S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/30/2016 - 16:57

ముంబయి: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువుగా తరచూ వార్తల్లో నిలిచే రాధేమాపై ముంబయి పోలీసులు ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. వరకట్నం వేధింపులు, అసభ్య నృత్యాలకు సంబంధించి ఆమెపై గతంలో కేసులు పెట్టారు. గత ఏడాది ఔరంగాబాద్ నుంచి ముంబయికి విమానంలో ప్రయాణించినపుడు ఆమె త్రిశూలం పట్టుకుని ప్రయాణించారన్న ఫిర్యాదులపై ఇపుడు ముంబయి ఎయిర్ పోర్టు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

03/30/2016 - 16:53

దిల్లీ: చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వరంగ సంస్థల్లో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను నిషేధించాలని కోరుతూ వచ్చే సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని ప్రధాన ట్రేడ్ యూనియన్లు నిర్ణయించాయి. ఈ రోజు ఇక్కడ జరిగిన సమావేశంలో ఎఐటియుసి, ఇంటక్, హెచ్‌ఎంఎస్, సిఐటియు తదితర 11 కార్మిక సంఘాల నేతలు పాల్గొని ఈ నిర్ణయం తీసుకున్నారు.

03/30/2016 - 13:49

దిల్లీ: వివిధ బ్యాంకులకు తాను బకాయిపడిన నాలుగువేల కోట్ల రూపాయలను సెప్టెంబర్‌లోగా చెల్లిస్తానని, ఈ మేరకు తనకు గడువు ఇవ్వాలని వ్యాపారవేత్త విజయ్ మాల్యా సుప్రీం కోర్టును కోరారు. లండన్‌లో ఉంటున్న ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు బుధవారం విచారించింది. మాల్యా చేసిన ఈ ప్రతిపాదనపై వారంలోగా స్పందించాలని బ్యాంకుల కన్సార్టియంను ఆదేశిస్తూ కేసు విచారణను ఏప్రిల్ 7కు సుప్రీం వాయిదా వేసింది.

03/30/2016 - 13:49

దిల్లీ: బ్యాంకులకు తాను రుణాలు చెల్లించాల్సి ఉండగా, తన కుమారుడు సిద్ధార్థ్‌ను టార్గెట్ చేస్తూ కొందరు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడం తగదని వ్యాపారవేత్త విజయ్ మాల్యా ట్విట్టర్‌లో తాజాగా పేర్కొన్నారు. అనేక బ్యాంకులకు సుమారు 9వేల కోట్ల రూపాయలు బకాయి పడిన మాల్యా ఈనెల 2న లండన్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో తాను కోర్టుకు హాజరవుతానని ఈడీ సమన్లకు ఆయన బదులిచ్చారు.

03/30/2016 - 04:59

న్యూఢిల్లీ, మార్చి 29: కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ప్రోరోగ్ చేసి సంచలనం సృష్టించింది. రాజకీయ సంక్షో భం కారణంగా ప్రస్తుతం రాష్టప్రతి పాలనలో ఉన్న ఉత్తరాఖండ్ ఏప్రిల్ 1వ తేదీ తర్వాత ఖర్చుల కోసం నిధులను సమకూర్చేలా ఆర్డినెన్సు జారీకి వీలుకల్పించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది.

03/30/2016 - 04:57

న్యూఢిల్లీ, మార్చి 29: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సియు)లో జరిగిన పరిణామాలపై జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ బృందం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేసింది. మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నాయకుల బృందం రాష్టప్రతిభవన్‌లో ప్రణబ్ ముఖర్జీతో సమావేశం అయింది.

03/30/2016 - 04:09

న్యూఢిల్లీ,మార్చ్ 29: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని సవరించి తెలుగు రాష్ట్రాల శాసనసభల్లో సీట్ల సంఖ్య పెంపునకు ఉద్ధేశించిన బిల్లును రెండో విడత బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ, ఐటి శాఖల మంత్రి కె.తారక రామారావు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఈ డిమాండ్ చేశారు.

03/30/2016 - 04:33

న్యూఢిల్లీ, మార్చి 29: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని సవరించటం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల్లో సీట్ల సంఖ్యను పెంచాలని కేంద్ర హోం శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు మంగళవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.

03/30/2016 - 01:51

ధిపూ (అసోం), మార్చి 29: అసోం శాసనసభ ఎన్నికల్లో బిజెపిని తిరస్కరించాలని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ రాష్ట్ర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బిజెపిని అధికారంలోకి తీసుకువస్తే రాష్ట్రాన్ని నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యాలయం నుంచో లేక ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఓ) నుంచో పరిపాలిస్తారని ఆయన స్పష్టం చేశారు.

Pages