S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/03/2016 - 03:06

అహ్మద్‌నగర్, ఏప్రిల్ 2: మహారాష్టల్రోని శనిసింగనాపూర్ శనీశ్వరుని ఆలయం వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళలకు ఆలయంలో ప్రవేశించే హక్కు ఉందని బాంబే హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో పెద్దఎత్తున మహిళలు శనీశ్వరుని ఆలయం వద్దకు చేరుకున్నారు. తృప్తి దేశాయ్ నేతృత్వంలోని భూమాతా బ్రిగేడ్ నాయకత్వంలో మహిళలు ఆలయ ప్రవేశం చేయబోగా స్థానికులు అడ్డుకున్నారు.

04/03/2016 - 03:05

ముంబయి, ఏప్రిల్ 2: ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ టెలివిజన్ నటి ప్రత్యూష బెనర్జీ వ్యక్తిగత జీవితం సాఫీగా లేదని ఆమె మిత్రులు కొందరు చెబుతున్నారు.

04/03/2016 - 03:05

నియమత్‌పూర్/దుర్గాపూర్, ఏప్రిల్ 2: ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణ చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా మోదీ బాటలోనే నడుస్తున్నారని శనివారం ఇక్కడ ధ్వజమెత్తారు. ‘మోదీజీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

04/03/2016 - 02:52

వారణాసి, ఏప్రిల్ 2: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లా జైలులో శనివారం ఖైదీలు బీభత్సం సృష్టించారు. సిబ్బందితో ఘర్షణకు దిగి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌ను తీవ్రంగా గాయర్చడంతో పాటు జైలు సూపరింటెండెంట్‌ను నిర్బంధించారు. జైలులోని కొన్ని బ్యారక్‌లను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కంటోనె్మంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌకాఘాట్ వద్ద వారణాసి జిల్లా జైలులో ఈ ఘటన జరిగింది.

04/03/2016 - 02:12

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: జలవనరులను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ‘కాకతీయ మిషన్’ ఎంతగానో దోహదపడుతుందని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ప్రశంసలతో ముంచెత్తారు. ఆమె శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, తెలంగాణలో ప్రారంభించిన ‘కాకతీయ మిషన్’ను ఇతర రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.

04/02/2016 - 16:42

కోల్‌కత:ఫ్లైఓవర్ కూలిన సంఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను కాంగ్రెస్ యువ సారథి రాహుల్‌గాంధీ పరామర్శించారు. శనివారం ఆయన కోల్‌కతాలో పర్యటించి దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్నవారి ప్రమాదం వివరాలు, సహాయక చర్యలగురించి అడిగి తెలుసుకున్నారు. కాగా రాహుల్ పర్యటనను బిజెపి తప్పుబట్టింది.

04/02/2016 - 16:39

షిరిడి:ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడి సమీపంలోని శనిసింగణాపూర్‌లోని శని దేవాలయంలో మహిళల ప్రవేశంపై హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో సామాజిక ఉద్యమకారిణి తృప్తి దేశాయ్ సారథ్యంలో మహిళలు ఆలయప్రవేశంకోసం ప్రయత్నించారు. కాగా వారిని గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

04/02/2016 - 14:03

ముంబై: చిన్నారిపెళ్లికూతురు సీరియల్‌తో ప్రేక్షకుల మనసుదోచిన ‘ఆనంది’ పాత్రధారి ప్రత్యూష బెనర్జీ మృతిపై అనుమానాలు వెల్లడవుతున్నాయి. ఆమెది ఆత్మహత్య కాదని, ఆమె మరణం వెనుక ప్రియుడు రాహుల్‌రాజ్ హస్తం ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

04/02/2016 - 14:01

శ్రీనగర్:టీ-20 ప్రపంచకప్ పోటీల్లో భారత్ ఓటమిపై ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో శ్రీనగర్‌లోని నిట్‌కు సెలవు ప్రకటించారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

04/02/2016 - 04:43

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి నుండి రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. తెలంగాణకు రూ.328కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.141 కోట్లు విడుదల చేసినట్లు తెలిసింది. 2015-16 ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో ఈ నిధులు కేటాయించటం గమనార్హం.

Pages