S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/22/2016 - 05:03

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు)లో దేశ వ్యతిరేక కార్యకలాపాలను ఖండిస్తూ దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో ఆదివారం భారీ నిరసన ప్రదర్శన జరిగింది. మాజీ సైనికోద్యోగుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో వేలాది మంది ప్రజలు కదం తొక్కారు.

02/22/2016 - 05:00

కొలంబియా: అమెరికా అధ్యక్ష పదవికోసం పోటీ తీవ్రమైన నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం అందరికన్నా ముందంజలో ఉన్న వివాదాస్పద అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సౌత్ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లో ప్రత్యర్థులను చిత్తు చేసి ఘన విజయం సాధించారు.

02/22/2016 - 04:59

బెంగళూరు: నగరం లో ఆదివారం కర్నాటక ముఖ్యమం త్రి సిద్దరామయ్య, కేంద్ర మంత్రి అనంత్ కుమార్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎంఎన్ వెంకటాచలయ్య పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఒక వ్యక్తి బాంబని చెప్తూ, ఓ పాకెట్ విసిరి కలకలం సృష్టించాడు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడడం ప్రారంభించగానే రవీంద్ర కళాక్షేత్ర ఆడిటోరియం బాల్కనీలో కూర్చుని ఉన్న ఓ వ్యక్తి హఠాత్తుగా లేచి ‘మీరు మా కులానికి ఏం చేశారు?

02/22/2016 - 04:57

న్యూఢిల్లీ: పార్లమెంట్‌పై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ జెఎన్‌యు (జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ)లో నిర్వహించిన కార్యక్రమంపై వివాదం తలెత్తడంతో ఆ వర్శిటీ క్యాంపస్‌లోకి పోలీసులను అనుమతించాలని వైస్-చాన్సలర్ ఎం.జగదీషష్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖ విద్యావేత్త నోవమ్ చోమ్‌స్కీ ప్రశ్నించారు. ‘జెఎన్‌యులో నెలకొన్న సంక్షోభం చాలా మందికి ఆందోళన కలిగిస్తోంది.

02/22/2016 - 01:47

శ్రీనగర్: శ్రీనగర్ శివార్లలోని పాంపోర్ పట్టణంలోని ఒక ప్రభుత్వ కార్యాలయంలోకి చొరబడిన ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఆదివారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో పారా యూనిట్‌కు చెందిన ముగ్గురు కమాండోలు వీరమరణం పొందారు. వీరిలో ఇద్దరు కెప్టెన్ స్థాయి అధికారులు కాగా, మరొకరు జవాను. కెప్టెన్ పవన్ కుమార్, కెప్టెన్ తుషార్ మహాజన్, జవాను ఓంప్రకాశ్ ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు.

02/22/2016 - 01:45

న్యూఢిల్లీ/ రోహతక్: హరాన్యాలో జాట్‌లు చేస్తున్న ఆందోళన సెగలు పొరుగు రాష్ట్రాలతో పాటుగా దేశ రాజధాని ఢిల్లీని సైతం చుట్టుముట్టడంతో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చాయి. రిజర్వేషన్ల అంశంపై పరిశీలనకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని నియమించేందుకు కేంద్రం అంగీకరించింది. మరోవైపు జాట్లను ఓబీసీల్లో చేర్చేందుకు హర్యానా ప్రభుత్వం హామీ ఇచ్చింది.

02/22/2016 - 01:44

బార్‌గఢ్: కేంద్రంలో తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, తనను అప్రతిష్ఠ పాలు చేసేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు(ఎన్‌జిఓలు), బ్లాక్ మార్కెటీర్లు కుట్ర పన్నుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఈ దుష్ట శక్తులకు తల వంచుకుండా తాను ప్రజలు తనకు అప్పగించిన బాధ్యతను కొనసాగిస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. ‘ఒక ‘చాయ్‌వాలా’ ప్రధానమంత్రి కావడాన్ని కొంతమంది జీర్ణించుకోలేక పోతున్నారు.

02/21/2016 - 18:53

న్యూదిల్లి:ఒబిసిలుగా జాట్లకు రిజర్వేషన్ కల్పించేందుకు హర్యానా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వచ్చే శాసనసభ సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. దీనిపై ఇవాళో, రేపో ప్రభుత్వం ఒక ప్రకటన చేయనుంది. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సమక్షంలో జాట్ ప్రతినిధులు, హర్యానా ప్రభుత్వ ప్రతినిధుల మధ్య ఆదివారం సాయంత్రం జరిగిన చర్చలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

02/21/2016 - 18:52

న్యూదిల్లీ: జెఎన్‌యులో జాతివ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, ఉగ్రవాది అఫ్జల్‌గురు అనుకూల కార్యక్రమాలు చేపట్టడాన్ని నిరసిస్తూ వేలాదిమంది ఆదివారంనాడు న్యూదిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించారు. జెఎన్‌యు విద్యార్థిసంఘం నాయకుడు కన్నయ్య, అతడి మద్దతుదార్లకు వ్యతిరేకంగా వీరు నినాదాలు చేశారు. రాజ్‌ఘాట్‌నుంచి జంతర్‌మంతర్‌వరకు సాగిన ఈ ర్యాలీలో దాదాపు 25వేలమంది పాల్గొన్నట్లు పోలీసులు పేర్కొన్నారు

02/21/2016 - 15:30

చెన్నై: డిఎంకె, పిఎంకె, తమిళ పుథియ పార్టీలకు చెందిన పది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు వారి పదవులకు రాజీనామాలు చేశారు. వీరంతా అధికార అన్నాడిఎంకె పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. మరికొద్ది నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి.

Pages