఖండ్): నేటి యువతకు విలువ ఆధారిత విద్యను బోధించాల్సిన అవసరం ఎంతో ఉందనిరాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉద్ఘాటించారు. విద్యార్థులను అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్న ఆశయంతోనే విద్యావిధానంలో విలువలను ప్రోది చేయాలనిరాష్ట్రపతి అన్నారు.

Pages