S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/01/2016 - 02:13

న్యూఢిల్లీ, మార్చి 31: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం 18 వందల కోట్లు విడుదల చేసిందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. గురువారం నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో జరిగిన ఒక సమావేశానికి హైజరైన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వారం పది రోజుల్లో సిఎస్‌టి కింద మరో 650 కోట్లు విడుదల చేయనుందని అన్నారు.

03/31/2016 - 17:31

కోల్‌కత: నగరంలోని ఉత్తర ప్రాంతంలో గిరీష్ పార్క్ వద్ద గురువారం నిర్మాణంలో ఉన్న ఫ్లయ్‌ఓవర్ కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. శిథిలాల తొలగింపు కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. శిథిలాల కింద కనీసం 200 మంది చిక్కుకున్నారన్న వార్తలు రావడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. బుధవారం చేపట్టిన పనులకు సంబంధించి నిర్మాణాలు మరుసటిరోజునే కూలిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది.

03/31/2016 - 15:40

కోల్‌కత: కోల్‌కత నగరంలోని ఉత్తర ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వంతెన గురువారం కుప్పకూలడంతో పదిమంది మరణించారు. శిథిలాలను తొలగిస్తూ సహాయ కార్యక్రమాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

03/31/2016 - 05:46

న్యూఢిల్లీ, మార్చి 30: లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనను బిజెపి మరోసారి తెరపైకి తేనుంది. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రస్తావన తేవడంతో మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

03/31/2016 - 05:44

ముంబయి, మార్చి 30: ప్రార్థనా స్థలాల్లోకి మహిళలు ప్రవేశించకూడదని ఏ చట్టం చెప్పడం లేదని, పురుషులు ప్రవేశించే అన్ని ప్రార్థనా స్థలాల్లోకి మహిళలను కూడా అనుమతించాలని బొంబాయి హైకోర్టు స్పష్టం చేసింది.

03/31/2016 - 05:15

న్యూఢిల్లీ, మార్చి 30: దీపం పథకం కింద ఎల్‌పిజి గ్యాస్ కనెక్షన్లలో తెలంగాణలోని పేద మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు. ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో సమావేశమైన ఇద్దరు మంత్రులు పెట్రోలియం ఆథారిత అంశాలపై సమీక్ష నిర్వహించారు.

03/31/2016 - 04:55

న్యూఢిల్లీ, మార్చి 30: ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపుపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు హౌసింగ్ పాలసీ మార్పునకు అనుమతి ఇచ్చింది. విచారణలో ఉన్న పిటిషన్ ఉపసంహరించుకొనేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా సుప్రీంకోర్టు అందుకు తిరస్కరించింది.

03/31/2016 - 03:23

న్యూఢిల్లీ, మార్చి 30: భారత యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ సెల్ఫీలు దిగడం మామూలే. అయితే, సోషల్ నెట్‌వర్క్‌లో అతను పోస్ట్ చేసిన తాజా సెల్ఫీ హల్‌చల్ చేస్తోంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, సాక్షి దంపతుల కుమార్తె జీవాతో అతను సెల్ఫీ దిగి ట్వీట్ చేశాడు. ఫేస్ బుక్‌లోనూ ఉంచాడు. ఆ ఫొటోకు కొన్ని గంటల్లోనే 1.9 లక్షల లైక్స్ వచ్చాయి. ‘జీవా నా ఫోన్ తీసుకుంది. దానిని ఏ విధంగా ఉపయోగించాలో ఆమెకు బాగా తెలుసు.

03/31/2016 - 03:20

బిశ్వనాథ్ చరియాలి (అసోం), మార్చి 30; కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ, మోదీ ప్రభుత్వం అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక పద్ధతుల ద్వారా కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలన్నిటినీ కూల్చి వేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.‘ అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఎన్నికయిన ప్రభుత్వాలను కూల్చివేయడానికి వారు అన్ని రకాల ప్రయత్నించారు.

03/31/2016 - 03:17

న్యూఢిల్లీ, మార్చి 30: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్ విజయం సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. తమిళనాడు మాదిరిగా కేరళ ప్రజలు కూడా ఒకసారి యుడిఎఫ్, ఒకసారి ఎల్‌డిఎఫ్‌కు ఓటు వేయటం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అధికారంలో ఉన్న యుడిఎఫ్‌ను ఇంటికి పంపించి ఎల్‌డిఎఫ్‌కు పట్టం కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే వామపక్షాల మెజారిటీని బిజెపి కూటమి దెబ్బతీసే అవకాశాలు మెరుగవుతున్నాయి.

Pages