S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/29/2016 - 11:52

చండీగఢ్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంలో గత జనవరిలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి విచారించేందుకు పాకిస్తాన్‌కు చెందిన దర్యాప్తు బృందం మంగళవారం పఠాన్‌కోట్‌కు బయలుదేరింది. ఈ దాడిలో పాక్ ఉగ్రవాదులు పాల్గొన్నట్లు భారత్ ఆరోపించిన సంగతి తెలిసిందే.దీంతో నిజానిజాలు తెలుసుకునేందుకు పాక్ ప్రభుత్వం అయిదుగురు సభ్యులతో నియమించిన దర్యాప్తు బృందం ఇక్కడికి చేరుకుంది.

03/29/2016 - 11:50

దిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీల్లో ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల సంఖ్యను పెంచే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం ఉదయం ఇక్కడ న్యాయశాఖ కార్యదర్శితో సమావేశమై ఈ మేరకు చర్చించారు. ఎపిలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను 225కు, తెలంగాణలో సీట్ల సంఖ్యను 153కు పెంచేందుకు విభజన చట్టాన్ని సవరించాల్సి ఉందని ఆయన తెలిపారు.

03/29/2016 - 04:12

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని రాష్టప్రతి భవన్‌లో సోమవారం పద్మాలు అరవిరిశాయ. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పురస్కారాలు అందచేశారు. ఐదుగురు పద్మ విభూషణ్, ఎనిమిది మంది పద్మ భూషణ్,

03/29/2016 - 03:35

న్యూఢిల్లీ, మార్చి 28: ఆంధ్రప్రదేశ్‌లో రెండు గ్రామాలకు పూర్తిగా సౌర శక్తి ఆధారంగానే విద్యుత్ ప్రసారం కానుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. తూర్పుతల్లు, పెదమ్యానవానిలంక గ్రామాలను ఈ ఏడాది 100 శాతం సౌర విద్యుత్ ఆధారిత గ్రామాలుగా మార్చబోతున్నట్లు సీతారామన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సౌర శక్తిపైనే గ్రామాలు ఆధారపడటం దేశంలోనే ఇది తొలిసారి అని ఆమె తెలిపారు.

03/29/2016 - 03:21

న్యూఢిల్లీ, మార్చి 28: వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు సోమవారం రాష్టప్రతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అవార్డులు అందజేశారు.

03/29/2016 - 03:19

డెహ్రాడూన్ / న్యూఢిల్లీ, మార్చి 28: అసెంబ్లీలో బల నిరూపణ చేయడానికి రాష్ట్ర గవర్నర్ గడువును నిర్ధారించిన నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి రాష్టప్రతి పాలన విధించడాన్ని కాంగ్రెస్ పార్టీ సోమవారం కోర్టులో సవాల్ చేసింది. పదవీచ్యుతుడైన ముఖ్యమంత్రి హరీశ్ రావత్ ఉత్తరాఖండ్ హైకోర్టులో ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు.

03/29/2016 - 03:11

న్యూఢిల్లీ, మార్చి 28: కాంగ్రెస్ పార్టీ పతనానికి నాయకత్వ సమస్యలే ప్రధాన కారణమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అభిప్రాయపడ్డారు. రాజకీయ గుత్త్ధాపత్యంతో దశాబ్దాలపాటు నెట్టుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పప్పులు ఉడకం లేదని ఆయన అన్నారు.

03/29/2016 - 03:10

కోల్‌కతా, మార్చి 28: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు, యువకులు అత్యధికంగా తమ ఓటును వినియోగించుకునేలా చూడాలని కేంద్ర ఎన్నికల కమిషన్ యోచిస్తోంది. పోలింగ్ స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవడంతోపాటు మహిళ, యువత ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి వివిధ మార్గాలను అనే్వషిస్తోంది. వాల్ పోస్టర్లు, హోర్డింగ్‌లు, మీడియా ప్రకటనలే కాకుండా సామాజిక మాద్యమాలను వాడుకోవాలని ఇసి నిర్ణయించింది.

03/29/2016 - 03:09

జైపూర్, మార్చి 28: రాష్టప్రతి పాలన విధించిన ఉత్తరాఖండ్‌లో బిజెపి అన్ని అవకాశాలను పరిశీలిస్తోందని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ తెలిపారు. ఆ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తే మెజార్టీ సాధించగలమని బిజెపి గట్టి విశ్వాసంతో ఉందని ఆయన చెప్పారు. ‘ఉత్తరాఖండ్‌లో ఎన్నికలు నిర్వహిస్తే బిజెపి మెజార్టీ సాధించడం ఖాయం. అయినా అక్కడ గల అన్ని అవకాశాలపై మా పార్టీ రాష్ట్ర శాఖ చర్చిస్తోంది.

03/29/2016 - 03:07

న్యూఢిల్లీ, మార్చి 28: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బహుముఖ పోటీ ఏర్పడటంతో ఓట్లు చీలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది చెప్పటం కష్టంగా మారింది. ఓటర్ల మనోభావాలు తెలుసుకునేందుకు అన్నా డిఎంకె, డిఎంకె, కొత్తగా ఏర్పడిన పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్‌తోపాటు ఒంటరిగా మిగిలిపోయిన బిజెపి, పిఎంకె కూడా సర్వేలు జరిపించుకుంటున్నాయి.

Pages