S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/02/2016 - 03:54

డెహ్రాడూన్, ఏప్రిల్ 1: విద్యార్థుల్లో మాతృభూమి పట్ల మమకారాన్ని, సమాజంపట్ల బాధ్యతను, సహనశీలతను పెంపొందించాల్సిన బాధ్యత విద్యా సంస్థలపై ఉందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఉద్ఘాటించారు. ప్రతి విద్యార్థిలోనూ ఈ రకమైన ఉన్నతమైన భావనలను పాదుకొల్పడం ద్వారా వారి వ్యక్తిత్వాలనూ తీర్చిదిద్దాల్సిన అవసరముందని తెలిపారు.

04/02/2016 - 03:48

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో జయలలిత, మమతా బెనర్జీలు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారం కోసం కాంగ్రెస్, బిజెపిలు తీవ్రంగా పోటీపడుతున్న అస్సాంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడేందుకు అవకాశం ఉందని తాజాగా జరిగిన ఎన్నికల సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

04/02/2016 - 03:48

ముంబయి, ఏప్రిల్ 1: సంప్రదాయాలను అడ్డుపెట్టుకుని ఆలయ ప్రవేశాలపై మహిళలను ఇక ఎంతమాత్రం నిరోధించడానికి వీలు లేదని ముంబయి హైకోర్టు విస్పష్టంగా తెలియజేసింది. తమ ఆరాధ్య దైవాన్ని కొలిచేందుకు ఆలయాల్లోకి ప్రవేశించడమన్నది మహిళల ప్రాథమిక హక్కు అనీ, వారికి రక్షణ కల్పించడమే ప్రభుత్వాల బాధ్యత అని హైకోర్టు ఉద్ఘాటించింది. ఆలయ ప్రవేశాలపై శతాబ్దాలుగా సాగిన వివక్షకు కోర్టు ఉత్తర్వులు తెరదించాయి.

04/02/2016 - 03:46

కోల్‌కతా, ఏప్రిల్ 1: కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వంతెన ప్రమాదం ఘటనకు సంబంధించి ఐదుగురు అధికారులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఐవిఆర్‌సిఎల్ అనే కంపెనీ ఈ ఫ్లై ఓవర్ నిర్మిస్తోంది. శిథిలాల నుంచి శుక్రవారం మరో మూడు మృతదేహాలను వెలికి తీశారు.

04/02/2016 - 03:45

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: బాలకార్మికుల పునరావాసానికి సంబంధించి ఆరు రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సి) నోటీసులు జారీ చేసిం ది. 740 మంది బాలకార్మికులకు భద్రత కల్పించే విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని కమిషన్ ఆదేశించింది.

04/02/2016 - 03:43

చండీగఢ్, ఏప్రిల్ 1: ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులకు ఇది శుభవార్త. పంజాబ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన నేతృత్వం వహిస్తున్న పార్టీ ఆప్ హవా వీస్తోందని తాజా సర్వే వెల్లడించింది. హుఫ్‌పోస్ట్-సి ఓటర్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నిర్వహించిన ఈ సర్వే ప్రకారం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయదుందుభి మోగిస్తుంది. 117 సీట్లున్న అసెంబ్లీలో ఆప్‌కు 94నుంచి 100 సీట్లు వస్తాయి.

04/02/2016 - 03:41

దేవబంద్, ఏప్రిల్ 1: ‘్భరత్ మాతాకీ జై’ అనే నినాదం ఇస్లాంకు వ్యతిరేకమని, అందువల్ల ఆ నినాదం ఇవ్వకూడదని ప్రముఖ ఇస్లాం విద్యాసంస్థ దారుల్ ఉలూమ్ దేవబంద్ శుక్రవారం ముస్లిం మతస్థులకు ఫత్వా జారీ చేసింది. ఇస్లాంలో దేవుడు ఒక్కడే ఉంటాడని, అందువల్ల ‘్భరత్ మాతాకీ జై’ అని నినదించడం సరికాదని దారుల్ ఉలూమ్ దేవబంద్ పేర్కొంది. ‘్భరత్ మాతాకీ జై’ అనే నినాదంపై జరుగుతున్న చర్చపై స్పందిస్తూ ‘మేము దేశాన్ని ప్రేమిస్తాం.

04/02/2016 - 02:23

ముంబయి, ఏప్రిల్ 1: బాలికావధుతోపాటు ఎన్నో సీరియళ్లలో నటించి ఇంటింటినీ ఆకట్టుకున్న ఓ ఉజ్వల నటి భవిషత్ అర్ధాంతరంగా అంతమైంది. ఈ సీరియల్‌లో ఆనంది పాత్రతో ప్రతి ఒక్కరినీ మెప్పించిన నటి ప్రత్యూష బెనర్జీ శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది.

04/02/2016 - 02:16

హైదరాబాద్, ఏప్రిల్ 1: కోల్‌కతాలో ఫ్లై ఓవర్ కూలిపోయిన ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా పశ్చిమబంగాల్ పోలీసుబృందం హైదరాబాద్ చేరుకుంది. ఫ్లైఓవర్ పనులు నిర్వహిస్తున్న ఐవిఆర్‌సిఎల్ కంపెనీ కార్యాలయం హైదరాబాద్‌కు చెందినదిగా గుర్తించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ పోలీసుల సహాయంతో బంగాల్ పోలీసులు శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లి సోదాలు చేశారు.

04/02/2016 - 02:03

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ఇక పిల్లలతో రైళ్లలో రిజర్వుడు బెర్త్‌లు, సీట్లలో ప్రయాణించాలంటే పూర్తి చార్జి కట్టాల్సిందే. నిన్నమొన్నటి వరకూ ఐదునుంచి పనె్నండేళ్లలోపు పిల్లలకు రిజర్వేషన్లకు సంబంధించి సగం ధరే ఉండేది. ఇటీవల రైల్వే మంత్రి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ప్రతిపాదన శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది.

Pages