S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/19/2015 - 17:25

న్యూఢిల్లీ ‌: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలకు పాటియాల కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసు విచారణలో భాగంగా శనివారం వారు న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. సోనియా, రాహుల్‌ తరపున కపిల్‌ సిబల్‌ కేసును వాదించారు. బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా న్యాయమూర్తిని కోరగా, చెరో రూ.50వేల పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.

12/19/2015 - 14:27

హైదరాబాద్‌: మధ్యప్రదేశ్‌లో మండ్ల గ్రామంలో ఆయుష్‌ అనే ఐదేళ్ల బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ 200 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. బావిలో భూమి మట్టానికి 30 అడుగుల పైన చిక్కుకుపోయాడు. అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాలుడిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.

12/19/2015 - 14:10

న్యూఢిల్లీ : బీజేపీ ప్రభుత్వం సోనియా, రాహుల్ గాంధీపై రాజకీయ కుట్ర చేస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విపక్షాలను టార్గెట్ చేస్తుందని మండిపడ్డారు. ఎన్నికలకు మందు కాంగ్రెస్ రహిత భారత్ కోసం బీజేపీ ప్రయత్నించింది. అధికారంలోకి వచ్చాక విపక్ష రహిత భారత్ కోసం ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

12/19/2015 - 14:05

న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసును చట్టబద్ధంగానే ఎదుర్కొంటామని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. ఈ కేసును రాజకీయం చేయదల్చుకోలేదని తెలిపారు. న్యాయవ్యవస్థను తాము గౌరవిస్తామని చెప్పారు. రాజకీయాలు కాంగ్రెస్ చేయట్లేదు.. బీజేపీనే చేస్తుందని మండిపడ్డారు. అసహనంపై పార్లమెంట్‌లో ప్రశ్నించినప్పుడు సమాధానం ఇవ్వలేదు.

12/19/2015 - 14:00

ఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ఫిక్కీ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పాల్గొన్నారు. 2015లో భారత్ ఆర్థికంగా ఎంతో పురోగమించిందని జైట్లీ తెలిపారు. రాష్ర్టాల అభివృద్ధితోనే కేంద్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు. దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి పుష్కలంగా ఉంది. జీడీపీలో అత్యధిక శాతం వ్యవసాయరంగానిదేనని వెల్లడించారు.

12/19/2015 - 06:13

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: రాజ్యసభ, లోక్‌సభ నిర్వహణకు కనీస సంఖ్యలో కూడా సభ్యుల హాజరీ లేకపోవడం వల్ల ఉభయ సభలు శుక్రవారం అర్ధంతరంగా వాయిదా పడ్డాయి. పలుసార్లు వాయిదాపడ్డ అనంతరం మధ్యాహ్నం 2.30కు రాజ్యసభ సమావేశమైంది. అనంతరం అనధికార బిల్లులను చేపట్టేందుకు చైర్మన్ ప్రయత్నించారు. అదే సమయంలో రాజ్యాంగ (షెడ్యూలు కులాల) ఉత్తర్వును సవరించేందుకు ఉద్దేశించిన ఓ బిల్లుపై ఓటింగ్‌ను చేపట్టారు.

12/19/2015 - 07:21

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ఎట్టకేలకు రాజ్యసభలో ప్రతిష్టంభన తొలగిపోయింది. చైర్మన్ హమీద్ అన్సారీ శుక్రవారం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ఈ శీతాకాల సమావేశాలలో మిగిలిన మూడు రోజులు సభను సజావుగా సాగనివ్వడంతో పాటు ఏకాభిప్రాయం ఉన్న కొన్ని బిల్లుల ఆమోదానికి మద్దతివ్వడానికి ప్రతిపక్షం అంగీకరించింది. అయితే వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లుపై మాత్రం అధికార, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.

12/19/2015 - 06:05

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్ సభ్యులు శుక్రవారం లోక్‌సభలో దాదాపు గంటరన్నర పాటు నినాదాలు చేసి, సభ నుంచి వాకౌట్ చేశారు. కాంగ్రెస్ సభ్యులు పార్లమెంటు నియమ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ విమర్శించారు.

12/19/2015 - 05:53

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: దేశంలో క్రైస్తవులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వబోమని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం వారికి హామీ ఇచ్చారు. అంతేకాదు, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, క్రైస్తవ్ర సంస్కృతీ సంప్రదాయాలు రెండూ ఒకటేనని కూడా ఆయన స్పష్టం చేసారు.

12/19/2015 - 05:50

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: రాజ్యాంగ పరిరక్షకునిగా వ్యవహరించవలసిన అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగించే తీరులో వ్యవహరిస్తున్నందున వెంటనే రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యులు శుక్రవారం రాజ్యసభను స్తంభింపచేశారు. కాంగ్రెస్ సభ్యుల నినాదాల కొనసాగించడంతో ప్రయివేట్ మెంబర్ బిల్లులను కూడా చేపట్టకుండానే సోమవారానికి వాయిదా పడిపోయింది.

Pages