S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/04/2016 - 18:20

దిల్లీ: ఇటీవల వరుస వివాదాలతో జెఎన్‌యు, హెచ్‌సియులో ఉద్రిక్త పరిస్థితులు రాజ్యమేలుతుండగా మరో వైపు ఈ రెండు వర్సిటీలు దేశంలోనే టాప్‌టెన్‌లో నిలవడం గమనార్హం. కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ వర్సిటీలకు సంబంధించి ర్యాంకింగ్‌లను విడుదల చేశారు. బెంగళూరు ఐఐటి నెంబర్ వన్‌గా, ముంబయిలోని ఐఐసిటి రెండో స్థానంలో నిలిచాయి. మూడో స్థానంలో జెఎన్‌యు, నాలుగోస్థానంలో హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ నిలిచాయి.

04/04/2016 - 17:34

లక్నో: యుపిలోని ఫిలిబిత్ జిల్లాలో 1991 నాటి నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో 47 మంది పోలీసులకు జీవితఖైదు విధిస్తూ ఇక్కడి సిబిఐ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. ఈ కేసులో మొత్తం 57 మంది పోలీసులపై అభియోగాలు మోపగా, విచారణ కాలంలో పదిమంది పోలీసులు మరణించారు. మిగతావారందరినీ దోషులుగా సిబిఐ కోర్టు నిర్ధారించింది.

04/04/2016 - 17:33

దిల్లీ: మావోయిస్టు సానుభూతి పరుడిగా పోలీసులు అరెస్టు చేసిన ప్రొఫెసర్ సాయిబాబాకు సుప్రీం కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఏడాదికాలంగా నాగ్‌పూర్ జైలులో ఉంటున్న సాయిబాబా పట్ల మహారాష్ట్ర సర్కారు అవలంబిస్తున్న వైఖరిని సుప్రీం తప్పుపట్టింది. వికలాంగుడైన సాయిబాబాను ఏడాదికాలంగా జైలులో ఉంచడం పట్ల కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

04/04/2016 - 15:08

కోల్‌కత: పశ్చిమ బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ సోమవారం ప్రశాంతంగా సాగుతోంది. బెంగాల్‌లో 18 సీట్లకు, అస్సాంలో 65 సీట్లకు తొలి విడత పోలింగ్ ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైంది. ఉదయం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నానికి కాస్త ఊపందుకుంది. పలు పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లు బారులు తీరి నిల్చున్నారు.

04/04/2016 - 15:06

దిల్లీ: పట్టిసీమ ప్రాజెక్టును రికార్డు స్థాయిలో పూర్తి చేసి నదుల అనుసంధానానికి ఎపి సిఎం చంద్రబాబు నాంది పలికారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కొనియాడారు. ఇక్కడ సోమవారం జాతీయ జల వారోత్సవాల ప్రారంభ వేడుకలో ఆయన మాట్లాడుతూ, ఎపిలో గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిని కలగిస్తోందన్నారు.

04/04/2016 - 15:06

చండీగఢ్: ఈ దేశంలో పుట్టిన వారంతా మాతృదేశమైనందున భారత్‌ను గౌరవించాల్సిందేనని యోగా గురువు రామ్‌దేవ్ బాబా అన్నారు. ‘భారత్‌మాతాకి జై’ అనడానికి ఇష్టపడడం లేదని ఇటీవల కొందరు బహిరంగంగా చెబుతున్నారని ఆయన ప్రస్తావిస్తూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

04/04/2016 - 12:35

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 41 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతుంది. ఈ మేరకు డిఎంకె, కాంగ్రెస్ మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. కాంగ్రెస్ ప్రతినిధి గులాం నబీ అజాద్, డిఎంకె అధినేత కరుణానిధి మధ్య సోమవారం ఉదయం జరిగిన చర్చలు ముగిశాయి. 63 సీట్లు కావాలని కాంగ్రెస్ అడిగినా డిఎంకె అందుకు అంగీకరించక కేవలం 41 సీట్లు కేటాయించింది.

04/04/2016 - 12:34

నాసిక్: ఆలయాల్లో మహిళల ప్రవేశాన్ని అడ్డుకోలేమంటూ ముంబయి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇపుడు కొత్త కష్టాలను తెచ్చిపెడుతోంది. పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు ఇవ్వాల్సిందేనని హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాసిక్ (మహారాష్ట్ర)కు సమీపంలోని పురాతన త్రయంబకేశ్వర ఆలయం గర్భగుడిలోకి సోమవారం నుంచి పురుషులను కూడా అనుమతించడం లేదు.

04/04/2016 - 12:32

జోహ్రాత్: రాష్ట్ర ప్రజలు మళ్లీ కాంగ్రెస్‌నే గెలిపిస్తారని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ ధీమా వ్యక్తం చేశారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ సందర్భంగా సోమవారం ఆయన జోహ్రాత్‌లో ఓటు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ఏమీ జరగడం లేదని భావిస్తున్న ప్రజలు మళ్లీ కాంగ్రెస్‌కే పగ్గాలు అప్పగిస్తారన్నారు. ఆయన టిటాబార్ స్ట్రీట్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు.

04/04/2016 - 12:32

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్ తొలి మహిళా సిఎంగా పిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తీ సోమవారం ఉదయం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సిఎంగా బిజెపి నేత నిర్మల్ సింగ్, కొందరు మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి బిజెపి తరఫున కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా హాజరయ్యారు.

Pages