S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/04/2016 - 07:14

రియాద్, ఏప్రిల్ 3: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రియాద్‌లో అందరూ మహిళలే ఉండే టిసిఎస్ ట్రైనింగ్ సెంటర్‌ను సందర్శంచి అక్కడ పని చేస్తున్న సౌదీ మహిళా ఐటి ఉద్యోగులతో మాట్లాడారు. అంతేకాదు, వారిని భారత్‌కు రావలసిందగా కూడా ఆహ్వానించారు.

04/04/2016 - 07:14

రియాద్, ఏప్రిల్ 3: సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దులజీజ్‌తో చర్చలు జరిపారు. వ్యాపారం, పెట్టుబడులు, ఉగ్రవాద నిరోధం సహా వివిధ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. పెట్రోలియం నిల్వలు సమృద్ధిగా ఉన్న సౌదీ అరేబియా భారత్‌కు అత్యధికంగా ముడి చమురును సరఫరా చేసే దేశం.

04/04/2016 - 07:13

కోల్‌కతా, ఏప్రిల్ 3: పశ్చిమ బెంగాల్ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా అవినీతి ప్రధాన అంశంగా మారింది. సోమవారం నుంచి ఆరు దశల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ‘అవినీతి’ కేంద్ర బిందువుగా మారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా తృణమూల్ సర్కార్‌లో స్కాములు, కుంభకోణాలు వెలుగుచూడటంతో ప్రతిపక్షాలు అవినీతినే ప్రధానాంశంగా ప్రచారం చేశాయి.

04/04/2016 - 07:12

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: తొలిసారి చేపట్టిన చంద్రగ్రహ యాత్ర చంద్రయాన్ ప్రయోగంలో రష్యా సాయాన్ని తీసుకున్న భారత్ చంద్రయాన్-2 ప్రయోగంలో మాత్రం రష్యా సాయాన్ని తీసుకోకూడదని, ఈ ప్రయోగాన్ని దాదాపు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే చేపట్టాలని, అయితే అమెరికానుంచి కొద్దిపాటి సాయాన్ని మాత్రం తీసుకోవాలని నిర్ణయించుకుంది.

04/04/2016 - 07:11

నాసిక్, ఏప్రిల్ 3: ‘్భరత్ మాతాకీ జై’ అనడానికి ఇష్టపడని వారికి దేశంలో ఉండడానికి ఎలాంటి హక్కూ లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. ‘్భరత్ మాతాకీ జై’ అనడంపై ఇప్పటికీ వివాదం ఉంది. అలా అనడాన్ని వ్యతిరేకిస్తున్నవారికి ఈ దేశంలో ఉండే హక్కు లేదు. ఇక్కడ ఉండేవారు ‘్భరత్ మాతాకీ జై’ అని అనాల్సిందే’ అని ఫడ్నవిస్ శనివారం రాత్రి ఇక్కడ జరిగిన ఓ బహిరంగ సభలో అన్నారు.

04/04/2016 - 07:10

గౌహతి/ కోల్‌కతా, ఏప్రిల్ 3: పశ్చిమబెంగాల్, అస్సాం రాష్ట్రాల అసెంబ్లీలకు తొలి విడత పోలింగ్ సోమవారం జరుగనుంది. పశ్చిమబెంగాల్‌లోని 18 నియోజకవర్గాలకు, అస్సాంలోని 65 నియోజకవర్గాలకు తొలి విడతలో పోలింగ్ జరుగుతుంది. పశ్చిమబెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో సుమారు నెల రోజుల పాటు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది.

04/04/2016 - 07:08

జమ్ము/ శ్రీనగర్, ఏప్రిల్ 3: జమ్మూకాశ్మీర్ తొలి ముస్లిం మహిళా ముఖ్యమంత్రిగా పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. జనాభా పరంగా ముస్లింల ఆధిక్యం గల ఈ రాష్ట్రంలో పిడిపి-బిజెపి కూటమి ప్రభుత్వానికి ఆమె నేతృత్వం వహించనున్నారు.

04/04/2016 - 05:53

బిజ్‌నోర్/ న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ సహా అనేక టెర్రరిస్టు దాడులకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారి ఒకరు ఆదివారం తెల్లవారు జామున దారుణ హత్యకు గురయ్యారు.

04/04/2016 - 05:20

రియాద్, ఏప్రిల్ 3: ఉగ్రవాదం మానవత్వానికే శత్రువని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదంతో మతాన్ని వేరు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో రంగాలవారీ లేదా పాక్షిక వైఖరులు ఏమాత్రం సమర్థవంతంగా పని చేయవని స్పష్టం చేశారు.

04/03/2016 - 03:06

ముంబయి, ఏప్రిల్ 2: రాజ్యాంగం జాతీయ గీతంగా గుర్తించిన ‘జనగణ మన’కన్నా కూడా ‘వందేమాతరం’ నిజమైన దేశభక్తి గీతమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషీ అన్నారు. కొద్ది రోజుల క్రితం ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రతి ఒక్కరూ ‘్భరత్ మాతాకీ జై’ అనాలంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.

Pages