S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/05/2016 - 02:32

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ఇటీవల కాలంలో తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన జెఎన్‌యు, హైదరాబాద్ యూనివర్సిటీలు అత్యుత్తమ వర్సిటీల జాబాతాలో చోటు సంపాదించుకున్నాయి. అత్యుత్తమ సాంకేతిక, మేనేజ్‌మెంట్ కళాశాలలుగా ఐఐటి (మద్రాసు), ఐఐటి (బెంగళూరు) నిలిచాయి. కేంద్ర ప్రభుత్వం సోమవారం ఈ జాబితా విడుదల చేసింది.

04/05/2016 - 02:32

విజయవాడ, ఏప్రిల్ 4: ఎఐటియుసి రాష్ట్ర సమితి సమావేశాలు ఈ నెల 11, 12 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరుగుతాయని, జాతీయ కార్యదర్శి అమర్‌జిత్ కౌర్ హాజరుకానున్నారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేశు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2015 జూన్‌లో విశాఖపట్టణంలో జరిగిన సమావేశాల నుంచి జరిగిన కార్యక్రమాలను సమీక్షించి భవిష్యత్ కార్యాచరణకు రూపకల్పన చేస్తామన్నారు.

04/05/2016 - 02:18

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలుగు రాష్ట్రాలపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఆర్థిక సహాయం అందజేస్తుందని హామీ ఇవ్వటంతోపాటు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాకతీయ మిషన్ పథకం వలన నీటిపారుదల రంగంలో వౌలిక సదుపాయాలు ఏర్పడతాయని ప్రశంసించారు.

04/05/2016 - 02:11

హైదరాబాద్, ఏప్రిల్ 4: తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పోటీకి దిగింది. లోగడ మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 24 స్థానాలకు పోటీ చేసి రెండు స్థానాలను కైవసం చేసుకుని ఇతర రాష్ట్రాల్లో బోణికొట్టిన సంగతి తెలిసిందే. ఆ ఉత్సాహంతోనే ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో పోటీ చేయడానికి ఆ పార్టీ సమాయత్తమైంది.

04/05/2016 - 01:48

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి)లో దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా పడింది. సోమవారం నూతన రాజధాని నిర్మాణంపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ స్వతంత్ర కుమార్‌తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది.

04/05/2016 - 01:45

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: తెలంగాణ నుండి హజ్‌కు వెళ్లే యాత్రికుల కోటా పెంచాలని కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లాను కోరినట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఆయన సోమవారం ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాల చారి, రామచంద్రు తేజావత్‌లతో కలసి నజ్మా హెప్తుల్లాను కలిశారు.

04/05/2016 - 01:45

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4:పనామా పేపర్స్ భారత సెలబ్రిటీలు, రాజకీయ, వ్యాపార ప్రముఖుల్లోనూ అలజడి రేకెత్తిస్తున్నాయి.

04/05/2016 - 01:16

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: భారతీయులు చట్ట వ్యతిరేకంగా విదేశాల్లో పెట్టిన పెట్టుబడులు, తెరిచిన బ్యాంకు ఖాతాలపై చర్యలు తప్పవని కేంద్రం సోమవారం ప్రకటించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిరంతరం పర్యవేక్షణకు బహుళ సంస్థలతో ఒక బృందం ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

04/05/2016 - 01:08

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోలుపై లీటరుకు రూ.2.19, డీజిల్‌పై లీటరుకు 98 పైసలు పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. ధరల తాజా సవరణతో ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.61.87కి చేరింది. గత మార్చి 17న కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై చమురు సంస్థలు భారీగా వడ్డన జరిపాయి.

04/04/2016 - 18:21

దిల్లీ: జమ్ము-కాశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన మెహబూబా ముఫ్తీకి ప్రధాని మోదీ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన బిజెపి నేత నిర్మల్ సిన్హా, ఇతర మంత్రులు కూడా ఆయన అధినందించారు. కాశ్మీర్ ప్రజల కలలు సాకారం చేసేందుకు, ఆ రాష్ట్రం ప్రగతి పథంలో పయనించేందుకు కొత్తగా ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వం కృషి చేయాలని మోదీ ఆకాంక్షించారు.

Pages