S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/05/2016 - 18:13

ముంబయి: ‘బాలికా వధు’ ఫేమ్ టీవీ నటి ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న అభియోగంపై ఆమె ప్రియుడు రాహుల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అనారోగ్యం పాలైన రాహుల్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రత్యూష, రాహుల్ ప్రేమ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అనేక విషయాలు తెలుస్తున్నాయి. పెళ్లి చేసుకోడానికి రాహుల్ నిరాకరించేవాడని, ప్రత్యూష ఆర్థిక పరిస్థితి అంతా బాగాలేదని...

04/05/2016 - 17:31

దిల్లీ: దేశంలో క్రికెట్ అభివృద్ధికి బిసిసిఐ చేసిందేమీ లేదని సుప్రీం కోర్టు ధర్మాసనం మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. లోధా కమిషన్ సిఫారసులను ఎందుకు అమలు చేయడం లేదని కోర్టు ప్రశ్నించింది. స్వార్థ ప్రయోజనాల కోసమే బిసిసిఐ పనిచేస్తోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

04/05/2016 - 17:31

దిల్లీ: ఈ నెల 25 నుంచి వచ్చే నెల 13 వరకూ పార్లమెంటు మలివిడత సమావేశాలు జరుగుతాయని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మంగళవారం తెలిపారు.

04/05/2016 - 17:29

గౌహతి: అస్సాం, మేఘాలయతో పాటు మరికొన్ని ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇళ్లలోనుంచి జనం భయంతో బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.4గా నమోదైంది. ఎక్కడా ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం లేదు.

04/05/2016 - 17:28

దిల్లీ: పఠాన్‌కోట్‌లో ఉగ్రదాడిపై విచారణకు పాక్ బృందాన్ని అనుమతించడం ద్వారా భారతమాతకు ప్రధాని మోదీ వెన్నుపోటు పొడిచారని దిల్లీ సిఎం కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘భరతమాతాకీ జై’ అని నినాదం ఇవ్వాలని అందరికీ చెప్పే మోదీ ఐఎస్‌ఐ అధికారి నేతృత్వంలోని బృందానికి పఠాన్‌కోట్‌లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వడం సరికాదన్నారు.

04/05/2016 - 17:28

ముంబయి: భారత్‌కు చెందిన సుమారు 500 మంది ప్రముఖులు పన్నులు ఎగవేసి విదేశాల్లో భారీగా నల్లధనం దాచుకున్నారన్న పనామా పత్రాల పరిశోధనలో నిజానిజాలు వెల్లడి కావల్సి ఉందని ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం మీడియాతో చెప్పారు. పనామా పేపర్స్ లీకేజీపై సమగ్ర విచారణకు ఇప్పటికే కేంద్రం వివిధ ఏజెన్సీలతో విచారణ బృందాన్ని ఏర్పాటు చేసిందని, ఆ బృందంలో ఆర్‌బిఐ కూడా ఉందన్నారు.

04/05/2016 - 15:00

పాట్నా: బిహార్‌లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ప్రకటించారు. ఆర్మీ క్యాంటీన్లలో తప్ప ఇకపై దుకాణాలు, హోటళ్లు, బార్లలో మద్యం విక్రయించడం నేరం. మద్యం షాపులకు ఎలాంటి లైసెన్స్‌లు ఇవ్వరు. గుజరాత్‌లో ఇప్పటికే మద్య నిషేధం అమలులో ఉంది.

04/05/2016 - 14:50

ముంబయి: జీవితం దేవుడిచ్చిన అరుదైన వరం అని, ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని ముగించే హక్కు మనకు లేదని బాలీవుడ్ నటి, బిజెపి ఎంపి హేమమాలిని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించి ఆనందమయం చేసుకోవాలే తప్ప నిరాశకు కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవడం సరికాదన్నారు.

04/05/2016 - 12:45

ముంబయి: రెపోరేటును ఆర్‌బీఐ 6.75 శాతం నుంచి 6.50 శాతానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తగ్గించింది. ఎంఎస్‌ఎఫ్‌ రేటును ఆర్‌బీఐ 75 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. కీలక వడ్డీరేట్లను తగ్గించినట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ చెప్పారు. 2016-17లో వృద్ధిరేటు 7.6శాతం ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. రివర్స్‌ రెపో రేటును పావుశాతం పెంచినట్లు రాజన్‌ వివరించారు.

04/05/2016 - 12:06

దిల్లీ: దిల్లీ- ఆగ్రాల మధ్య గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే తొలి మినీ హైస్పీడ్ రైలు ‘గతిమాన్ ఎక్స్‌ప్రెస్’కు సోమవారం ఉదయం రైల్వేమంత్రి సురేష్ ప్రభు పచ్చజెండా ఊపారు. దిల్లీ నుంచి ఈ రైలు వంద నిమిషాల్లోనే ఆగ్రా చేరుకుంటుంది. ప్రయాణీకులకు స్వాగతం పలికేలా ఎయిర్ హోస్టెస్‌ల మాదిరి ఇందులో ట్రైన్ హోస్టెస్‌లుంటారు. ఉచితంగా వాటర్ బాటిళ్లు, దినపత్రికలు అందజేస్తారు.

Pages